Beauty Tips: అందానికి చిట్కాలు ఆడవాళ్ళకేనా.. ఈ సింపుల్ చిట్కాలు మగవాళ్ళ కూడా?

Published : Jul 06, 2023, 12:17 PM IST

Beauty Tips: అందంగా కనిపించడం కోసం ఇప్పుడు అమ్మాయిల కన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అబ్బాయిలు. అందం కోసం ఆలోచించే అబ్బాయిల కోసమే ఈ సింపుల్ చిట్కాలు. వాటిపై ఓ లుక్కేద్దాం.  

PREV
16
Beauty Tips: అందానికి చిట్కాలు ఆడవాళ్ళకేనా.. ఈ సింపుల్ చిట్కాలు మగవాళ్ళ కూడా?

 ఒకప్పుడు అందం కోసం ఎక్కువ ఇంపార్టెన్స్ ఆడవాళ్లే ఇచ్చేవారు. వారిని చూసి ఎగతాళి చేసేవారు మగవాళ్ళు. కానీ నేటి తరం అబ్బాయిలు అమ్మాయిలు కన్నా ఎక్కువగా అందానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అమ్మాయిల లాగే గంటల తరబడి రెడీ అవుతున్నారు. అందం కోసం పార్లల్స్ కి కూడా వెళుతున్నారు.
 

26

మగవారి కోసమే ప్రత్యేకంగా పార్లల్స్ వెలుస్తున్నాయి అనేదే దీనికి నిదర్శనం. అయితే అమ్మాయిలకు మాత్రమే అందానికి చిట్కాలు మాకు లేవా అనకండి మీకోసమే ఈ చిట్కాలు. ఆడవాళ్ళతో పోల్చుకుంటే మగవాళ్ళ స్కిన్ రఫ్ గా ఉంటుంది కాబట్టి కొంచెం ఆలివ్ ఆయిల్..

36

 ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ కాఫీ పొడిని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఫేస్ కి అప్లై చేసి 15 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయండి ఇది మీ చర్మ కణాలు తొలగించి చర్మం తాజాగా మృదువుగా చేయటానికి ఉపయోగపడుతుంది.
 

46

అలాగే షేవింగ్ చేసుకునేటప్పుడు కూడా షేవింగ్ జల్ ని పట్టించి ఒక ఐదు నిమిషాలు తర్వాత షేవ్ చేసుకుంటే అక్కడ స్కిన్ మృదువుగా అవుతుంది. సేవింగ్ జల్ లేని సమయంలో కండిషనర్ ని ఉపయోగించండి అది కూడా స్కిన్ స్మూత్ గా షైన్ గా ఉండటానికి ఉపయోగపడుతుంది .
 

56

ముఖం పొడిబారినట్లుగా అనిపిస్తే నిమ్మరసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకొని 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది మీ ముఖాన్ని పొడిబారినివ్వకుండా చేస్తుంది.కాలుష్యం వల్ల మీ ముఖం తాజాదనాన్ని కోల్పోకుండా అనాసపండుని ఉపయోగించండి.

66

అనాస పండు ముక్కతో ముఖాన్ని వృద్ధి తర్వాత చల్లటి నీటితో కడుక్కోవడం వల్ల ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక 15 నిమిషాల పాటు ముఖంపై ఐస్ క్యూబ్ తో రుద్దటం వలన ముఖం కాంతివంతంగా తయారవుతుంది. సో అబ్బాయిలు ఎక్కడ తగ్గకుండా ఈ చిట్కాలు పాటించి మరింత అందంగా తయారవ్వండి.

click me!

Recommended Stories