పైల్స్
ప్రతి ఒక్కరి వంటింట్లో ఎన్నో రకాల మసాలా దినుసులుంటాయి. ఇవి ఆహార రుచిని పెంచడమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. ఇలాంటి వాటిలో మెంతులు ఒకటి. నిజానికి మెంతులు ఒక మసాలా దినుసే అయినా ఇది మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో ఫోలిక్ యాసిడ్, జింక్, కాపర్, కెరోటిన్, నియాసిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి.ఇవి మన శరీరాన్ని ఎన్నో వ్యాధుల నుంచి కాపాడుతాయి. చాలా మంది వీటిని జుట్టు పెరగడానికి, చుండ్రు పోవడానికి, బరువు తగ్గడానికి బాగా ఉపయోగిస్తారు.
పైల్స్
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మెంతులు అర్శమొలలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. మెంతుల్లో ఉండే ఎన్నో రకాల పోషకాలు మంటను, నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా పైల్స్ వల్ల అయిన గాయాలను నయం చేయడానికి కూడా సహాయపడతాయి. అసలు మెంతులు అర్శమొలలను తగ్గించడానికి ఎలా సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఇంకా చదవండి: ఈ పచ్చి ఆకులను నమిలినా.. నోట్లో నుంచి వాసన రాదు
పైల్స్
అర్శమొలలు ఎలా వస్తాయి?
అర్శమొలలు జీర్ణకోశ సమస్యల వల్ల వస్తుంది. దీనితో పాటుగా అక్కడ బొబ్బలు, వాపు వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు కొన్ని కొన్ని సార్లు రక్తం కూడా కారుతుంటుంది. ఈ సమస్య వల్ల కూర్చోవడానికి, పడుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు.
వెంధ్యంతో మొలల చికిత్స
అర్శమొలలు తగ్గడానికి మెంతులను ఎలా తీసుకోవాలి?
అర్శమొలల నుంచి ఉపశమనం పొందడానికి మెంతులను నానబెట్టి తినడం మంచిది. ఎందుకంటే వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ ఈ సమస్య నుంచి మిమ్మల్ని త్వరగా బయటపడేయడానికి సహాయపడుతుంది. ఇందుకోసం రాత్రి పడుకునే ముందు 1-2 స్పూన్ల మెంతులను నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే పరిగడుపున తినండి. ఆ వాటర్ ను తాగండి. ఇలాగే మీరు రోజూ మెంతులను కొన్ని రోజులు తీసుకుంటే అర్శమొలలు తగ్గిపోతాయి. దీనితో పాటుగా మెంతులను పేస్ట్ లా చేసి గాయాలపై రాస్తే కూడా తగ్గుతాయి.
వెంధ్యం ప్రయోజనాలు
మెంతుల ఇతర ప్రయోజనాలు:
మెంతులు పైల్స్ ను తగ్గించడమే కాకుండా ఇతర సమస్యలను తగ్గించడానికి కూడా ఇవి సహాయపడతాయి. మెంతులు కీళ్ల నొప్పులను, రక్తపోటు వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది.
గుర్తుంచుకోండి: అర్శమొలలు తగ్గడానికి మెంతులను తీసుకున్న తర్వాత కూడా మీకు రక్తస్రావం, నొప్పి వంటి సమస్యలు ఉంటే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.