ఈ ఆకులను నూనెలో కలిపి పెట్టుకుంటే వెంట్రుకలు నల్లబడతాయి, చుండ్రు తగ్గుతుంది.. ఇంకా ఎన్నో లాభాలు

First Published | Jan 12, 2025, 5:18 PM IST

ప్రకృతి మనకు ఎన్నో అద్భుతమైన ఔషధాలను అందించింది. వాటి గురించి తెలుసుకొని ఉపయోగించుకోవడం మనకు తెలిసి ఉండాలి అంతే. అయితే మనకు తెలియని ఎన్నో వస్తువులు మన చుట్టూనే ఉంటాయి. అలాంటి వాటిలో ఇదిగో ఈ ఫొటోలో కనిపిస్తున్న మొక్క ఒకటి. ఇంతకీ ఈ మొక్క ఏంటి.? దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఈ మొక్కలను ప్రత్యేకంగా పెంచాల్సిన పనిలేదు. వాటంతటవే పెరుగుతాయి. రోడ్లు పక్కన, మురికి కాలువల పక్కన ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. ఈ మొక్కలను గడ్డి ఛామంతి మొక్కగా చెబుతుంటారు. దీనిని కొన్ని ప్రాంతాల్లో నల్లారంగా పిలుస్తుంటారు. చిన్నప్పుడు ఈ ఆకులను రుద్ది పలకలకు రాసుకున్న అనుభవం చాలా మందికే ఉంటుంది. ఇలా రాస్తే పలకలు నల్లగా మారుతాయి. అయితే ఈ గడ్డి ఛామంతి మొక్కతో ఎన్నో లాభాలు ఉన్నాయని మీకు తెలుసా.? గడ్డి ఛామంతి మొక్క ఆకులతో ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
 

జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో ఈ ఆకులు ఎంతో ఉపయోగపడతాయి. ఇందుకోసం ముందుగా ఈ ఆకులను మెత్తగా రుద్ది పేస్ట్‌లాగా తయారు చేసుకోవాలి. అనంతరం ఈ పేస్టును ఆవనూనెలో వేయాలి. ఆ తర్వాత ఆ నూనె మరిగించాలి. చివరిగా ఆ నూనెను వడకట్టి ఒక బాటిల్‌లోకి తీసుకొని స్టోర్ చేయాలి.

ఇలా చేసుకున్న నూనెను రెగ్యులర్‌గా ఉపయోగిస్తే జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు ఒత్తుగా మారుతుంది, చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. 


ఇక ఈ ఆకులను కషాయం చేసుకొని తాగిగే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆ కషాయాన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యలు దూరమవుతాయి. అలాగే లివర్‌ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఈ ఆకుల కషాయం సహాయపడుతుంది. ఇందులోని ఆయుర్వేద గుణాలు లివర్‌ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. కాలయ పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

గడ్డి ఛామంతి ఆకుల్లో యాంటీ కార్సినోజెనిక్ లక్షణం ఉంటుంది. ఇది డయాబెటిస్‌ను అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. ఆకులను నేరుగా నమిలి తిన్నా ప్రయోజనం ఉంటుంది. రెగ్యులర్‌గా తీసుకుంటే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌ అవుతాయి అలాగే ఈ ఆకుల్లో యాంటీ ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ గుణాలు ఉంటాయి.

ఇవి గాయాలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. గాయామైన చోట ఈ ఆకుల రసాన్ని పిండాలి. ఇలా చేయడం వల్ల గాయం త్వరగా మానుతుంది. రక్తాన్ని గడ్డకట్టించడంలో ఈ ఆకుల రసం బాగా ఉపయోగపడుతుంది. 

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Latest Videos

click me!