ఈ 5 టిప్స్ పాటిస్తే మీరు జీవితాంతం హ్యాపీగా ఉంటారు..

First Published | Aug 7, 2024, 4:49 AM IST

'ఆనందాన్ని ఎవరు కోరుకోరు..  కానీ ఎంత మూల్యానికి'.. థియేటర్లో సినిమా వేసే ముందు వచ్చే ఈ యాడ్ అందరికీ తెలుసు. అయితే అసలు ఆనందం అంటే ఏమిటి. సంతోషంగా గడపడానికి కచ్చితంగా డబ్బు ఖర్చు పెట్టాలా.? డబ్బు లేకపోతే ఆనందంగా జీవించలేమా..  'The science of happiness ' సబ్జెక్టులో అనేక పరిశోధనలు చేసిన పలువురు నిపుణులు ఇలాంటి ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు తెలుసుకుందాం.. వాటిని పాటించి ఆనందంగా జీవిద్దాం..
 

మీ భావాలను ఇతరులతో పంచుకోండి..

వాస్తవానికి మంచి విషయాలను ఇతరులతో పంచుకోవడం చాలా మంచి అలవాటు. దీనివల్ల మీరు ఆనందం పొందటమే కాకుండా తోటి వారు కూడా ఆ అనుభూతిని పొందేలా చేయగలరు.  మీరు బాధల్లో ఉన్నప్పుడు మీ చేయి పట్టుకొని భరోసా ఇచ్చే వారు ఉంటే మీ ఈ సమస్య సగం తీరిపోయినట్టే.
 

ఇప్పుడు ఏం చేయాలి అని మాత్రమే ఆలోచించండి

ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఈ రోజే మీ లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. మీ గోల్డ్ రీచ్ అయ్యే క్రమంలో ఒక అడుగు మాత్రమే ముందుకు వేస్తున్నారు. అందువల్ల తర్వాత ఏం చేయాలి అని మాత్రమే ఆలోచిస్తూ ముందుకు వెళ్లాలి. ఒక్కో అడుగు విజయవంతంగా వేస్తూ ముందుకు వెళ్లడం వల్ల మీ లక్ష్యం తప్పక నెరవేరుతుంది.
 


ఇతరులకు హెల్ప్ చేయడం అలవాటు చేసుకోండి..

దయాగుణం చాలా మంచి లక్షణం. శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అందువల్ల మన ఆలోచనలు పాజిటివ్ గా మారతాయి.  మానసిక సంతృప్తి వల్ల స్ట్రెస్ హార్మోన్లు తక్కువగా విడుదలై బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 

మొహమాట పడకుండా ఇతరుల సాయం తీసుకోండి

సాధారణంగా మనం ఇతరులను సాయం అడగడానికి చాలా మొహమాట పడుతుంటాం. వాళ్లు నో చెబుతారాని ముందుగానే ఊహించి సాయం అడగడమే మానేస్తాం. మీకు అవసరమైనప్పుడు సాయం పొందడం వల్ల సాయం చేసిన వారు కూడా హ్యాపీగా ఫీలవుతారు. 

మీ చుట్టూ ఉన్న మంచిని గమనించండి..

ప్రస్తుతం అందరి జీవితాలు హడావుడి బ్రతుకులుగా మారిపోయాయి. బాధ్యతలు, సంపాదన కోసం చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా పరిశీలించలేని పరిస్థితి. ఎక్కడైనా గొడవలు, ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే వాటి గురించి తెలుసుకుంటున్నారు. ఇలా కాకుండా మన చుట్టూ జరుగుతున్న మంచి కార్యక్రమాల గురించి తెలుసుకుంటూ ఉండాలి. సామాజిక సమస్యలు పరిష్కరిస్తున్న వారు, ప్రజలను చైతన్యవంతం చేసేవారు, పర్యావరణాన్ని కాపాడేవారు.. ఇలాంటి వారి గురించి ఇతరులకు చెప్పడం వల్ల వారు కూడా పాజిటివ్ గా మారే అవకాశం ఉంటుంది.

Latest Videos

click me!