సమంతా మెరుపుతీగలా ఉండడానికి.. రోజూ ఏం తింటుందో తెలుసా..

First Published | Oct 6, 2021, 12:12 PM IST

సమంతా శాఖాహారాన్ని ఇష్టపడుతుంది. ప్లాంట్ బేస్డ్ డైట్ వల్లే తను వ్యాయామాలు చక్కగా చేయగలనని నమ్ముతుంది. దీనివల్ల తన శరీరం తీర్చి దిద్దినట్టుగా ఉంటుందని ఆమె నమ్మకం. 

Samantha

సమంతా.. ఏం మాయచేశావేతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ అందాలరాశి.. ఆ తరువాత అనేక హిట్స్ తో గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. ఆమె సినిమాలో ఉందీ అంటే.. ఆ సినిమా హిట్ అన్న టాక్ తెచ్చుకుంది. ఈ నటి అందంలోనే కాదు ఫిట్ నెస్ లోనూ ఎంతో కాన్షియస్ గా ఉంటుంది. 

ఆ తరువాతి కాలంలో తన మొదటి సినిమాలో కలిసి నటించిన నాగచైతన్యను ప్రేమించి, పెళ్లి చేసుకున్న సమంత.. తాజాగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వీరిద్దరి మధ్య ఈ విడాకులకు దారి తీసిన అంశాలేంటో తెలీక వీరి అభిమానులు బాధపడిన సంగతీ తెలిసిందే. షాకింగ్ కామెంట్స్ : ‘సమంతని ఆ హీరో ట్రాప్ చేశాడు’, సొంత సంపాదన ఆమె ఖాతాలోకి వెళ్లటం లేదు


పెళ్లైన తరువాత కూడా వరుస హిట్స్ తో దూసుకుపోయిన సమంత.. విడాకుల తరువాత సినిమాల్లో జోరు పెంచాలనుకుంటున్నట్టు టాలీవుడ్ టాక్. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటినుంచీ సమంతా ఫిట్ నెస్ మీద చాలా శ్రద్ధ పెడుతుంది. 

తనను తాను ఎంతో చక్కగా మెయింటేన్ చేసుకుంటుంది. బాడీ విషయంలో, వ్యాయామాలు, ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. దీనివల్లే ఆమె ఆరోగ్యంగా ఉండగలుగుతోంది. దీనికోసం చక్కటి పోషకాహారాన్నే ఆమె తీసుకుంటుందట. 

ఇన్నేళ్లైనా చెక్కుచెదరని అందంతో ఉన్న సమంతను చూసి మీరు షాక్ అవుతున్నారా? ఆమె అందం రహస్యమేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ ఆమె ఫిట్ నెస్ సీక్రెట్స్ చూడండి. 

సమంతా శాఖాహారాన్ని ఇష్టపడుతుంది. ప్లాంట్ బేస్డ్ డైట్ వల్లే తను వ్యాయామాలు చక్కగా చేయగలనని నమ్ముతుంది. దీనివల్ల తన శరీరం తీర్చి దిద్దినట్టుగా ఉంటుందని ఆమె నమ్మకం. 

సమంత ఇంటెన్స్ వర్కవుట్స్ చేస్తుంది. ఎక్స్ పరిమెంటల్ వర్కవుట్స్ చేస్తుంది. దీనికోసం తనకు ఎలాంటి ఆహారం సెట్టవుతుందో..ఎలాంటి డైట్ ఫాలో కావాలో ఆమెకు బాగా తెలుసు. అందుకే అలాంటి డైట్ నే ఆమె ఫాలో అవుతుంది. 

తన డైట్ లో తప్పనిసరిగా ప్రోటీన్ ఉండేలా చూసుకుంటుంది. దీనివల్ల తనకు అదనపు శక్తి లభిస్తుందంటారు. ఆ శక్తితో మరింత హార్డ్ వర్కవుట్స్ చేయచ్చని నమ్ముతారు. ఎడతెగని షూటింగులతో బిజీగా ఉండే సమంతా తన డైట్ లో ప్రతీ మీల్ లో ప్రోటీన్ ఉండేలా చూసుకుంటారు. ప్రోటీన్ రిచ్ ఫుడ్ వల్లే ఆమె డైట్ స్కోర్ చాలా ఎక్కువగా ఉంటుంది. 

తన ఆహారంలో చక్కెరలు తగ్గించడానికి తీసుకునే ఆహారాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆమె ఆహారాన్ని బాగా నమిలి తినడానికి ప్రాధాన్యతనిస్తుంది. అంతేకాదు పొట్ట ఎక్కువ సేపు నిండినట్టుగా ఉండాలని.. ఆరోగ్యానికి మంచి చేయాలని మిల్లెట్స్ ను చేరుస్తుంది. డైట్ లో రైస్ బదులు ఎక్కువ మొత్తంలో మిల్లెట్స్ ను చేరుస్తుంది. 

ఎప్పుడూ హైడ్రేట్ గా ఉండేలా చూసుకుంటుంది. దీనికోసం నీటిని ఎక్కువగా తాగడం.. తాజా పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటుంది. దీంతోపాటు కొబ్బరినీళ్లకూ ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. 

డైట్ పాటిస్తుందని తన కోరికల్ని చంపుకోదు సమంత. మీల్స్ ఎప్పుడూ స్కిప్ చేయదు. తనకిష్టమైన వాటిని తినకుండా ఊరుకోదు. అయితే ఏదైనా సరే కొద్ది మొత్తంలో మాత్రమే తింటుంది. ఇష్టమైన ఆహారం కదా అని తెగలాగించేయనని చెబుతోంది. 

Latest Videos

click me!