భారతదేశ చరిత్రలో సంచలనం సృష్టించిన నాలుగు రాజకీయ హత్యలు

First Published | Sep 3, 2024, 9:19 PM IST

జాతీయ నాయకులైన మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, దీనదయాళ్ ఉపాధ్యాయలు హత్యకు గురయ్యారని మీకు తెలుసా. వివిధ కారణాలతో కొందరు వారిని చంపేశారు. భారతదేశ చరిత్రలోని ఈ నాలుగు రాజకీయ హత్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. హత్యల వెనుక కారణాలు తెలుసుకుందాం. రండి.  

మహాత్మా గాంధీ (1948)

స్వతంత్ర భారతదేశంలో జాతిపిత మహాత్మా గాంధీ హత్య దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే ఆయనపై కాల్పులు జరిపారు. ఆ సమయంలో గాంధీజీ భారతదేశంలో మత హింసను అరికట్టడానికి ఉపవాసం చేస్తున్నారు. గాంధీ విధానాలు, భావజాలంతో విభేదించిన గాడ్సే కాల్పులు జరిపి హత్య చేశారు.

ఇందిరా గాంధీ (1984)

భారతదేశ ఏకైక మహిళా ప్రధాని ఇందిరా గాంధీ 1984 అక్టోబర్ 31న హత్యకు గురయ్యారు. శ్రీమతి గాంధీకి చెందిన భద్రతా సిబ్బంది సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ ఆమెపై కాల్పులు జరిపారు. వాస్తవానికి ఆపరేషన్ బ్లూ స్టార్‌తో సిక్కు సమాజం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వర్ణ దేవాలయం నుండి ఉగ్రవాదులను బయటకు తీసుకురావడానికి సైనిక చర్య తీసుకోవడంతో పవిత్ర దేవాలయం దెబ్బతినడంతో సిక్కు సమాజం తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఈ హత్య తర్వాత దేశంలో అల్లర్లు చెలరేగి వందలాది మంది సిక్కులు హత్యకు గురయ్యారు.


రాజీవ్ గాంధీ (1991)

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఆత్మాహుతి బాంబు దాడిలో మరణించారు. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో రాజీవ్ హత్య జరిగింది. ఆ సమయంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దండ వేసే సమయంలో ఆత్మాహుతి దళం సభ్యురాలు దాను తనను తాను పేల్చుకుంది. ఇది పెద్ద పేలుడు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (LTTE) సభ్యురాలు దాను. శ్రీలంకలో చురుగ్గా ఉన్న లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (LTTE) రాజీవ్ గాంధీ పరిపాలనా విధానాలు నచ్చక ఆయన హత్య చేసింది. 

దీన్ దయాళ్ ఉపాధ్యాయ (1968)

భారతీయ జనసంఘ్ అగ్రనేత దీనదయాళ్ ఉపాధ్యాయ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. 1968 ఫిబ్రవరి 11న ముఘల్సరాయ్ రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై దీనదయాళ్ ఉపాధ్యాయ మృతదేహం లభ్యమైంది.

Latest Videos

click me!