ఒక్క పోస్ట్ తో సోషల్‌ మీడియా స్టార్‌గా మారిపోయిన ఇంటి ఓనర్‌

First Published | Aug 25, 2024, 11:54 AM IST

సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ వైరల్‌గా మారింది. కొన్నేళ్లుగా తన ఇంటి యజమాని అద్దె పెంచడం లేదని, పైగా రాత్రి పూట భోజనం కూడా  పెడుతున్నారని ఓ టెనెంట్‌(అద్దెకుండే వ్యక్తి) ఆనందాన్ని పంచుకున్నారు. బెంగలూరు లాంటి మహానగరంలో ఇలాంటి ఓనర్ ఉండటం చాలా అదృష్టమని, ఆయన్ను పొగుడుతూ పోస్ట్‌ పెట్టారు. దీనికి నెటిజన్లు విపరీతంగా స్పందించి ఆ ఓనర్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 

దేశంలోని మహానగరాల్లో ఒకటైన బెంగలూరు అనేక రకాలుగా ఫేమస్‌. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు విపరీతంగా ఉన్న ఈ సిటీలో సౌకర్యాలకు కొరతే ఉండదు. చల్లటి వాతావరణం, ఎప్పడూ ఏదో ఒక చోట వర్షం పడుతూ ఉండటం ఈ నగరం ప్రత్యేకత. ఇలాంటి ఎన్నో ప్రత్యేకలుండటంతో ఇక్కడ అద్దెకుండాలంటే రూ.వేలల్లోనే సమర్పించాల్సి ఉంటుంది మరి. 
 

అలాంటి ఈ బెంగలూరులో ఓ ఇంటి ఓనర్‌ తన ఇంట్లో అద్దెకుండే వారితో చాలా మర్యాదగా, సరదాగా, ఇంటిలోని వ్యక్తిలా ప్రవర్తిస్తాడట. ఈ విషయాన్ని అతని ఇంట్లో అద్దెకుండే ఓ వ్యక్తి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ రెడ్డిట్‌లో పంచుకున్నాడు. తన ఇంటి యజమాని స్నేహం, హెల్పింగ్‌ నేచర్‌ గురించి ఓ పోస్ట్‌ పెట్టాడు. 

Latest Videos


అందులో ఏముందంటే..  తన ఇంటి యజమాని 65 ఏళ్ల వయసులోనూ దాతృత్వం చాటుకుంటున్నారని, అయిదేళ్లుగా ఆ ఇంటిలో ఉంటున్నా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా అద్దె పెంచలేదన్నారు. అంతే కాకుండా ఒక్కో సారి రాత్రి వేళ తనకోసం భోజనం కొని తెస్తారని పొగడ్తలతో ముంచెత్తారు. ఆయన తనకు జీవితానుభవాల గురించి వివరిస్తూ సలహాలు కూడా ఇస్తుంటారన్నారు.

దీనికి నెటజన్లు విపరీతంగా స్పందించారు. బెంగలూరులో అధిక అద్దెల వల్ల ఇళ్లు దొరకడమే కష్టంగా మారిన ఈ రోజుల్లో ఇలాంటి ఇంటి ఓనర్‌ చాలా మంచివారంటూ కొందరు, ఇలాంటి వ్యక్తి బెంగలూరులో ఉండటం చాలా గ్రేట్‌ అంటూ మరికొందరు, మా ఇంటి ఓనర్‌ కూడా ఇలా మారితే బాగుంటుంది అంటూ ఇంకొంతమంది కామెంట్‌లు పెడుతూ పొగడ్తలతో ముంచెత్తారు. మరికొందరు తమ ఇంటి ఓనర్ల గురించి రాయడం ప్రారంభించారు. ఈ పోస్టులు ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలోనూ షేర్‌ అయ్యాయి. వైరల్‌గా మారాయి. దీంతో ఆ ఇంటి ఓనర్‌ రాత్రికి రాత్రి స్టార్‌గా మారిపోయారు. 

click me!