వరలక్ష్మీ వత్రం రోజు చెప్పులు ఇంటి ముందు పెట్టారో.. అంతే..

First Published | Aug 13, 2024, 11:27 PM IST

స్త్రీలకు ఎంతో ఇష్టమైన వ్రతం వరలక్ష్మీ దేవి వ్రతం. వారికి  సర్వ సౌభాగ్యములు, సంపద, కీర్తి, మొదలైనవి ఆ అమ్మవారు ప్రసాదిస్తుందని మహిళల విశ్వాసం. అందుకే ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేస్తారు. అయితే ఆ రోజు పూజ చేసేటప్పుడు చేయకూడని కొన్ని పనులున్నాయి. వాటిని తప్పక తెలుసుకోండి..
 

హిందూ సంప్రదాయంలో పురాణ కాలం నుంచి వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తున్నట్లు పండితులు చెబుతున్నారు. మహిళలు ఈ వ్రతం ఆచరించడం వల్ల వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయని ప్రజల విశ్వాసం.  అందుకే అన్ని ముఖ్యమైన పండగల్లో వరలక్ష్మీ వ్రతం కూడా ఒకటిగా మారిపోయింది. హిందువులు తప్పకుండా నిర్వహించే  ముఖ్య వ్రతంగా మారింది. 
 

చారుమతీ దేవిని ఆదర్శంగా తీసుకొని గృహిణులు ఈ వ్రతం చేయాలని పరమేశ్వరుడు పార్వతీ దేవికి చెప్పినట్లు వరలక్ష్మీ వ్రత కథలో ఉంది.  ఎందుకు చారుమతిని ఆదర్శంగా తీసుకోవాలంటే.. ఆమె గుణగణాలు అంత గొప్పవని చెబుతారు. వాటిని గృహిణులు తెలుసుకొని ఆచరించాలట.. అలా ఆచరించలేని వారు కనీసం ఈ తప్పులు అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. 


1. వరలక్ష్మీ వ్రతం రోజు జుట్టు విరబూసుకొని ఉండకూడదు.
2. ఇంట్లో దుర్గధం లేకుండా సాంబ్రాణి లేక అగరువత్తుల పొగ వేసి శుద్ధి చేయాలి.
3. అపరిశుభ్రమైనవి, ఫ్యాషన్‌ డ్రస్సులు వేసుకోకూడదు. గృహిణులైతే తప్పక చీర కట్టుకోవాలి. పెళ్లి కాని ఆడపిల్లలైతే సంప్రదాయ బట్టలు వేసుకోవాలి. 
4. పూజ చేసేటప్పుడు మనసంతా అమ్మవారిపైనే లగ్నం చేయాలి. ఇతర విషయాలేవీ ఆలోచించకూడదు. 

5. ముఖ్యంగా వ్రతం చేసేటప్పుడు మహిళలు ఇతరులతో వాదన పెట్టుకోవడం, గొడవ పడటం అస్సలు చేయకూడదు. సౌమ్యంగా మాట్లాడుతూ ఓపిగ్గా పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలి. 
6. పూజ చేసే సమయంలో మధ్యలో లేవకూడదు. వంట మధ్యలో ఉందని, పాలు పొంగిపోతున్నాయని మధ్యలో లేచి పనులు చేయకూడదు. 
7. చాలా మంది చెప్పలు పక్కకు విడువకుండా గుమ్మానికి ఎదురుగా విడిచిపెడతారు. ఇది చాలా పెద్ద దోషమని వేద పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి రావాలనుకున్న వరలక్ష్మీ దేవి అటునుంచే వెనక్కు వెళ్లిపోతుందట..

Latest Videos

click me!