జాతీయ జెండాను ఎప్పుడైైనా ఎగురవేయవచ్చు.. బట్ కండిషన్స్ అప్లై

First Published | Aug 14, 2024, 12:52 PM IST

ఎందరో మహానుభావుల స్వాతంత్య్ర పోరాటం(ఫ్రీడమ్‌ ఫైట్‌) ఫలితమే ఇప్పడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ.  ఈ పోరాటంలో స్వతంత్ర సమరయోధులు, జాతీయ నాయకుల భుజాలపై  రెపరెపలాడింది మన జాతీయ జెండా.  సహజంగానే జాతీయ జెండాను చూస్తే అందరికీ దేశభక్తి ఉప్పొంగుతుంది. మరి అలాంటి జాతీయ జెండాను ఏరోజైనా ఎగురవేయవచ్చని తెలుసా.. ఇలాంటి 5 ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..

1. డిజైన్‌.. జాతీయ జెండాలో మూడు రంగులుంటాయి.  పైన ఉన్న కాషాయం(కేశరీ) రంగు ధైర్యానికి, త్యాగానికి గుర్తు. మధ్యలోని తెలుపు రంగు శాంతిని సూచిస్తుంది. చివరి రంగైన ఆకుపచ్చ రంగు కొత్తదనం, అభివృద్ధి, శ్రేయస్సుకు ప్రతీక. ఈ జెండాను 1921లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పిడుగురాళ్లకు చెందిన పింగళి వెంకయ్య రూపొందించారు. ఆయన తెలుగువాడు కావడం మనకు గర్వకారణం. 
 

2. ఆవిష్కరణ..  జాతీయ జెండా తయారీలో అనేక నమూనాలు అప్పటి దేశ నాయకులు పరిశీలించారు. చివరికి ప్రస్తుతం మనం చూస్తున్న జాతీయ జెండాను ఆమోదించారు. 1947 జులై 22న అప్పటి స్వాతంత్య్ర పోరాటంలో నాయకులు దీన్ని ఆమోదించారు. 
 

Latest Videos


3. తయారీ.. జాతీయ జెండాను కచ్చితమైన ప్రమాణాలతో తయారు చేయాలి. ఇది ఎవరు పడితే వారు తయారు చేయడానికి లేదు. కేంద్ర ప్రభుత్వ ఆమోదం ఉన్న వారు మాత్రమే తయారు చేయాలి. సాధారణంగా దీన్ని కర్ణాటక రాష్ట్రంలోని హుబ్బళిలోని ఖాదీ గ్రామోద్యోగ సంఘం లిమిటెడ్‌ తయారు చేస్తుంది. జెండాను చేతితో నేసిన నూలుతోనే తయారు చేయాలనే నిబంధన ఉంది. 

4. అశోకచక్రం.. జాతీయ జెండాలో కనిపించే అశోక చక్రం. అశోకుని స్తంభం నుంచి తీసుకున్నది. దీన్ని ధర్మ చక్రం అని కూడా అంటారు. ఈ చక్రంలో 24 గీతలుంటాయి. ఇవి రోజులోని 24 గంటలను సూచిస్తాయట.  
 

5. ఫ్లాగ్‌ కోడ్‌.. జాతీయ జెండా ఉపయోగించడానికి అనేక రూల్స్‌ ఉన్నాయి. 
వాటన్నిటినీ ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్సట్‌ టు నేషనల్‌ ఆర్న్‌ చట్టం, 1971లో పొందుపరిచారు. ఆ నిబంధనల ప్రకారం జాతీయ జెండాను ఎప్పడూ అగౌరపరచకూడదు. ఇలాంటి నిబంధనలు పాటిస్తూ ప్రజలు కోడ్‌కు కట్టుబడి ఉంటే జాతీయ సెలవు రోజుల్లోనే కాకుండా ఇతర అన్ని రోజుల్లోనూ జాతీయ జెండా ఎగుర వేయవచ్చని 2002లో తీర్మానించారు. 
 

click me!