సానియా మీర్జా నుంచి మలైకా అరోరా వరకు.. ఈ ఒంటరి తల్లులు ఎందరికో స్ఫూర్తిదాయకం

First Published | Jan 28, 2024, 10:52 AM IST

పిల్లలను పెంచడమంటే ఆషామాషీ విషయం కాదు. అందులోనూ తల్లులు మాత్రమే పెంచడం. కానీ ఎంతో మంది తల్లులు ఎన్ని బాధలు ఎదురైనా ఒంటిరిగానే తమ పిల్లలను పెంచుతున్నారు. భర్తతో విబేధాలొచ్చి విడిపోయి తమ పిల్లలను పెంచుతూ ఎందరికో స్ఫూర్తిదాయకమైన కొంతమంది ప్రముఖ భారతీయ మహిళల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.  
 

Malaika Arora

ఒంటరిగా పిల్లల్ని పెంచడం అనుకున్నంత చిన్న విషయమేమీ కాదు. కానీ మన దేశంలో ఎంతో మంది తల్లులు తమ పిల్లల్ని ఒంటరిగానే పెంచుతున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా.. తల పిల్లలకు ఎలాంటి బాధలురాకుండా చూసుకుంటున్నారు. భర్తతో విడిపోయి ఒంటిరిగా పిల్లల్ని పెంచడం ఆషామాషీ విషయం కాదన్న ముచ్చట అందరికీ తెలిసిందే. అయితే కొంతమంది భారతీయ సెలబ్రిటీలు కూడా ఈ లీస్ట్ లో ఉన్నారు. ఒంటరిగానే పిల్లల్ని పెంచుతూ ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తున్నారు. సానియా మీర్జా నుంచి సుస్మితా సేన్ వరకు.. అన్ని అసమానతలను ధిక్కరించి జనాల మనస్సును గెలుచుకున్న కొంతమంది శక్తివంతమైన భారతీయ ఒంటరి తల్లుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Sania Mirza

సానియా మీర్జా

భారత టెన్నిస్ సూపర్ స్టార్ సానియా మీర్జా గురించి తెలియనివారంటూ ఎవరూ ఉండదరు. ఈ మధ్యే పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించి వార్తల్లో నిలిచారు. సానియాకు షోయబ్‌తో వివాహమై 14 సంవత్సరాలు అయ్యింది. కానీ ఇతను సానియతో విడాకులు తీసుకుని తాజాగా మూడో వివాహం చేసుకున్నాడు. అయితే సానియాకు, షోయబ్ కు ఇజాన్ మీర్జా మాలిక్ అనే కొడుకు ఉన్నాడు. కొడుకు సానియాతోనే ఉన్నాడు. 


సుస్మితా సేన్

మాజీ మిస్ యూనివర్స్, నటి, సుస్మితా సేన్ మనందరికీ తెలిసిందే. తన అందం, చమత్కారంతో ప్రేక్షకుల మనస్సును ఇట్టే గెలుచుకుంది ఈ హీరోయిన్. అయితే సుస్మితా సేన్ ఇద్దరు కుమార్తెలను దత్తత తీసుకున్నారు. ఆమే వీరిని పెంచుతోంది. దీంతో ఈ నటి భారతదేశంలోని చాలా మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది.
 

నీనా గుప్తా

నీనా గుప్తా తన వ్యక్తిగత జీవితంలోని బాధలను, ఒడిదుడుకులను అప్పుడప్పుడు వెల్లడిస్తునే ఉంటారు. నీనా గుప్తా ఒక శక్తివంతమైన మహిళ. అంతేకాదు ఈమె ఎంతో మందికి ప్రేరణ కూడా. నీనా గుప్తాకు మసాబా అనే కూతురు కూడా ఉంది. ఒంటరి తల్లిగానే నీనా గుప్తా తన కూతురును పెంచుతోంది. మన సమాజంలో అవివాహిత తల్లిగా ఉండటాన్ని నిషిద్ధంగా భావించే సమయంలోనే ఈమె తన కూతురుకు జన్మనిచ్చింది.

మలైకా అరోరా

మలైకా అరోగా గురించి తెలియని వారుండరు. మోడల్-నటి మలికా అరోరా తన స్వంత నిబంధనలతోనే జీవితాన్ని గడుపుతూ ప్రతి మూమెంట్ ను ఎంజాయ్ చేస్తుంది. మలైకాకు తన మాజీ భర్త అర్బాజ్ ఖాన్‌తో అర్హాన్ అనే కొడుకు ఉన్నాడు. ఇతన్ని మలైకా అరోరానే పెంచుతోంది. 
 

చారు అసోపా

టీవీ నటి చారు అసోపా, ఆమె మాజీ భర్త రాజీవ్ సేన్ తో  2023లో విడాకులు తీసుకున్నారు. వీరికి చారు జియానా అనే బిడ్డ జన్మించింది. ఈ నటి కూడా తన బిడ్డను తానే పెంచుతోంది. ఒంటరి తల్లిగా తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆమె ఎప్పుడెప్పుడు చెప్తూనే ఉంటారు. 

సుస్సానే ఖాన్

భారతీయ ఇంటీరియర్ డిజైనర్ సుస్సానే ఖాన్, ఆమె మాజీ భర్త హృతిక్ రోషన్  20214 లో విడాకులు తీసుకున్నారు. ఈ వార్త వీరి ఫ్యాన్స్ ను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ జంటకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరు సుస్సానే ఖాన్ వద్దే ఉంటున్నారు. ఒంటరి తల్లిగానే ఈమె తన కొడుకులను పెంచుతోంది. 
 

సాక్షి తన్వర్

సాక్షి తన్వర్ కూడా ఒంటరి తల్లే. ప్రముఖ భారతీయ టీవీ నటి సాక్షి తన్వర్ 2018లో దిత్యా అనే అందమైన తొమ్మిది నెలల బాలికను దత్తత తీసుకుని పెంచుతోంది.

Latest Videos

click me!