రాత్రి7 తర్వాత ఈ పనులు.. మీ జీవితాన్నే మార్చేస్తాయి...!

First Published | May 28, 2024, 1:56 PM IST

పుస్తకాలు చదవడం దగ్గర నుంచి.. కొన్ని ముఖ్యమైన మంచి అలవాట్లు నేర్చుకోవాలి అలా కనుక ఈ కింది అలవాట్లు నేర్చుకుంటే... మీ జీవితం  కచ్చితంగా మారిపోతుందట. మరి ఆ అలవాట్లు ఏంటో చూద్దాం...

lifestyle

రోజులో కొన్ని గంటలు మనకు ఆఫీసు పని, మరి కొన్ని గంటలు ఇంటి పనితో గడిచిపోతాయి. మిగిలిన కాసేపు సమయంలో విశ్రాంతి తీసుకోవాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ.. విశ్రాంతి మాత్రమే కాదు.. మీకంటూ మీరు సమయం కేటాయించుకోవాలి.  పుస్తకాలు చదవడం దగ్గర నుంచి.. కొన్ని ముఖ్యమైన మంచి అలవాట్లు నేర్చుకోవాలి అలా కనుక ఈ కింది అలవాట్లు నేర్చుకుంటే... మీ జీవితం  కచ్చితంగా మారిపోతుందట. మరి ఆ అలవాట్లు ఏంటో చూద్దాం...

1.మైండ్ ఫుల్ రిఫ్లెక్షన్..
జరిగిన విషయాలు తలుచుకోవడంలో ఉపయోగం లేదు అని చాలా మంది చెబుతుంటారు. కానీ.. సాయంత్రం సమయంలో మీరు ఉదయం నుంచి జరిగిన విషయాలను తలుచుకోవాలి. చిన్నదైనా, పెద్దదైనా, మంచి అయినా, చెడు అయినా సరే. దాని గురించి ఆలోచించడం వల్ల... వాటికి కారణం తెలుస్తుంది. జరిగిన వెంటనే ఆలోచిస్తే.. కారణం సరిగా తెలీదు. అదే సాయంత్రం వేళ అయితే అసలు కారణం తెలుస్తుంది. దానికి తగినట్లుగా మరోసారి ఆ పని చేసుకోవాలి. ఇక.. రేపటి గురించి కూడా ఏం చేయాలి? ఎలా చేయాలి అనే దాని గురించి ఆలోచించాలి. అప్పుడు మరుసటి రోజు మరింత ఉత్పాదకంగా పని చేయగలుగుతారు.

Latest Videos



2.డిస్ కనెక్ట్ చేయండి..
ఉదయం నుంచి మనం ఏదో ఒక రూపంలో మొబైల్ ఫోన్ వాడుతూనే ఉంటాం. అయితే.. సాయంత్రం 7 తర్వాత దానికి డిస్ కనెక్ట్ అవ్వాలి.  కేవలం ఫోన్ మాత్రమే కాదు.. అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరకాలు, సోషల్ మీడియా, టీవీ లాంటి వాటికి దూరంగా ఉండాలి. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రాత్రి 7 తర్వాత వీటికి దూరంగా ఉంటే,... మీకు ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది. చాలా వరకు ప్రతికూల ఆలోచనలు, ఆందోళనలు తగ్గిపోతాయి. ఆరోగ్యానికి కూడా మంచిది.


3.పుస్తకం చదవడం...
ప్రతిరోజూ పుస్తకం చదవడం అలవాటు చేసుకోవాలి. రోజుకి కనీసం 20 పేజీలు చదవాలి. స్మార్ట్ ఫోన్ లకు దూరంగా ఉన్నప్పుడు చాలా బోర్ గా అనిపిస్తుంది. అలాంటి సమయంలో... పుస్తకం మీద దృష్టి పెట్టాలి. ప్రతిరోజూ 20 పేజీలు చదవడం వల్ల మీ ఏకాగ్రత , పదజాలాన్ని మెరుగుపరచడం నుండి మీ నిద్ర నాణ్యతను మెరుగుపరచడం, మీకు ప్రశాంతతను తీసుకురావడం, మీ జ్ఞానాన్ని మెరుగుపరచడం వరకు అనేక విధాలుగా మీకు సహాయం చేస్తుంది. మీకు ఆసక్తికరంగా అనిపించే పుస్తకాన్ని, నాన్-ఫిక్షన్ లాంటి నవలలు కూడా చదవచ్చు.


4.రేపటి కోసం ప్లాన్ చేసుకోవడం..
ఏ రోజు పని ఆ రోజు చేసుకోవాలి. అది మంచి పద్దతి. అయితే...  అలా చేసుకోవాలి అంటే.. రేపటి కోసం ఈ రోజే ప్లాన్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల.. పని చాలా చక్కగా చేసుకోగలుగుతారు. గందరగోళం ఉండదు. ఏవైనా అపాయింట్‌మెంట్‌లు, మీటింగ్‌లు లేదా ముఖ్యమైన పనులు వంటి అన్ని ముఖ్యమైన విషయాలను సమీక్షించడం లేదా రీకాల్ చేయడం ద్వారా ప్రారంభించండి. వాటిని గమనించండి. ఆ తర్వాత, మీరు ముందుగా చేయాలని భావించే అత్యంత ముఖ్యమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వండి.గుర్తు పెట్టండి. ఆ రోజు తర్వాత ఏ పనులు చేయవచ్చు. క్రమంలో చేయవలసిన పనుల జాబితాను రూపొందించండి 

click me!