ఏం చేస్తే.. ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయో తెలుసా?

First Published | Nov 21, 2024, 2:52 PM IST

చలికాలంలో ఇంట్లోకి దోమలు విపరీతంగా వస్తుంటాయి. దోమలు రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవి రావడం మాత్రం మానవు. అయితే మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు. 

వర్షాకాలంలోనే కాదు చలికాలంలో కూడా ఇంట్లోకి దోమలు, ఈగలు, ఇతర కీటకాలు ఎక్కువగా వస్తుంటాయి. వీటివల్ల మనం ఎన్నో జబ్బుల బారిన పడాల్సి వస్ తుంది. ముఖ్యంగా దోమలు రాత్రిపూట మనం నిద్రపోకుండా కుడుతూనే ఉంటాయి. దీనివల్ల డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందుకే దోమలు ఇంట్లోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. 

దోమకాటు చాలా డేంజర్ కాబట్టి.. వీటిని ఇంట్లోకి రాకుండా చేయాలి. అయితే చాలా మంది దోమలు రాకుండా ఉంటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా దోమలు మాత్రం వస్తూనే ఉంటాయి. కానీ వెల్లుల్లితో దోమలు ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాకుండా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


వెల్లుల్లితో దోమలను తరిమికొట్టడం ఎలా?

వెల్లుల్లి దాదాపు ప్రతి వంటగదిలో ఉంటుంది. ఎందుకంటే దీనిని మనం రెగ్యులర్ గా వంట్లో ఉపయోగిస్తాం. ఇది మనల్ని ఎన్నో రోగాల నుంచి కాపాడుతుంది. ఇది అందరికీ తెలిసిందే. 

కానీ ఈ వెల్లుల్లితో కూడా ఇంట్లోకి దోమలు రాకుండా చేయొచ్చన్న ముచ్చట ఎవ్వరికీ తెలియదు. అవును  వెల్లుల్లి వాసన దోమలకు అస్సలు నచ్చదు. కాబట్టి దీని వాసనకు ఇంట్లో ఒక్క దోమ లేకుండా పారిపోతాయి.ఇందుకోసం వెల్లుల్లిని ఎలా ఉఫయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

వెల్లుల్లి స్ప్రే:

ఇంట్లో దోమలు లేకుండా చేయడానికి వెల్లుల్లిని బాగా దంచండి. దీన్ని గ్లాస్ నీళ్లలో వేసి బాగా మరిగించండి. ఈ నీళ్తలను బాగా చల్లార్చి స్ప్రే బాటిల్ లో నింపండి. దీన్ని సాయంత్రం లేదా రాత్రిపూట ఇంట్లో స్ప్రే చేయండి. దీనివల్ల ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు. ఉన్న దోమలు కూడా ఇంట్లో నుంచి పారిపోతాయి.

దోమలను తరిమికొట్టడానికి ఇతర మార్గాలు:

- కర్పూరంతో కూడా ఇంట్లో దోమలు లేకుండా చేయొచ్చు. ఇందుకోసం కర్పూరాన్నివెలిగించండి. దీనివల్ల ఇంట్లో దోమలు లేకుండా వెంటనే పారిపోతాయి. 

- ప్రతిరోజూ ఇంట్లో  సాయంత్రం పూట వేప ఆకులను కాల్చితే కూడా దీని వాసనకు ఇంట్లోకి దోమలు రావు. 

-  దోమలు కుట్టకుండా ఉండాలంటే కాళ్లు చేతులకు ఆవ నూనె రాయండి. 

- అలాగే తులసి వాసనకు కూడా ఇంట్లోకి దోమలు రావు. కాబట్టి తులసి వాటర్ ను స్ప్రే చేయండి. 

- ఇంట్లో దోమలను తరిమికొట్టడానికి నిమ్మకాయ, లవంగాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం నిమ్మకాయను తీసుకొని రెండు ముక్కలుగా కోసి దానిపై లవంగాలను గుచ్చండి.

click me!