నిశ్శబ్దంగా జీవితాన్ని నాశనం చేసే 7 అలవాట్లు

First Published | Aug 31, 2024, 11:19 AM IST

చెడు అలవాట్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని మనకు తెలుసు, కానీ కొన్ని అలవాట్లు స్లో పాయిజన్ లా మనల్ని నాశనం చేస్తాయి. ఒత్తిడి, ఇష్టం లేని ఉద్యోగం, టాక్సిక్ సంబంధాలు, ఫాస్ట్ ఫుడ్ - ఇవన్నీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.

ప్రతి ఒక్కరికీ కొన్ని అలవాట్లు ఉంటాయి. మనకు ఉండే అలవాట్లు.. మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా ఉండాలే కానీ.. మన జీవితాన్ని నాశనం చేసేలా ఉండకూడదు. చెడు అలవాట్లు అంటే మందు తాగడం, స్మోకింగ్ చేయడం మాత్రమే కాదు.. ఇవి ఆరోగ్యాన్ని మాత్రమే దెబ్బతీస్తాయి. కానీ.. మనం హాని చేయవు అని భ్రమలో ఉండే కొన్ని అలవాట్లు.. స్లో పాయిజన్ లా మనల్ని నాశనం చేస్తాయి. మరి ఎలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలో ఓ లుక్కేద్దాం..

1.ఒత్తిడితో కూడిన జీవితం.

ఒత్తిడిని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ.. ఒత్తిడి మన జీవితాలను నెమ్మదిగా నాశనం చేస్తుంది. నెమ్మదిగా... మన బాడీ, మైండ్ రెండింటినీ నాశనం చేస్తుంది.  ఇది నెమ్మదిగా గుండె ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది.  హైబీపీ రావడానికి కారణం అవుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ ని వీక్ చేస్తుంది.


Stress

2.ఇష్టం లేని ఉద్యోగం..
చాలా మంది జీతం కోసం ఇష్టం లేని ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. తమకు ఇష్టమైన పని చేయలేక, చేస్తున్న పని మీద ఇష్టం లేకుండా పని చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా వచ్చిన నష్టం ఏముంది అని అనుకుంటూ ఉంటారు. కానీ... ఇది కూడా మనకు స్లో పాయిజన్ లా మారుతుంది.  నెమ్మదిగా తలనొప్పి, జీర్ణ సమస్యలు రావడం మొదలుపెట్టి... నెమ్మదిగా.. ఇతర ఆరోగ్య సమస్యలు రావడానికి కూడా కారణం అవుతుంది.
 

3.టాక్సిక్ పీపుల్ తో ఉండటం..
మన చుట్టూ పాజిటివిటీ నింపే వ్యక్తులు ఉంటే.. అది మనకు కూడా  సహాయపడుతుంది. అలా కాకుండా.. నెగిటివ్ గా మాట్లాడుతూ, తమలో ఉన్న విషాన్ని, ఇతరులకు కూడా విషాన్ని పంచుతూ ఉండేవారు చాలా మంది ఉంటారు. వాళ్లు.. మన ఎనర్జీ మొత్తాన్ని నాశనం చేస్తూ ఉంటారు. అలాంటివాళ్లు.. మన పక్కన ఉన్నంత వరకు.. మనకు మానసికంగా సమస్యలు వస్తూనే ఉంటాయి. స్లో పాయిజన్ లాగా.. మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తారు. కాబట్టి.. అలాంటివారికి ఎప్పుడూ దూరంగా ఉండాలి.
 

4.ఫాస్ట్ ఫుడ్ తినడం..
చాలా మందికి ఫాస్ట్ ఫుడ్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. కడుపు నింపుకోవడానికి టేస్టీ ఫుడ్స్ తినాలి అనే ఆత్రంలో... వీటిని తింటూ ఉంటారు. కానీ... ఆ ఆహారం.. ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు, సోడియం, షుగర్ ఎక్కువ గా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల... ఒబేసిటీ, గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
 

5.బ్రేక్ ఫాస్ట్ తినడం మానేయడం..
చాలా మంది చేసే అతి పెద్ద పొరపాటు. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ మానేసి. డైరెక్ట్ గా మధ్యాహ్నం లంచ్ చేస్తారు. దీని వల్ల బరువు తగ్గుతున్నాం అనుకుంటారు. కానీ...  రెగ్యులర్ గా బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల... చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.  బరువు తగ్గడం కాదు.. విపరీతంగా పెరిగేస్తారు...ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.

6.ఎక్కువగా బాధపడటం, యాంక్సైటీ లాంటి సమస్యలు ఉన్నా.. వాటిని పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి.  ప్రతి విషయానికి బాధపడే అలవాటు ఉన్నవారికి... చాలా రకాల సమస్యలు వచ్చేస్తాయట.  ఇది బరువు పెరగడానికి కూడా కారణం అవుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ బలహీనపడుతుంది. 

7.సెల్ఫ్ కేర్ చేయకపోవడం.. చాలా మంది తమను తాము పట్టించుకోరు. ఫిజికల్ గా, మెంటల్ గా తమ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే.. చిన్నవయసులోనే వయసు పైబడిన వారిలా కనిపిస్తారు.
 

Latest Videos

click me!