పెళ్లిలో అందంగా కనిపించాలంటే ఇలా రెడీ అవ్వండి

First Published | Feb 11, 2024, 10:56 AM IST

పెళ్లి కోసం బట్టలు కొనాలనుకుంటే.. కేవలం లేటెస్ట్ ట్రెండ్స్ గురించి తెలిస్తే సరిపోదు. ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి మీరు. బట్టలే కాదు.. నగలు, హెయిర్ స్టైల్ వంటివి కూడా మీరు అందంగా కనిపించేలా చేస్తాయి. అందుకే పెళ్లిలో మీరు అందరికంటే అందంగా కనిపించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం పదండి. 
 

ఇది పెళ్లిళ్ల సీజన్. ఇంకేముంది ఒకటి తర్వాత ఒకటి పెళ్లిళ్లకు ఆహ్వానం అందుతూనే ఉంటుంది. అయితే పెళ్లికి ఏ బట్టలు వేసుకోవాలనే విషయంలో చాలా మంది ఒక క్లారిటీ ఉండదు. కానీ మనం వేసుకునే బట్టలే మనల్ని నలుగురిలో అందంగా కనిపించేలా చేస్తాయి. అయితే చాలా మంది పెళ్లికి.. ఒక్క బట్టల విషయంలోనే జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే ఇవే మనల్ని అందంగా కనిపించేలా చేస్తాయని. కానీ పెళ్లిలో మీరు అందంగా కనిపించాలంటే మంచి బట్టలను కొంటేనే సరిపోదు. మిగతా విషయాలపై కూడా దృష్టి పెట్టాలి. అవేంటంటే? 
 

సంప్రదాయ దుస్తులు 

సంప్రదాయ నేత, ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న చీరలను సెలక్ట్ చేసుకోండి. హస్తకళా చీరలు లేదా లెహంగాల్లో మీరు కంఫర్టబుల్ గా ఉంటారు. అలాగే చూడటానికి చాలా అందంగా కూడా కనిపిస్తారు. దీనివల్ల మీరు స్థానిక కళాకారులకు సహాయపడినట్టు అవుతుంది. ఆడవాళ్లు బనారసి సిల్క్ లేదా పష్మినా కాశ్మీరీ సిల్క్ చీరను కట్టుకోవచ్చు. ఈ చీరలను పెళ్లిళ్లు, పండుగలకు కట్టుకోవచ్చు. వీటిలో మీ లుక్ అదిరిపోతుంది. 
 


saree

కలర్ 

ఫ్యాబ్రిక్, డిజైన్ తో పాటుగా బట్టల కలర్ కూడా చాలా ముఖ్యం. జువెల్ టోన్, పాస్టల్ అండ్ గ్రేడియంట్, మెరూన్, బ్లూ, గ్రీన్ వంటి వివిధ షేడ్స్ తో మీరు ప్రయోగాలు చేయొచ్చు. ఇవి మీ లుక్ ను పెంచుతాయి. వీటి మ్యాచింగ్ పై కూడా కొంత శ్రద్ధ పెడితే మీరు అందంగా కనిపిస్తారు. 
 

యాక్ససరీలు

మీరు వేసుకున్న బట్టలకు సరిపోయే వాటినే ఎంచుకోండి. చెవిపోగుల నుంచి స్టేట్ మెంట్ మంగ్టికా వరకు ఇవి మీ బట్టలకు సరిపోయేలా చూసుకోవాలి. దుస్తులతో వాటిని బ్యాలెన్స్ చేయడంపై కూడా దృష్టి పెట్టండి. అంటే బట్టలు బరువుగా ఉంటే యాక్సెసరీలు కాస్త తేలికగా ఉండేలా చూసుకోవాలి. 

ట్రైల్ స్టైల్

ప్రస్తుత కాలంలో అనార్కలి సూట్లు లేదా లెహంగాలు మంచి క్వాలిటీ ట్రైల్స్ తో డిఫరెంట్ లుక్ లో లభిస్తున్నాయి. వీటిని కూడా మీరు పెళ్లికి వేసుకోవచ్చు. ఇవి మీరు అందంగా కనిపించేలా చేస్తాయి.
 

ఫిట్టింగ్ దుస్తులు

ఫిట్టింగ్ దుస్తులు మీ లుక్ ను మరింత పెంచడమే కాకుండా మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి. ఫంక్షన్ కోసం మీరు ఎంచుకున్న బ్లౌజ్, కుర్తా, షరారా ప్యాంట్లు ఏవైనా అవి ఫిట్ అయ్యేలా చూసుకోండి. ఫిట్ గా ఉంటేనే మీ లుక్ బాగుంటుంది. బట్టలు కూడా అందంగా కనిపిస్తాయి. 
 

Latest Videos

click me!