బరువు తగ్గుతామని గ్రీన్ టీని తెగ తాగుతున్నారా? అయిపాయే.. మీకు ఆ సమస్యలు వచ్చి ఉంటాయి..

Published : Apr 19, 2022, 01:22 PM IST

Green Tea Side Effects:  టీ, కాఫీల కంటే.. గ్రీన్ టీ మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనందరికీ తెలిసిందే. కానీ గ్రీన్ టీని మోతాదుకు మించి తాగడం వల్ల ఎన్నో అనార్థాలు జరుగుతాయి. అవేంటంటే.. 

PREV
19
బరువు తగ్గుతామని గ్రీన్ టీని తెగ తాగుతున్నారా? అయిపాయే.. మీకు ఆ సమస్యలు వచ్చి ఉంటాయి..

Green Tea Side Effects: కాఫీ, టీ లకంటే గ్రీన్ టీనే ఎంతో మంచిది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి మనల్నిఎన్నో రోగాల నుంచి రక్షిస్తాయి. అంతేకాదు ఈ గ్రీన్ టీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అందుకే జనాలు దీన్నే ఎక్కువగా తాగుతున్నారు. ఇది బరువును తగ్గించండానికి కూడా ఎంతో సహాయపడుతుంది. అందుకే చాలా మంది ఓవర్ వెయిట్ నుంచి బయటపడాలని దీన్ని మోతాదుకు మించి తాగుతున్నారు. 

29

అయితే ఇన్ని ప్రయోజనాలున్న గ్రీన్ టీని మోతాదుకు మించి తాగడం మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు రెండు మూడు కప్పుల గ్రీన్ టీని తాగితే ఎటువంటి నష్టం లేదు. కానీ ఇంతకు మంచితేనే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

39

జీర్ణక్రియ సమస్యలు.. గ్రీన్ టీని మోతాదుకు మించి తీసుకోవడం జీర్ణక్రియకు ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే దీనిలో ఉండే టానిన్, అసలైన అనే మూలకాలు ఎసిడిటీ సమస్యను పుట్టిస్తాయి. అంతేకాదు గ్రీన్ టీని రోజులో ఎక్కువ సార్లు తాగితే మలబద్దకం, కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యల బారిన పడాల్సి వస్తుంది. 

49
migraine

తలనొప్పి.. గ్రీన్ టీ ఎన్నో సమస్యలకు మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. రోజుకు రెండు మూడు కప్పుల గ్రీన్ టీ తాగితే.. తీవ్రమైన తలనొప్పి కూడా ఇట్టే తగ్గిపోతుంది. కానీ మోతాదుకు మించి గ్రీన్ టీని తాగితే మాత్రం విపరీతమైన తలనొప్పి వస్తుంది. మైగ్రేన్ సమస్య కూడా అటాక్ చేస్తుంది. 

59

నిద్రకరువవడం.. టీ, కాఫీలతో పోల్చిగే గ్రీన్ టీలో కెఫిన్ తక్కువ మొత్తంలోనే ఉంటుంది. కానీ ఈ గ్రీన్ టీని మోతాదుకు మించి తాగితే.. ఒంట్లో కెఫిన్ పెరిగిపోతుంది. దీంతో మెలటోనిన్ అనే హార్మోన్ పై చెడు ప్రభావం పడుతుంది. దీంతో మీకు నిద్రపట్టదు.
 

69

రక్తహీనత సమస్య.. గ్రీన్ టీని పరిమితికి మించి తాగితే మన బాడీలో ఐరన్ శోషణపై చెడు ప్రభావం పడుతుంది. అంతేకాదు ఒంట్లో రక్తం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. 

79
Vomiting

వాంతులు.. గ్రీన్ టీలో ఉండే టానిన్ పేగుల్లోని ప్రోటీన్ ను అమాంతం తగ్గించేస్తుంది. దీంతో మీకు వికారం, వాంతులు వంటి సమస్యలు ఏర్పడవచ్చు. 

89

ఎముకలు బలహీనపడతాయి.. గ్రీన్ టీ ఎముకల ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. దీన్ని మోతాదుకు మించి తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనంగా తయారవుతాయి. అంతేకాదు బోలు ఎముకల జబ్బు బారిన కూడా పడొచ్చు. 

99

రక్తపోటు సమస్య.. గ్రీన్ టీని పరిమితికి మించి తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గిపోతుంది. కాబట్టి వీటిని మోతాదులోనే తీసుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వారు గ్రీన్ టీని తాగేముందు వైద్యులను సంప్రదించడం మంచిది.  

Read more Photos on
click me!

Recommended Stories