పరగడుపున గ్రీన్ టీ తాగొచ్చా? రోజుకు ఎన్ని కప్పులు తాగొచ్చు?

First Published | Sep 21, 2021, 3:20 PM IST

కొంతమంది రోజుకు ఒక కప్పు గ్రీన్ టీ తాగితే.. మరికొంతమంది రోజుకు ఐదు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల గ్రీన్ టీ తాగుతుంటారు. అయితే, ఎన్ని కప్పుల గ్రీన్ టీ తాగాలి? ఎప్పుడు తాగితే దాంట్లోని అన్ని ప్రయోజనాలు పొందొచ్చు? 

వెయిట్ లాస్ కోసం ప్రయత్నించే వారికి చక్కటి, అద్భుతమైన పానీయం గ్రీన్ టీ. ఇది అన్నిరకాల వెయిట్ లాస్ ప్లాన్స్ లోనూ ప్రముఖంగా ఉంటుంది. ఎందుకంటే గ్రీన్ టీ తయారీలో ఆక్సిడైజ్ చేయని తేయాకులను ఉపయోగిస్తారు. అతి తక్కువ ప్రాసెస్ చేసిన టీలలో గ్రీన్ టీ ఒకటి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.  

అందుకే గ్రీన్ టీని చాలామంది ఇష్టపడతారు. కొంతమంది రోజుకు ఒక కప్పు గ్రీన్ టీ తాగితే.. మరికొంతమంది రోజుకు ఐదు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల గ్రీన్ టీ తాగుతుంటారు. అయితే, ఎన్ని కప్పుల గ్రీన్ టీ తాగాలి? ఎప్పుడు తాగితే దాంట్లోని అన్ని ప్రయోజనాలు పొందొచ్చు? అనే విషయాల గురించి తెలుసుకుంటే... గ్రీన్ టీని పూర్తిగా ఆస్వాదించొచ్చు. 


గ్రీన్ టీ ఎలా తయారు చేస్తారంటే.. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ లిటరేచర్ రివ్యూ ప్రకారం, గ్రీన్ టీని తయారు చేయడానికి, తాజాగా పండించిన ఆకులను పులియబెట్టడాన్ని నిరోధించడానికి వెంటనే స్టీమ్ చేస్తారు. దీనివల్ల ఆకులు పొడిగా మారిపోయి గ్రీన్ టీ తయారవుతుంది. స్టీమింగ్ వల్ల ఆకుల రంగును మార్చే ఎంజైమ్‌లకు డిస్ట్రాయ్ అవుతాయి. అందుకే ఈ ఆకుల్ని రోలింగ్,ఎండబెట్టడం ప్రక్రియ పూర్తయినతరువాత కూడా టీ రంగు గ్రీన్ గానే వస్తుంది. 

ఎక్కువ అంటే ఎంత ?...గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, కెఫిన్ ఉంటుంది. అందుకే గ్రీన్ టీకి రోజుకి మూడు కప్పుల కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల రాత్రి పూట నిద్ర డిస్ట్రబ్ అవుతుంది. దీంతోపాటు శరీరంలోని అవసరమైన పోషకాలు గ్రీన్ టీతో పాటు మూత్రంలో వెళ్లిపోతాయి. 

అందుకే గ్రీన్ టీ ని ఎప్పుడు తాగితే మంచిదో తెలిసి ఉండాలి. పగటిపూట లేదా సాయంత్రం అల్పాహారంతో గ్రీన్ టీ తాగడం వల్ల.. దీంట్లోని ప్రయోజనాలను పూర్తిగా పొందవచ్చు. ఇక ఖాళీ కడుపుతో గ్రీన్ టీని అస్సలు తీసుకోవద్దు. 

గ్రీన్ టీని భోజనానికి రెండు గంటల ముందు గానీ, రెండు గంటల తర్వాత కానీ తాగాలి. భోజనాల మధ్య గ్రీన్ టీ తాగడం వల్ల పోషకాలు తీసుకోవడం తగ్గిపోతుంది. అంతేకాదు మీ ఆహారం నుండి ఇనుము, ఖనిజాలను గ్రహించడాన్ని నిరోధిస్తుంది. అందువల్ల, పగటిపూట ఒకటి రెండు కప్పులు తాగడం మంచిది. IBS తో బాధపడుతున్న వ్యక్తులు గ్రీన్ టీ తాగడం మానుకోవాలి.

గ్రీన్ టీ ప్రయోజనాలు : గ్రీన్ టీ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, పెద్దప్రేగు, నోటి ఎసోఫేగస్, కడుపు, చిన్న ప్రేగు, మూత్రపిండాలు, క్లోమం, క్షీర గ్రంధుల వంటి అనేక వ్యాధుల నివారణకు బాగా పనిచేస్తుంది. ఇది మీ జీవక్రియను పెంచుతుంది. తద్వారా మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

గ్రీన్ టీలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్స్, మినరల్స్, విటమిన్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. దీనివల్ల గ్రీన్ టీ తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. దీంట్లో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. గ్రీన్ టీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గ్రీన్ టీ వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.  అందువల్ల స్ట్రోక్, అతిసారం వంటి చర్మ సంబంధిత, జీవక్రియ సంబంధిత వ్యాధులను మెరుగుపరుస్తుంది.
 

Latest Videos

click me!