వేలిముద్రలు మన వ్యక్తిత్వాన్ని, మన స్వభావాన్ని తెలియజేయడంలో కీలకమైన భాగం. ప్రతి వ్యక్తి వేలిముద్రలు ప్రత్యేకమైనవి. వేలి ముద్రలను బట్టి వ్యక్తిత్వ లక్షణాలు మారుతుంటాయి. న్యూరోసైన్స్, జెనెటిక్స్, డెర్మటోగ్లిఫిక్స్, సైకాలజీ లాంటి విభాగాల్లోని పరిశోధనలు.. వేలిముద్రలు మన వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలవని తెలియజేశాయి.
వేలిముద్రలు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి. శంఖు ఆకారం (లూప్స్), వంపు గీతలు (కర్వ్స్), వృత్తాకారం (వోర్ల్స్). ప్రతి రకం ప్రత్యేకమైన వ్యక్తిత్వ లక్షణాలను ప్రతిబింబిస్తుంది.
వృత్తాకారం (వోర్ల్స్):
వృత్తాకార వేలిముద్రలున్న వ్యక్తులు ఒంటరిగా ఉండటానికి మొగ్గు చూపుతారు. తమకు నచ్చినట్లు పనులు చేసుకుంటూ ముందుకు సాగుతారు. స్వార్థం, స్వతంత్ర భావాలు కలిగిన వీరు రిజర్వుడ్‌గా ఉండేందుకు ఇష్టపడతారు. వీరికి ఉన్న తెలివితేటలు, ప్రతిభ, సృజనాత్మకతతో పనుల్లో ముందుకు సాగుతూ విజయాన్ని సాధిస్తారు. చుట్టూ ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకొని విజయం సాధించడంలో వోర్ల్స్ ఫింగర్ ప్రింట్స్ కలిగినవారు నేర్పరులు.
Confidence
వంపు గీతలు (కర్వ్స్):
కర్వ్స్ ఆకారంతో వేలిముద్రలున్న వ్యక్తులు ధైర్యవంతులు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ప్రతి పనిలోనూ ప్రాక్టికల్‌గా వ్యవహరిస్తారు. కఠినమైన నిర్ణయాలను తీసుకుంటారు. వీరిని ఎవరూ ప్రభావితం చేయలేరు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా వీరు అప్డేట్ అవుతూ ఉంటారు.
శంఖు ఆకారం (లూప్స్):
శంఖు ఆకారంతో వేలిముద్రలున్న వ్యక్తులు సాధారణంగా నెమ్మదిగా, ప్రశాంతంగా ఉండే స్వభావం కలిగి ఉంటారు. వారు పనులను కష్టపడుతూ ప్రారంభిస్తారు. కానీ ఎంత సాధించినా సంతృప్తి చెందలేరు. వీరికి ఎక్కువగా ఊహల్లో జీవనపు ఆనందం ఉంటుంది. అందువల్ల వారు తరచూ బోర్ ఫీల్ అవుతుంటారు. ఈ లక్షణాలు కలిగినవారు ఉద్యోగాలు తరచూ మారుతూ ఉంటారు. కానీ నిజాయితీతో, సానుభూతితో ఉండి స్నేహితులను సంపాదిస్తారు.