మీరు రోజూ వాకింగ్ చేస్తారా..? ఈ ఐదు జాగ్రత్తలు పాటిస్తేనే ఆరోగ్యం, లేదంటే కొత్త ప్రాబ్లమ్స్..!

First Published | Jul 29, 2024, 1:23 PM IST

ప్రతిరోజూ వాకింగ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ మన నడకలోనూ క్రమశిక్షణ అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు... ఎలాపడితే అలా నడిస్తే కొత్త సమస్యలు వస్తాయంటున్నారు. వాకింగ్ ఎలా చేయాలంటే...

Walking

Walking : తెల్లవారుజామున లేదంటే సాయంత్రం సమయంలో పార్కులను లేదంటే క్రీడా మైదానాలను గమనించారు. చాలామంది  నడుచుకుంటూ కనిపిస్తారు. మద్య వయస్కులు, వృద్దులు ఇలా వాకింగ్ చేస్తే కొందరు యువత రన్నింగ్  చేస్తుంటారు. ఇలా మంచి ఆరోగ్యం, ఫిట్ నెస్ కోసం ఇలా కష్టపడుతుంటారు. 
 

Walking

అయితే అందరి వాకింగ్, రన్నింగ్ స్టైల్ ఒకేలా వుండదు... కొందరు స్నేహితులతో ముచ్చటిస్తూ, ఇంకొందరు చేతుల్లో వాటర్ బాటిల్ పట్టుకుని, మరికొందరు చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ వాకింగ్ చేస్తుంటారు.  ఇంకొందరయితే ఫోన్ చూస్తూనే వాకింగ్ చేస్తుంటారు. ఇలా వాకింగ్ చేయడానికి ఓ ప్రత్యేక పద్దతి ఏమీ లేదు... నడిచామా? లేదా? అన్నదే ముఖ్యమని చాలామంది భావిస్తుంటారు. 


Walking

కానీ ఎలాపడితే అలా వాకింగ్, రన్నింగ్ మంచిందికాదని నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ చేయడానికి ఓ పద్దతి వుంటుందని... దాన్ని ఫాలో అయితేనే ఆరోగ్యపరమైన లాభాలు వుంటాయట.లేదంటే ఆరోగ్యం బాగుండటం అటుంచి కొత్త ఆరోగ్య సమస్యలు మొదలవుతాయని హెచ్చరిస్తున్నారు. కాబట్టి మనం వాకింగ్ ఎలా చేయాలి... ఎలా చేయకూడదో తెలుసుకుందాం.  

Walking

వాకింగ్ జాగ్రత్తలు : 

1.వార్మప్ : 

ఈ బిజీ లైఫ్ లో తమ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకునే తీరికకూడా చాలామందికి లేదు. ప్రతిదానికి ఓ టైమ్ పెట్టుకుని దాని ప్రకారమే అంతా జరిగిపోవాలని అనుకుంటారు. ఇలాంటి బిజీ లైఫ్ లో లేట్ నైట్ వరకు మేలకువగా వుండటంతో పొద్దున నిద్రలేవడం చాలాకష్టం.కొందరు వాకింగ్ కోసం అలారం పెట్టుకుని లేస్తారు... లేస్తూనే వాకింగ్ ప్రారంభిస్తారు.  
 

walking

అయితే ఇలా నిద్రలేవగానే వాకింగ్ మంచిది కాదు. అప్పటివరకు పూర్తి రెస్ట్ లో వున్న బాడీని ఒక్కసారిగా పరుగు పెట్టించడం మంచిది కాదంటున్నారు. నిపుణులు కాబట్టి నిద్ర లేవగానే కాస్త రిలాక్స్ అయి వార్ఫప్ చేయాలి. ఇది శరీరంలోకి కండరాలను కాస్త ప్సెక్సిబుల్ గా మారుస్తాయి. అప్పుడు వాకింగ్, రన్నింగ్ చేయడంవల్ల మంచి ఫలితాలు వుంటాయని చెబుతున్నారు. 

walking

2. కిందకు చూస్తూ నడవొద్దు : 
 
