శ్రావణమాసం వేళ...భారీగా తగ్గుతున్న బంగారం ధరలు, కొనేందుకు కరెక్ట్ టైమ్..?

First Published | Aug 7, 2024, 2:51 PM IST

నెమ్మదిగా  బంగారం ధరలు దిగి వస్తున్నాయి. సంతోషంగా బంగారు దుకాణంలోకి అడుగుపెట్టి.. కావాల్సింది కొనుక్కోవచ్చు అనే  ధీమా వచ్చేసింది. 
 

శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసం అనగానే మహిళలు కచ్చితంగా బంగారం కొనాలి అని అనుకుంటూ ఉంటారు. అంతేకాదు..  ఈ సీజన్ లో పెళ్లిళ్లు,శుభకార్యాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. శుభకార్యం అంటే.. బంగారం కొనాల్సిందే. కానీ.. ఆ మధ్యకాలంలో బంగారం ధరలు భారీ గా పెరిగిపోవడంతో.. దాని జోలికి పోవాలి అంటేనే సామాన్యులు భయపడిపోయారు. కానీ.. నెమ్మదిగా  బంగారం ధరలు దిగి వస్తున్నాయి. సంతోషంగా బంగారు దుకాణంలోకి అడుగుపెట్టి.. కావాల్సింది కొనుక్కోవచ్చు అనే  ధీమా వచ్చేసింది. 
 

బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు క్షీణించాయి. ఈ ప్రభావం పసిడి పెట్టుబడిదారులపై తీవ్రంగా పడింది, దీంతో గ్లోబల్ గోల్డ్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. ఈ నేపథ్యంలో, బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి.
 


అమెరికా డాలర్ పుంజుకోవడం , రూపాయి మారకం విలువ తగ్గిపోవడం వంటి కారణాలు కూడా బంగారం ధరల పతనానికి దోహదం చేశాయి అని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన వేళ, బంగారం ధరలు భారీగా తగ్గడాన్ని శుభ పరిణామంగా భావిస్తున్నారు. ఇది గిరాకీ మరింత పెరగడానికి దోహదం చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
 

gold rate

హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.870 కి పడిపోయింది. నేడు పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.69,710కి చేరుకుంది. ఇక.. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.800 తగ్గి.. రూ.63, 900కి చేరింది.

న్యూఢిల్లీ:

24 క్యారట్ బంగారం: ₹69,420 (ప్రతి 10 గ్రాములకి)
22 క్యారట్ బంగారం: ₹63,650 (ప్రతి 10 గ్రాములకి)

ముంబై:

24 క్యారెట్ బంగారం: ₹69,270 (ప్రతి 10 గ్రాములకి)
22 క్యారెట్ బంగారం: ₹63,500 (ప్రతి 10 గ్రాములకి)
 

చెన్నై:

24 క్యారెట్ బంగారం: ₹70,590 (ప్రతి 10 గ్రాములకి)
22 క్యారెట్ బంగారం: ₹64,470 (ప్రతి 10 గ్రాములకి)

బెంగళూరు:

24 క్యారెట్ బంగారం: ₹69,810 (ప్రతి 10 గ్రాములకి)
22 క్యారెట్ బంగారం: ₹63,990 (ప్రతి 10 గ్రాములకి)


కోల్కతా:

24 క్యారెట్ బంగారం: ₹69,700 (ప్రతి 10 గ్రాములకి)
22 క్యారెట్ బంగారం: ₹63,890(ప్రతి 10 గ్రాములకి)

Latest Videos

click me!