సంక్రాంతి సీజన్‌లో బైక్‌లపై వెళ్తున్నారా.? చైనా మాంజాల నుంచి ఇలా ప్రాణాలు కాపాడుకోండి

First Published | Jan 9, 2025, 4:03 PM IST

సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు పిండి వంటలతో పాటు గాలిపటాలు గుర్తొస్తాయి. గాలి పటాలను ఎగరవేసేందుకు చాలా మంది చైనా మాంజాను ఉపయోగిస్తుంటారు. అయితే ఈ సమయంలో వాహనదారులు కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణానికే ప్రమాదం తప్పదు, ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏంటంటే.. 
 

గాలిపటాలు ఎగరవేసే సమయంలో పక్కవారి గాలిపటాన్ని తెంచాలనే ఉత్సాహం చాలా మందిలో ఉంటుంది. ఇందుకోసం మాంజాను కొనుగోలు చేస్తుంటారు. నైలాన్‌, సింథటిక్‌ దారాలకు గాజు ముక్కలతో చేసిన పొడిని పూసి మాంజాను తయారు చేస్తుంటారు. చైనా నుంచి ఎక్కువగా దిగమతి అయ్యే ఈ మాంజా అత్యంత ప్రమాదకరం. అందుకే 2017లో చైనా మాంజా ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. 
 

అయినా కూడా ఇప్పటికే యథేశ్చగా అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రజలు ఉపయోగిస్తూనే ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఈ మాంజాలు తెగి రోడ్లపై పడడం వల్ల ఎన్నో ప్రమాదాలకు దారి తీస్తుంది. కరెంట్‌ తీగలు, చెట్లపై పడే ఈ దారం కారణంగా పక్షులు ప్రమాదాలకు గురవుతున్నాయి. దారంలో ఇరుక్కుపోయి పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయి. దీంతో జంతు ప్రేమికులు సైతం ఈ మాంజాను నిషేధించాలని డిమాండ్ చేస్తుంటారు. 


చైనా మాంజా కారణంగా ప్రజలు సైతం ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చూసే ఉంటాం. రోడ్లపై అడ్డంగా పడిపోయిన చైనా మాంజాలను గుర్తించని వాహనదారులు వేగంగా వెళ్లడంతో మెడకు చుట్టుకొని ప్రమాదాల బారిన పడిన సందర్భాలు చాలా ఉన్నాయి.

కత్తిలా ఉండే ఈ చైనా మాంజాలను గొంతులను కొసేస్తుంటాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. 
 

ప్రస్తుతం మార్కెట్లో చైనా మాంజా ముప్పు తప్పించేందుకు కొన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒకటి.. స్కూటీలకు, బైక్‌లకు ముందు ఇనుప రాడ్లను ఏర్పాటు చేసుకోవడం. పైన ఫొటోలో కనిపిస్తున్నట్లు బైక్‌లపై ఇనుప రాడ్లను ఏర్పాటు చేస్తున్నారు.

చైనా మాంజా నుంచి తప్పించుకునేందుకు ఇలాంటి సెటప్‌లను చాలా మంది ఉపయోగిస్తున్నారు.  దీంతో మనం వెళ్తున్న దారిలో ఏదైనా దారం అడ్డుగా వస్తే ఐరన్‌ రాడ్‌కు తగులుతుంది. దీంతో ప్రమాదం బారినపడకుండా ఉండొచ్చు. 
 

అలాగే సంక్రాంతి సమయంలో బైక్‌లపై వెళ్లే సమయంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. వీలైనంత వాహనలను నెమ్మదిగా నడిపించాలి. అదే విధంగా గొంతును కవర్‌ చేసేలా ఉండేలా మఫ్లర్స్‌ను లేదా స్కార్ఫ్‌లను, హై నెక్‌ టీ షర్ట్‌లను ధరించాలి.

అదే విధంగా కళ్లకు గాగుల్స్‌ ధరించాలి. వీటితో పాటు హెల్మెట్‌ను తప్పకుండా ధరించండి. వీటన్నింటితో పాటు చైనా మాంజాను ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేధించండి. 
 

Latest Videos

click me!