ఎంత చేసినా.. బరువు ఎందుకు తగ్గరు?

First Published | Oct 23, 2024, 3:58 PM IST

కొంతమంది ఎన్నో ప్రయత్నాలు చేసినా కొంచెం కూడా బరువు తగ్గరు. దీనికి మీరు చేసే కొన్ని తప్పులే కారణమని నిపుణులు అంటున్నారు. అవేంటంటే? 

ఈ రోజుల్లో చాలా మంది బరువు తగ్గడానికని ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. బరువు పెరగడం వల్ల బాడీ షేప్ మారడమే కాదు ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతుంది. అందుకే బరువును తగ్గించుకోవడం చాలా ముఖ్యం. 

అయితే బరువు తగ్గడమనేది చాలా ఓపికతో కూడుకున్న పని. ఎందుకంటే బరువు పెరిగినంత ఈజీగా బరువు తగ్గలేం. కాబట్టి దీనికి చాలా సమయం పడుతుంది. అయినా ఒక్కరోజు రెండు రోజులు ప్రయత్నాలు చేస్తే మీరు బరువు తగ్గరు.

ఎప్పుడూ ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు కోరుకున్నంత బరువు తగ్గుతారు. అయితే చాలా మంది ఎంత ప్రయత్నించినా ఫలితం లేదని విసుగు చెంది  ఎలాంటి ప్రయత్నమూ చేయరు. కానీ దీనివల్ల మరింత బరువు పెరిగిపోతారు. 

అయితే చాలా మంది కొన్ని పుకార్లను నమ్ముతారు. దీనివల్ల బరువు తగ్గుతామని భావిస్తారు. కానీ నిజంగా జరిగేది మాత్రం మరింత బరువు పెరిగిపోతారు.

అందుకే మీరు గనుక బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే మాత్రం ముందు దానికి సంబంధించిన అపోహలను నమ్మడం మానేయండి. అందుకే బరువు తగ్గేవారు ఎలాంటి అపోహలను నమ్మకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


అపోహ 1- తక్కువ తింటే వల్ల బరువు తగ్గుతారు

వాస్తవం: నిజానికి చాలా మంది ఈ మాటను నమ్ముతారు. కానీ తక్కువ తింటే బరువు తగ్గుతామన్నది నిజం కాదు. ఎందుకంటే మీరు తక్కువగా తింటే మీ శరీరంలో శక్తి తగ్గుతుంది. అలాగే పోషకాల లోపం కూడా ఏర్పడుతుంది.

ముఖ్యంగా బలహీనంగా అవుతారు. ఈ సమస్యలేమీ రాకూడదంటే మాత్రం మీరు సమతుల్య  ఆహారం తీసుకోవాలి. మీరు తినే ఆహారంలో తగినంత మొత్తంలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, మంచి కొవ్వులు ఉండేలా చూసుకోవాలి. 

అపోహ 2: క్రాష్ డైట్ ఫాస్ట్ గా బరువు తగ్గడానికి సహాయపడుతుంది

వాస్తవం: క్రాష్ డైట్ వల్ల మీరు 10 నుంచి 15% వరకు ఫాస్ట్ గా బరువు తగ్గుతారు. నిజానికి ఇది చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కానీ నిజమేంటంటే? ఇది 1 నుంచి 2 సంవత్సరాలలో మీ బరువును తిరిగి పెంచుతుంది. అలాగే కొన్నిసార్లు మునుపటి కంటే ఎక్కువ బరువు పెరిగేలా కూడా చేస్తుంది. 


అపోహ 3: బరువు తగ్గడానికి వ్యాయామం సరిపోతుంది

వాస్తవం: బరువు తగ్గాలంటే వ్యాయామం చేయాలన్నది నిజమే. కానీ వ్యాయామం ఒక్కటే మీరు బరువు తగ్గడానికి సహాయపడదు. మీరు బరువు తగ్గాలంటే వ్యాయామంతో పాటుగా సమతులాహారం కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. వ్యాయామం చేస్తూ మీరు అసమతుల్యమైన, అనారోగ్యకరమైన ఆహారం తింటే ఎంతకీ బరువు తగ్గరు. 

అపోహ 4: బరువు తగ్గడానికి స్పాట్ రిడక్షన్ సాధ్యమే

వాస్తవం- అయితే కొంతమంది చేతుల కొవ్వును లేదా పొట్టను మాత్రమే తగ్గించాలనుకుంటారు. కానీ ఇలా మీరు కోరుకున్న భాగాన్ని తగ్గించడం సాధ్యం కాదు. శరీరమంతా బరువు తగ్గుతుంది. అయితే ప్రత్యేక భాగాల కొవ్వును తగ్గించుకోవడానికి కొన్ని ప్రత్యేక వ్యాయామాలను ప్రయత్నించండి. 

weight loss

అపోహ 5: కొవ్వు తగ్గడానికి పిండి పదార్థాలను తగ్గించడం చాలా ముఖ్యం

వాస్తవం- మీకు తెలుసా? పిండి పదార్థాలే మన శరీరానికి శక్తి వనరులు. ఇవి మన రోజువారీ పనులు చేసుకోవడానికి, వ్యాయామం చేయడానికి సహాయపడతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే మీరు ఎక్స్ ట్రా కేలరీలను తగ్గించుకోవాలి.

అలాగే ఆరోగ్యకరమైన పిండి పదార్థాలను లిమిట్ లో తీసుకోవడం చాలా అవసరం. ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు తృణధాన్యాలు, పండ్లు, కూరగాయల్లో ఉంటాయి.  ప్రాసెస్ చేసిన, ఫాస్ట్ ఫుడ్ లో అనారోగ్యకరమైన పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని అస్సలు తినకండి.

Latest Videos

click me!