ఓల్డ్ మంక్ గులాబ్ జామూన్... ఆల్కహాల్ ప్రియులకు నచ్చే కాంబినేషన్.. సోషల్ మీడియాలో వైరల్...

First Published | Sep 7, 2021, 1:33 PM IST

గులాబ్ జామ్, ఆల్కహాల్ ప్రియులకోసం ఇప్పుడో కొత్త రకం కాంబినేషన్ రెడీ అయ్యింది. అదే ఓల్డ్ మంక్ లో ముంచిన గులాబ్ జామూన్లు. వినడానికి ఈ కాంబినేషన్ కాస్త విచిత్రంగా అనిపించినా... ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. 

గులాబ్ జామ్ అంటే మీకు ఇష్టమా... ఎన్ని జామూన్లైనా ఇట్టే మింగేస్తారా? మరి ఆల్కహాల్...? అది కూడా ఇష్టమేనా? అందులోనూ ఓల్డ్ మంక్ రమ్ అంటే నాలుక లాగుతుందా? అయితే ఇది మీ కోసమే.. 

old monk

గులాబ్ జామ్, ఆల్కహాల్ ప్రియులకోసం ఇప్పుడో కొత్త రకం కాంబినేషన్ రెడీ అయ్యింది. అదే ఓల్డ్ మంక్ లో ముంచిన గులాబ్ జామూన్లు. వినడానికి ఈ కాంబినేషన్ కాస్త విచిత్రంగా అనిపించినా... ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. 


ఈ వీడియోలో ఓ వ్యక్తి అప్పుడే తయారుచేసిన మృధువైన గులాబ్ జామూన్లకు ఓల్డ్ మంక్ రమ్ ను ఇంజెక్షన్ తో ఎక్కిస్తున్నాడు. ఆ తరువాత ఓ మూతతో ఇంకాస్త ఓల్డ్ మంక్ ను వాటి మీద పోసి.. ఎంచక్కా గుటుక్కు, గుటుక్కు మంటూ లాగించేశాడు. 

ఆగస్ట్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ ఫ్యూజన్ కాంబినేషన్ ను ప్రశంసించేవారు.. ప్రశంసిస్తుంటే.. ఇదేం కాంబినేషన్ అని చిరాకు పడేవారు పడుతున్నారు. 

స్వీట్ విత్ ఆల్కహాల్ కాంబినేషన్ నెటిజన్లను వెర్రెత్తేలా చేస్తోంది. ఈ వీడియో అతి తక్కువ సమయంలోనే వైరల్ అయింది. ఇప్పటి వరకు 5 మిలియన్ వ్యూస్, 76K లైక్‌లు, 2.3K కామెంట్‌లు, 11K షేర్లను సంపాదించింది.

ఒక వినియోగదారు దీని గురించి కామెంట్ చేస్తూ, "ఇప్పుడు అవి కొన్ని రుంబల్స్," మరొకరు తీపి "మాంక్-గుల్లా" ​​అని పిలిచారు. మరొకరు దీనిని "ఓల్డ్ మాంక్ జామున్" అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు.

మీకూ నచ్చాయా.. ఇంకేం ఈ బూజీ బాల్స్‌ను ఇంట్లో తయారు చేయాలనుకుంటున్నారా?  అయితే, మీరు సరైన మొత్తంలో ఆల్కహాల్ ఇంజెక్ట్ చేయండి. లేదంటే అది మిమ్మల్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఆల్కహాల్, విత్ స్వీట్ కాంబినేషన్ ఎలాంటి చెడు ప్రభావాలకు దారి తీస్తుందో తెలియదు కదా.. ఏదైనా మోతాదులో ఉంటే మంచిది. 

Latest Videos

click me!