రోజూ ఈ పనులు చేస్తున్నారా? అయితే డేంజరే....

First Published | Sep 15, 2021, 2:06 PM IST

నిమిషానికి ఓ సారి సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో చెక్ చేసుకోకపోతే మనసున పట్టదు. దీనివల్ల ప్రస్తుతంలో జీవించడం మరిచిపోయి.. జరిగిపోయిన.. జరగనున్న కాలంలో జీవిస్తుంటారు. దీనివల్ల అనవసరపు మానసిక అలజడి కూడా కలుగుతుంది. 

రోజువారీ దినచర్యలో భాగమైన కొన్ని అలవాట్లు మీ శక్తిని హరిస్తాయి. మిమ్మల్ని నీరసంగా, నిరుత్సాహంగా చేస్తాయి. ఎంతమంచి ఆహారం తీసుకున్నా.. వ్యాయామాలు చేసినా.. ఉత్సహంగా ఉందామని ఎంతగా ప్రయత్నించినా దీనివల్ల ఫలితం లేకుండా పోతుంది. అంతిమంగా ఇది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. 

ఇలాంటి అలవాట్ల గురించి తెలుసుకోవడమే కాదు. వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయాలి. అలాంటి అలవాట్లేంటో ఒక్కసారి చూద్దాం. 


జరిగిపోయిన దాన్ని పదే పదే తలుచుకోవడం వల్ల.. ప్రస్తుతంలో సంతోషంగా ఉండలేరు. అది మీ జీవితాన్ని నరకంగా మార్చేస్తుంది. అలాగే ఎవరిమీదైనా కోపం, కసి ఉండడం సహజమే. కానీ దాన్నే పదే పదే తలుచుకోవడం వల్ల నష్టం తప్ప ఉపయోగం ఉండదు. 

నిమిషానికి ఓ సారి సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో చెక్ చేసుకోకపోతే మనసున పట్టదు. దీనివల్ల ప్రస్తుతంలో జీవించడం మరిచిపోయి.. జరిగిపోయిన.. జరగనున్న కాలంలో జీవిస్తుంటారు. దీనివల్ల అనవసరపు మానసిక అలజడి కూడా కలుగుతుంది. 

ఏ విషయాన్నైనా మనసుమీదికి అతిగా తీసుకోకండి. దీనివల్ల మానసిక ఆరోగ్యం.. తద్వారా శారీరక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. ఎవరైనా ఏమైనా అనగానే మిమ్మల్ని బాధపెట్టడానికే అన్నారని అపోహ పడకండి. నిజానికి ఎదుటివారు మిమ్మల్ని బాధించాలని చూడకపోవచ్చు కూడా. 

ప్రతి వ్యక్తిలోనూ పాజిటివ్, నెగెటివ్ లు రెండూ ఉంటాయి. అయితే కేవలం మీలోని నెగటివ్ వైపు మాత్రమే ఆలోచించడం వల్ల జీవితం దుర్బరంగా మారిపోతుంది. ఇది మిమ్మల్నే కాదు మీ చుట్టూ ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యుల్ని కూడా డిప్రెషన్ లోకి నెడుతుంది. 

అతిగా ఆలోచించడం వల్ల సమస్యలు తీరిపోవు. ఏ సమస్య కూడా శాశ్వతం కాదు. సమయానుసారంగా అది సాల్వ్ అవుతుంది. అందుకే దానికి కావాల్సిన టైంను ఇవ్వండి. అంతేకానీ అతిగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. అతిగా ఆలోచించడం వల్ల మెచ్యుర్ గా ఆలోచించడం, షార్ప గా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. 

కొంతమంది ప్రతీదాంట్లోనూ తప్పులు వెతుకుతుంటారు. ఇది బాలేదు, అది బాలేదు.. ఇది సరికాదు, ఇదే కరెక్ట్ అంటూ  ఫిర్యాదులు చేస్తుంటారు. అయితే ఇది అంత మంచి విషయం కాదు. మీ వైపు నుంచి మీరు కరెక్ట్ గా ఉండడానికి ప్రయత్నించండి.. కష్టపడండి. నిజంగా మీకు ఎదుటివారు చేసేది తప్పు అనిపిస్తే.. సున్నితంగా చెప్పడానికి ప్రయత్నించండి. 

కొంతమంది ఎప్పుడూ జంక్ ఫుడ్స్ తింటుంటారు. మామూలు ఆహారం వారికి అస్సలు ఇష్టం ఉండదు. ఇది కేవలం ఆరోగ్యానికి హాని చేయడమే కాదు.. అనేక సమస్యలకూ దారి తీస్తుంది. ఇలాంటి ఆహారాల వల్ల పొట్ట నిండుతుంది. కానీ శరీరానికి కావాల్సిన శక్తి అందదు. 

ఎవర్నో మెప్పించాలని నిరంతరం ప్రయత్నించడం వల్ల మీ సంతోషం దెబ్బ తింటుంది. మీరేం చేసినా ఎవరేం అనుకుంటారో అని కాకుండా.. మీ మనసుకు నచ్చింది చేయండి. ఇతరుల్ని సంతోషపెట్టాలని చేసే పనులు మీకు తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.

Latest Videos

click me!