హార్దిక్ పాండ్యా, నటాషా స్టాంకోవిచ్
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా, సెర్బియా నటి, మోడల్ అయిన నటాషా స్టాంకోవి 2018లో మొదటిసారి కలుసుకున్నారు. అది ముంబైలోని ఒక క్లబ్ లో పార్టీ చేసుకుంటుండగా. వీళ్లు సుమారుగా రెండేళ్ల పాటు డేటింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా 2020 జనవరి 1న దుబాయ్ పర్యటనలో ఉన్నప్పుడు నటాసాకు ప్రపోజ్ చేశాడు. ఈ జంట కోవిడ్-19 లాక్ డౌన్ టైంలో అంటే 2020 మేలో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు అదే ఏడాది జూలైలో ఒక కొడుకు పుట్టాడు. హార్దిక్ పాండ్యా, నటాసా స్టాంకోవిచ్ లు ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అందులోనూ నటాషా తన సోషల్ మీడియాలో తన పేరు నుంచి 'పాండ్యా' అనే పదాన్ని తొలగించడంతో ఈ రూమర్ మరింత పెరిగింది. అయితే దీనిపై హార్దిక్ కానీ, నటాషా కానీ స్పందించలేదు.