శృంగార కోరికలు రెట్టింపు చేయడానికి ఈ వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి..

First Published | Apr 23, 2022, 4:56 PM IST

భార్య భర్తల మధ్యన శృంగారం కేవలం శారీరక ఆనందం కోసమే కాదు.. ఇది వారి మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది కూడా. ఒక రకంగా శృంగారం దాంపత్య జీవితంలో కీలకమనే చెప్పాలి. కానీ మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు వంటివి దంపతుల మధ్య లైంగిక జీవితాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి సమయంలో కొన్ని వ్యాయామాలు చేస్తే సెక్స్ కోరికలు రెట్టింపు అవుతాయని నిపుణులు చెబుతున్నారు. 
 

దాంపత్య జీవితంలో సెక్స్ ముఖ్యమైన భాగమనే చెప్పాలి. కానీ ప్రస్తుత కాలంలో భార్యా భర్తల మధ్య సెక్స్ లైఫ్ దూరమైందని పలు సర్వేలు చెబుతున్నాయి. జాతీయ ఆరోగ్య సంస్థ ప్రకారం.. Obesity వల్ల మహిళలు 43 శాతం, పురుషులు 31 శాతం సెక్స్ లైఫ్ కు దూరమయ్యారట. దీనివల్ల వారి దాంపత్య జీవితంపైనే కాదు, వారి ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం పడుతుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. అందుకే ఈ సమస్యలను వీలైనంత తొందరగా అధిగ మించాలని చెబుతున్నారు. 

అయితే నిత్యం వ్యాయామాలు చేస్తే శృంగార సామర్థ్యం పెరుగుతుందట. వ్యాయామం వల్ల శృంగార సామర్థ్యం రెట్టింపు అవడంతో పాటుగా ఎంతో హెల్తీగా ఉంటారట. ఇంతకీ సెక్స్ కోరికలు రెట్టింపు కావాలంటే ఎలాంటి ఎక్సర్ సైజెస్ చేయాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.. 


ఆకర్షణ పెరుగుతుంది.. నిత్యం ఎక్సర్ సైజెస్ చేయడం వల్ల మీ భాగస్వామి ఆకర్షించే శరీరాన్ని పొందుతారు. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మీ బాడీ చూడచక్కగా ఉండటంతో మీ భాగస్వామి మీ పట్ల ఆకర్షితుడవుతాడు. అంతేకాదు ఇది మీ సెక్స్ లైఫ్ ను కూడా మెరుగుపరుస్తుందంటున్నారు నిపుణులు. 

కండరాలు చురుగ్గా ఉంటాయి..  టెక్సాస్ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వే ప్రకారం.. ప్రతిరోజూ వ్యాయామం చేసే ఆడవారిలోనే లైంగిక కోరికలు బాగా ఎక్కువగా ఉంటాయని వెల్లడైంది. వీరు ప్రతిరోజూ ఎక్సర్ సైజెస్ చేస్తున్నప్పుడు వీరి హార్ట్ కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటుంది. దీంతో వీరు శ్వాసను ఎక్కువగా తీసుకుంటారు. దీంతో వీరి కండరాలు పనితీరు మెరుగుపడుతుంది. వీరి బాడీలో వచ్చే ఈ ఛేంజెస్ అన్నీ చివరకు లైంగిక కోరికలను పెంచడానికి సహకరిస్తాయి. 

ఒత్తిడి తగ్గుతుంది. సెక్స్ లైఫ్ ను నాశనం చేయడంలో ఒత్తిడే ముందుంటుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఇంటి పనులు, ఆఫీస్ పనులు వంటి ఎన్నో కారణాల వల్ల చాలా మంది ఒత్తిడికి గురవుతుంటారు. మరి ఈ ఒత్తిడి ఎక్కువైతే వీరి సెక్స్ లైఫ్ కు అడ్డుకట్ట పడ్డట్టే. అందుకే దీన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వల్ల ఒత్తిడి నుంచి సులువుగా బయటపడతారు. వ్యాయామాలను చేయడం వల్ల హ్యాపీ హర్లోన్లు కూడా రిలీజ్ అవుతాయి. వీటివల్ల రోజు రోజుకు మీలో లైంగిక కోరికలు పెరుగుతాయన్న మాట. 

రక్తప్రసరణ మెరుగవుతుంది.. రక్తప్రసరణ మెరుగ్గా జరిగినప్పుడే మన శరీర అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. చురుగ్గా పనిచేస్తాయి.  ఈ రక్తప్రసరణ sexual organs కూడా  అవసరమే. అలా జరగాలంటే వ్యాయామాలను తప్పక చేయాలని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామాలను చేయడం వల్ల హార్ట్ బీట్ పెరుగుతుంది. దీంతో మన బాడీపార్ట్స్ కు Blood circulation మెరుగ్గా జరుగుతుంది. దీంతో   sexual organs ఉత్తేజితం అవుతాయి. ఈ మార్పులన్నీ చివరకు సెక్స్ పట్ల కోరికలను పెంచుతాయి. 
 

ఇందుకోసం ఏయే వ్యాయామాలను చేయాలి.. లైంగిక కోరికలను పెంచడానికి, సెక్స్ సామర్థ్యాన్ని పెంచడానికి ఎక్సర్ సైజెస్ బాగా ఉపయోగపడుతాయంటున్నారు నిపుణులు. ఇందుకోసం స్విమ్మింగ్, సైక్లింగ్, నడక, కీగల్, పుషప్స్, పరుగు, ప్లాంగ్ వంటివి చేయాలట. ఈ వ్యాయామాలు  Pelvic floor muscles ను బలంగా చేస్తాయి. దీంతో మీరు కలయిను ఆస్వాదిస్తారు. 

ఈ వ్యాయామాలు దంపతులు ఇద్దరూ కలిసి చేయడం మంచిది. అయితే ఇన్ని చేసినా.. లైంగిక కోరికలు పుట్టకుంటే మీరు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. లేదంటే మీరు మీ సెక్స్ లైఫ్ కూ పూర్తిగా దూరం కావొచ్చు.  

Latest Videos

click me!