తెల్ల వెంట్రుకలను పీకేస్తే ఏమౌతుంది?

First Published | Feb 7, 2024, 10:46 AM IST

వయసు పైబడుతున్నప్పుడు జుట్టు తెల్ల బడటం చాలా సహజం. కానీ ప్రస్తుత కాలంలో చిన్న వయసు వారికి కూడా తెల్ల జుట్టు వస్తుంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కానీ ఎక్కడ పెద్ద వయసు వారిలా కనిపిస్తామేమోనని చాలా మంది కనిపించిన తెల్ల వెంట్రుకలనల్లా పీకేయడం మొదలుపెడుతుంటారు. కానీ దీనివల్ల ఏమౌతుందో తెలిస్తే మాత్రం మళ్లీ పీకేసే ప్రయత్నం చేయరు. 
 

Grey hair

వృద్ధాప్యంలో జుట్టు తెల్లబడటం సహజ ప్రక్రియ. ఒకప్పుడు తెల్ల వెంట్రుకలు 40, 50 ఏండ్ల వారికి మాత్రమే వచ్చేవి. ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు వస్తాయి. ఇక ఈ తెల్ల వెంట్రుకలను దాచేందుకు హెయిర్ కలర్ ను వాడుతుంటారు. కానీ ఎక్కువ రోజులు ఉండదు. మీరెన్ని రంగులేసినా.. తెల్ల జుట్టును మాత్రం దాచలేరు. ఇలా అనే చాలా మంది తెల్ల జుట్టునే లేకుండా చేద్దామనుకుంటారు. అదే తెల్ల వెంట్రుకలను పీకేస్తుంటారు. కానీ ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మీరు తెల్ల జుట్టును పీకేయడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

జుట్టు తెల్లబడటానికి కారణాలు

వయస్సు పెరుగుతున్న కొద్దీ.. జుట్టును నల్లగా ఉంచే మెలనిన్, వర్ణద్రవ్యాలు కూడా తగ్గిపోతాయి. ప్రతి హెయిర్ ఫోలికల్ మెలనోసైట్లు అని పిలువబడే వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేసే కణాలను కలిగి ఉంటుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఈ కణాల కార్యకలాపాలు తగ్గుతాయి. అంటే మెలనిన్ తయారు చేసే పని ఆగిపోతుంది. దాని వల్ల జుట్టు తెల్లబడటం మొదలవుతుంది.
 


తెల్ల వెంట్రుకలను ఎందుకు పీకొద్దంటే?

తలలో దురద, మంట

జుట్టును లాగడం, లేదా మొత్తమే పీకెయడం వల్ల నెత్తిమీద తీవ్రమైన దురద, చికాకు కలుగుతుంది. అలాగే దద్దుర్లు కూడా ఏర్పడతాయి. సున్నితమైన చర్మం ఉన్నవారికి సమస్య మరింత పెరుగుతుంది.
 

Grey hair

ఇన్ఫెక్షన్ కావొచ్చు

మీరు తెల్ల వెంట్రుకలను పీకేసినప్పుడు నెత్తిమీద విపరీతమైన దురద పెడుతుంది. దీనివల్ల చాలా మంది అక్కడ బాగా గోకుతారు. కానీ నెత్తిమీద పదేపదే గోకడం వల్ల సంక్రమణ ప్రమాదం ఉంది. అలాగే దీనికి  సకాలంలో చికిత్స చేయకపోతే ఈ ఇన్ఫెక్షన్ మొత్తం నెత్తిమీద ప్రభావం చూపుతుంది.
 

జుట్టు పెరుగుదల

తెల్ల వెంట్రుకలను పీకేసే అలవాటు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇలా వెంట్రుకలను లాగడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడతాయి. దీని ప్రభావం జుట్టు పెరుగుదల, ఆకృతిపై కనిపిస్తుంది.
 

హైపర్పిగ్మెంటేషన్ ప్రమాదం

తెల్ల వెంట్రుకలను తగ్గించుకోవడానికి మీరు వాటిని పీకేయడం మొదలుపెడితే.. ఆ ప్లేస్ లో కొత్త వెంట్రుకలు పెరిగే అవకాశమే ఉండదు. అంతేకాక తెల్ల వెంట్రుకలను పీకేసిన స్థానంలో నల్ల మచ్చలు ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఈ ప్రభావం మీ జుట్టు పెరుగుదలపై కనిపిస్తుంది. అంటే మీ జుట్టు పెరిగే ప్రాసెస్ ఆగిపోతుందన్న మాట.   

Latest Videos

click me!