గణేష్ చతుర్థి 2022: గణపయ్య దంతం ఎందుకు విరిగింది.. ఎలుకే వాహనంగా ఎందుకుంది.. వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం

First Published | Aug 30, 2022, 4:54 PM IST

గణేష్ చతుర్థి 2022: రేపే  వినాయక చవితి.  ఈ సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల ముద్దుల తనయుడు గణేషుడి గురించి  కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం పదండి.. 
 

గణేష్ చతుర్థి 2022: ఈ ఏడాది వినాయక చవితి ఆగస్టు 31నాడు ప్రారంభం కానుంది. అంటే రేపే. ప్రతి ఏడాది వినాయక చవితి భాద్రపద శుక్లపక్షంలోని చతుర్థి నాడు ప్రారంభమవుతుంది. ఈ పండుగను 10 రోజుల పాటు జరుపుకుంటారు. పురాణాల ప్రకారం.. వినాయకుడు చతుర్థి నాడే జన్మించాడు. ఆయన జననాకి గుర్తుగానే మనం వినాయక చవితిని జరుపుకుంటున్నాం..

హిందువులకు ఎంతో పవిత్రమైన పండుగల్లో ఇదీ ఒకటి.  అందుకే వినాయక చవితి వేడుకలను దేశ వ్యాప్తంగా జరుపుకుంటారు. అందులోనూ మహారాష్ట్రలో వినాయకుడి ఉత్సవాలు ఇంకా ఘనంగా జరుగుతాయి. ఇక వినయాక చవితి సందర్భంగా భక్తులు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి నిష్టగా 10 రోజుల పాటు పూజిస్తారు.


ganesh chaturthi

ఈ పదిరోజుల పాటు రకరకాల ప్రసాదాలను వినాయకుడికి సమర్పిస్తారు. అందులో బొజ్జ గణపయ్యకు మోదకాలు, లడ్డూలంటే మహా ఇష్టం. అందుకే భక్తులంతా విఘ్నేశ్వరునికి వీటిని నైవేద్యంగా సమర్పిస్తారు. పిల్లలకు, పెద్దలకు ఎంతో ఇష్టమైన ఈ పండుగ రేపే కాబట్టి గణపయ్య  గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం పదండి.. 

ganesh chaturthi 2022

బొజ్జ గణపయ్యే అందరి దేవుల్లో మొదటగా పూజలందుకుంటారు. పురాణాల ప్రకారం.. అగలాసురుడు అనే అసురుడు ఉండేవాడు. ఇతను ఋషులను సజీవంగా మింగేవాడు. అప్పుడు గణేషుడు రాక్షసురుడైన అసురుడి నుంచి ప్రతి ఒక్కరినీ రక్షించేందుకు.. అసురిడిని మింగేస్తాడు. దీంతో గణేషుడి కడుపులో మంట పుడుతుంది. అప్పుడు వినాయకుడి కడుపు మంటను తగ్గించుకోవడానికి ఋషి కశ్యపుడు దుర్వాను ఇస్తాడు. ఇది అతనికి కడుపు మంటను తక్షణమే తగ్గిస్తుంది. అందుకే  'దూర్వా' భగవంతునికి సమర్పిస్తారు. 

ganesh chaturthi 2022

గణపయ్య వాహనం moushak (ఎలుక) అని మనందరికీ తెలుసు. ఈ ఎలుక ఏకదంతుని వాహనంగా ఎలా మారిందో తెలుసా..? పురాణాల ప్రకారం.. గణపతి దేవుడు శిక్షించిన మొదటి రాక్షసుడు మౌషక్. కానీ అతన్నే ఎలుకగా మార్చాడు. ఆ తర్వాత ఆయన అభ్యర్థన మేరకు మాత్రమే గణేషుడు మౌషక్ ను తన వాహనంగా మార్చుకుంటాడు. గణపతి బప్పాను 'మౌషక్ రాజ్'  అని కూడా అంటారు. 

ganesh chaturthi 2022:


గణేశుడికి రచనలో ప్రత్యేక నైపుణ్యం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే వేద వ్యాసుడు మహాభారత కథను ఒకేసారి రాసేందుకు గణపయ్యను ఎంచుకుంటాడు. అయితే ఇది రాస్తున్నప్పుడు వినాయకుడి నెమలి ఈక విరిగిపోతుంది. దీంతో వినాయకుడు తన దంతాల్లో ఒకదాన్ని సగం విరగొట్టి మహాభారతాన్ని మళ్లీ రాయడం మొదలు పెడతాడు. పనిపట్ల ఎంత నిష్ట ఉందో వినాయకుడి ఇలా తెలియజేశాడని పురాణాలు చెబుతున్నాయి. 

ganesh chaturthi 2022

గణేశుడికి ఎరుపు, కుంకుమ రంగులంటే చాలా ఇష్టమట. ఈ రంగులు అతన్ని సంతోషంగా ఉంచుతాయట. అందుకే భక్తులు ఆయనకు ఎక్కువగా ఎరుపు రంగు పూలనే సమర్పిస్తారు. 
 

ఏకదంతుడిని ఎప్పుడైనా ముందునుంచే దర్శించుకోవాలి. ఎందుకంటే వినాయకుడి వెనుక పేదరికం నివసిస్తుందట. అందుకే వినాయకుడిని వెనుక నుంచి దర్శించుకోకూడదని పురాణాలు చెబుతున్నాయి. ముందు నుంచి దర్శించుకోవడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. 

Latest Videos

click me!