ఫ్రిడ్జ్ లో ఈ ఫ్రూట్స్ పెడుతున్నారా? అవి తిన్నా కూడా వృథానే..!

First Published | Nov 20, 2024, 11:59 AM IST

కొన్ని పండ్లను అస్సలు ఫ్రిడ్జ్ లో ఉంచకూడదట. అలా ఉంచడం వల్ల.. వాటిలోని పోషక విలువలు అన్నీ దెబ్బతింటాయి.  ఆ తర్వాత వాటిని తిన్నా కూడా పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. మరి, ఎలాంటి పండ్లను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయకూడదో తెలుసుకుందాం…

పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ గా మన డైట్ లో పండ్లను ఒక పార్ట్ గా చేసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అందుకే.. రెగ్యులర్ గా అందరూ ఫ్రూట్స్ తినాలని అనుకుంటారు. అయితే, చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. ఒకేసారి ఎక్కువ పండ్లు కొనేసి.. అవి పాడవ్వకుండా ఉండేందుకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తూ ఉంటారు. అలా అయితే ఎక్కువ రోజులుు నిల్వ ఉంటాయి అని భావిస్తారు. కానీ, కొన్ని పండ్లను అస్సలు ఫ్రిడ్జ్ లో ఉంచకూడదట. అలా ఉంచడం వల్ల.. వాటిలోని పోషక విలువలు అన్నీ దెబ్బతింటాయి.  ఆ తర్వాత వాటిని తిన్నా కూడా పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. మరి, ఎలాంటి పండ్లను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయకూడదో తెలుసుకుందాం…

banana

1.అరటిపండు…

మనందరికీ కామన్ గా, తక్కువ ధరలో లభించే పండు ఏదైనా ఉంది అంటే అరటి పండే. అయితే, ఈ పండను ఎప్పుడూ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయకూడదు. ఒకవేళ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తే.. వాటి రుచిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పోషకాలు కూడా ఎక్కువగా ఉండవు.


2.టమాటలు…

 చాలా మంది కామన్ గా చేేసే మరో తప్పు టమాటలు ఫ్రిడ్జ్ లో పెట్టడం. కానీ.. పొరపాటున కూడా వీటిని ఫ్రిడ్జ్ లో నిల్వ చేయకూడదు. చల్లటి ఉష్ణోగ్రత వద్ద ఉంచడం వల్ల టమాటాలు రుచిని కోల్పోతాయి. టొమాటోలను తాజాగా ఉంచడానికి, వాటిని ప్రత్యక్ష సూర్యకాంతి నుండి దూరంగా ఉంచండి. గది ఉష్ణోగ్రత వద్ద బుట్టలో నిల్వ చేయండి.

అవోకాడో:

రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడని మరో పండు అవకాడో. చల్లని ఉష్ణోగ్రతలు అవోకాడోలు సరిగ్గా పండవు. రుచి కోల్పోయి చప్పగా మారతాయి. అవోకాడోలను పండాలంటే, గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయండి. అవకాడోలు పండిన తర్వాత, వాటి షెల్ఫ్ జీవితాన్ని పొడిగించడానికి వాటిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయవచ్చు.

పైనాపిల్…

పైనాపిల్స్ పూర్తిగా పండే వరకు రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయకూడదు. కారణం ఏమిటంటే, చల్లని ఉష్ణోగ్రతలు పండే ప్రక్రియను ఆపివేస్తాయి. పండిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.

సిట్రస్ పండ్లు:

నారింజ, నిమ్మ, ఇతర సిట్రస్ పండ్లను ఎక్కువ కాలం రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయకూడదు. చల్లని ఉష్ణోగ్రతలు సిట్రస్ పండ్లు వాటి రుచిని కోల్పోయి ఎండిపోయేలా చేస్తాయి. సిట్రస్ పండ్లు గది ఉష్ణోగ్రత వద్ద ఉత్తమంగా నిల్వ చేయాలి. కానీ సిట్రస్ రసాలను కొన్ని రోజులు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయవచ్చు.

Latest Videos

click me!