1. స్థిరమైన వాతావరణం..
సదరు గ్రహం నీటిని స్థిరంగా ద్రవ రూపంలో ఉంచాలి. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఉండాలి. ఇలా ఉంటేనే ఆ గ్రహంపై జీవం నిలబడుతుంది.
2. నక్షత్రం నుంచి సరైన దూరం
సదరు గ్రహం దాని ఆధారమైన నక్షత్రానికి కచ్చితంగా రక్షణ దూరంలో ఉండాలి. అంటే తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉండకూడదు. నీటిని స్థిరంగా ఉంచేంత దూరంలోనే సదరు గ్రహం ఉండాలి. దీని వల్ల గ్రహంపై నీరు మరిగిపోవడం, లేక గడ్డకట్టుకుపోకుండా ఉంటుంది. అప్పుడు మాత్రమే జీవం మనుగడ సాధ్యమవుతుంది.
3. దట్టమైన వాతావరణం
గ్రహం చుట్టూ ఉన్న వాతావరణంలో ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ వంటి వాయువులు కచ్చితంగా ఉండాలి. ఇవి పొరలుగా ఉండి అంతరిక్షంలోని ప్రమాదకర రేడియేషన్ నుంచి గ్రహాన్ని కాపాడతాయి.
4.రక్షిత అయస్కాంత క్షేత్రం
అయస్కాంత క్షేత్రం హానికరమైన రేడియేషన్ నుంచి గ్రహాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా సౌర గాలుల వల్ల వాతావరణం దెబ్బతినకుండా రక్షిస్తుంది.
5. నీటి లభ్యత అత్యవసరం..
జీవం మనుగడ సాగించాలంటే ద్రవ రూపంలో ఉండే నీరు అత్యవసరం. ఆహారం లేకపోయినా జీవులు కొన్ని రోజుల వరకు బతకగలవు. కానీ నీరు లేకపోతే వెంటనే చనిపోతాయి. అందువల్ల సదరు గ్రహంపై నీటి ఉనికి కోసం శాస్త్రవేత్తలు పరీక్షలు చేస్తారు.
6. శక్తి వనరుల కలయిక అవసరం..
ఏ గ్రహంపైనైనా జీవం మనుగడ సాగించాలంటే అనేక రకాల శక్తుల కలయిక అవసరం. అవి నక్షత్ర శక్తి, ఉష్ణ శక్తి, వాయు శక్తి, ఇతర గ్రహాల మధ్య దూరం మొదలైనవి. ఇవన్నీ సక్రమంగా పనిచేస్తేనే జీవం పుట్టుక, మనుగడ సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
7.భౌగోళిక మార్పులుండాలి..
అగ్ని పర్వతాలు ఎంతో ప్రమాదకరమని అందరూ భావిస్తారు. కాని అవి బద్దలవుతూ ఉండాలి. అప్పడు మాత్రమే వాయువులు రీసైక్లింగ్ అవుతాయి. పర్వతాలు కూడా కాలానుగుణంగా మార్పులు చెందాలి. ఇతర గ్రహాలపై ఇలాంటి వాతావరణం కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తారు.