
వాతావరణ కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్ల వంటి ఎన్నో కారణాల వల్ల ప్రస్తుతం హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువైంది. జుట్టు రాలిపోకూడదని ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. నూనెలు, షాంపూలు అంటూ మార్కెట్ లోకి వచ్చి ప్రతి ఒక్క ప్రొడక్ట్ ను కూడా వాడుతుంటారు. అయినా హెయిర్ ఫాల్ సమస్య తగ్గడం చాలా కష్టం. కానీ కొన్ని సింపుల్ టిప్స్ తో హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టి అందమైన జుట్టును మీ సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బేకింగ్ సోడా (Baking soda): టీ స్పూన్ బేకింగ్ సోడాలో కొన్ని నీళ్లు పోసి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను హెడ్ బాత్ చేసిన తర్వాత జుట్టుకు పెట్టాలి. ఒక పది నిమిషాల తర్వాత నీట్ గా జుట్టును క్లీన్ చేయాలి. ఆ తర్వాత జుట్టుకు కండీషరన్ చేయాలి. తరచుగా ఇలా చేస్తే జుట్టు సమస్యలన్నీ తొలగిపోతాయి.
బ్లాక్ టీ.. బ్లాక్ టీ కూడా జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఇందుకోసం.. బ్లాక్ టీ బ్యాగులను కాసేపు నీటిలో మరిగించాలి. అవి పూర్తిగా చల్లారాక జుట్టుకు ఈ టీ ఆకులను పట్టించాలి. కొద్దిసేపటి తర్వాత క్లీన్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తరచుగా ఇలా చేస్తే.. హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆపిల్ సైడర్ వెనిగర్: జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ఎంతో సహాయపడుతుంది. ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ తో తయారు చేసిన హెయిర్ రిన్స్ జుట్టు సమస్యలకు చెక్ పెడతాయి. హెయిర్ షైనీగా తయారవ్వాలంటే రెండు చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకుని కొన్నినీటిలో కలపండి. ఈ నీటిని స్నానం చేసేటప్పుడు జుట్టుకు షాంపూ పెట్టేకంటే ముందే పెట్టండి. దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
అలొవెరా రిన్స్.. కలబంద చర్మ ఆరోగ్యానికే కాదు జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో సహాయపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది జుట్టుకు దివ్య ఔషదంలా పనిచేస్తుంది. కలబంద గుజ్జును తీసి కొన్ని నీటిలో వేసి బాగా మరిగించాలి. ఇది పూర్తిగా చల్లబడిన తర్వాత జుట్టుకు అప్లై చేయాలి. ఇలా చేస్తే డాండ్రఫ్ సమస్య వదిలిపోతుంది.
నిమ్మరసం.. నిమ్మకాయ మన ఆరోగ్యానికి దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ నిమ్మరసం డాండ్రఫ్ సమస్యకు చెక్ పెట్టడానికి ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం ఒకకప్పులో టూ టేబుల్ స్పూన్ల నిమ్మరసం తీసుకుని అందులో కప్పు నీటిని పోయాలి. దీన్ని బాగా కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఇది ఆరిన తర్వాత షాంపూ తో తలస్నానం చేయాలి. ఆ తర్వాత మర్చిపోకుండా కండీషన్ చేసుకోవాలి. తరచుగా ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా అందంగా పెరుగుతుంది.