గింజలు, విత్తనాలు
గింజలు, విత్తనాల్లో విటమిన్ బి 1 పుష్కలంగా ఉంటుంది. ఇవి జుట్టును బాగా పెంచుతాయి. ఇందుకోసం బాదం, చియా విత్తనాలను రోజూ గుప్పెడు తినండి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, జింక్, విటమిన్ ఇ, విటమిన్ బి 1, విటమిన్ బి 6 లు పుష్కలంగా ఉండే బాదం జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. చియా విత్తనాల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలతో సహా ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్, కాల్షియం, జింక్, ఐరన్, ఇతర యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయ. ఇవి జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు సహాయపడతాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు ప్రోటీన్లు, ఖనిజాల భాండాగారం. జుట్టు పెరుగుదలకు అవసరమైన జింక్, విటమిన్ బి 6, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు వీటిలో ఉంటాయి. ఇవి చుండ్రును పోగొడుతాయి.