ఈ ఒక్కటి తిన్నా.. బరువు పెరుగుతారు

First Published | Aug 8, 2024, 5:17 PM IST

కొంతమంది బరువు ఎక్కువగా ఉన్నామని బాధపడితే.. మరికొంతమంది బరువు మరీ తక్కువగా ఉన్నామే అని బాధపడుతుంటారు. అయితే మరీ సన్నగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఏం తినాలో తెలుసా?
 


కొంతమంది ఉండాల్సిన బరువు కంటే మరీ సన్నగా, పుల్లగా ఉంటారు. వీరికి ఏ డ్రెస్ లు సెట్ కావు. ఇక వీళ్లు బరువు పెరగాలని ఏవి పడితే అవి తింటుంటారు. అయినా బరువు పెరగరు. కానీ ఏవి పడితే అవి తింటే బరువు సంగతి పక్కన పెడితే మీకు లేనిపోని వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. బరువు బరువు పెరగాలనుకుంటే బెల్లం తినండి. అవును బెల్లం మీరు  ఆరోగ్యంగా బరువు పెరగడానికి బాగా సహాయపడుతుంది. బెల్లాన్ని నెయ్యితో గనుక తిన్నట్టైతే మీరు కోరుకున్న బరువుకు చేరుకుంటారు.
 


బెల్లాన్ని ఎలా తినాలి?

ముందుగా ఒక టీస్పూన్ నెయ్యి తీసుకోండి. దీనిలో నాలుగైదు గ్రాముల బెల్లాన్ని వేసి కలపండి. దీన్ని తినండి. దీన్ని రెండు వారాల పాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కావాలనుకుంటే మీరు ఈ బెల్లం పరిమాణాన్ని పెంచుకోవచ్చు.

Latest Videos


jaggery

ఎప్పుడు తినాలి?

బెల్లం, నెయ్యిని మీరు ఆహారంతో లేదా భోజంన చేసిన తర్వాత తినొచ్చు. ఈ రెండు విధాలుగా తిన్నా మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది. మీ బరువు పెరగడంలో గేదె నెయ్యి మరింత ప్రభావవంతంగా ఉంటుంది. కానీ మొదట్లో ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించండి. నెల రోజుల తర్వాత గేదె నెయ్యిని తీసుకోండి. 
 

fake ghee oil


నెయ్యి ప్రయోజనాలు

నెయ్యి మనల్ని సహజ పద్ధతిలో బరువు పెంచుతుంది.  నెయ్యి చల్లని ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది వాత, పిత్త దోషాలను తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియ, చర్మం, జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలను తగ్గించడానికి మీ ఆహారంలో కొద్దిగా నెయ్యి తీసుకుంటే సరిపోతుంది. అంతేకాకుండా నెయ్యి కండరాలను శక్తితో దృఢంగా మారుస్తుంది.
 

jaggery

బెల్లం వల్ల కలిగే ప్రయోజనాలు

బెల్లం వాత, పిత్త దోషాలను తగ్గిస్తుంది. బెల్లం తినడం వల్ల మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు బెల్లాన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే దగ్గు, జలుబు  వంటి సమస్యలకు కూడా బెల్లం ఎంతో మేలు చేస్తుంది.
 

click me!