చాలామందికి వాకింగ్ చేసేటపుడు సెల్ ఫోన్ వాడుతుంటారు. ఖాళీగానే నడుస్తున్నాం కదా ఈ సమయంలో సెల్ ఫోన్ తో టైంపాస్ చేద్దామని అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఆరోగ్యం బాగుండటం కాదు దెబ్బతినే అవకాశం వుందని నిపుణులు చెబుతున్నారు. 

walking

కిందకు చూస్తూ వాకింగ్ చేయడం మంచిది కాదు... ఇలా తలవంచి నడవడం వల్ల మెడపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో మెడ, నడుంనొప్పి సమస్యలు వస్తాయి. అదేపనిగా సెల్ ఫోన్ చూడటంవల్ల కళ్ళు కూడా దెబ్బతింటారు. కాబట్టి వాకింగ్ చేసే సమయంలో సెల్ ఫోన్ కు దూరంగా వుండటం మంచింది. 

walking

మొత్తంగా తల కిందకు వంచి నేలను చూస్తూ నడవడం మంచిందికాదు. ఇలాంటి అలవాటు ఎవరికైనా వుంటే మానుకోవాలని... తల నిటారుగా వుంచి ముందుకు చూస్తూ వాకింగ్ చేయాలని సూచిస్తున్నారు. 

walking

చేతులు ఊపుతూ నడవాలి : 

రన్నింగ్ చేసేవారు ఎక్కువగా చేతులు కదుపుతుంటారు...కానీ వాకింగ్ చేసేవారు అలా చేయరు. కేవలం కాళ్లకు మాత్రమై పనిచేప్పి చేతులు కదపకుండా వుంటారు. కానీ ఇలా చేతులను పనిచెప్పక పోవడం మంచింది కాదు.

మన  నడకకు తగ్గట్లుగా చేతులను ముందుకూ వెనక్కి అంటూ వుండాలి. దీంతో చేతి కండరాలకు కూడా వ్యాయామం చేసినట్లు వుంటుంది. ఇలా చేతులను కదుపుతూ నడవడం మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

walking

4.మంచి ఆహారం : 

వాకింగ్ చేయడమే కాదు చేసాక మంచి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా పోషకాలు అదికంగా వుండే ప్రూట్స్ లేదంటే ఆరోగ్యకరమైన టిఫిన్ తీసుకోవాలి.  దీంతో వాకింగ్ ద్వారా మనం కోల్పోయిన శక్తి తిరిగి లభిస్తుంది. అంతేకాదు అప్పటివరకు మనం కష్టపడి వుంటాం కాబట్టి తిన్నది బాగా ఒంటబడుతుందట.

walking

5. వారంలో ఒకరోజు సెలవు : 

ప్రతిరోజూ వాకింగ్ చేసేవారు కనీసం వారానికి ఒక్కసారయినా బ్రేక్ ఇవ్వాలట. దీంతో శరీరం, కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది... ఆ తర్వాత మరో వారం రోజులకు తగిన పునరుత్తేజం లభిస్తుంది. అలాకాకుండా ప్రతిరోజు వాకింగ్ ఇతర సమస్యలకు కారణం అవుతుందట. మన శరీరానికి ఎప్పుడూ పని చెప్పడమే కాదు అప్పుడప్పుడు విశ్రాంతి ఇవ్వడమూ ఆరోగ్య సూత్రాల్లో ఒకటని నిపుణుల అభిప్రాయం 
 

walking

ఇక వాకింగ్ సమయంలో శరీరానికి మంచి గాలి తగిలే దుస్తులు ధరించాలి. బిగుతుగా వుండే బట్టలతో వాకింగ్ అసౌకర్యంగా వుండటమే కాదు అనారోగ్యకరమట. షూస్ కూడా నడకకు అనుకూలంగా వుండాలి. మొత్తంగా వాకింగ్, రన్నింగ్ చేసేవారు జాగ్రత్తలు పాటించడం వల్లే లాభం వుంటుంది... లేదంటే ఆరోగ్యం బాగుపడటం కాదు దెబ్బతినే అవకాశాలుంటాయనేది నిపుణులు అభిప్రాయం. 

Latest Videos

click me!