ఈ పూల మొక్కలు పెంచితే మీ ఇల్లంతా సువాసనే..

First Published | Aug 11, 2024, 11:00 PM IST

ఇంటిలో దుర్వాసన రాకుండా అనేక రూమ్ స్ప్రే లాంటివి వాడుతుంటారు. వాటికి బదులు సువాసన కలిగిన పూలు పూచే మొక్కలను మీ ఇంటి తోట, ఆవరణలో పెంచితే మీ ఇల్లంతా సువాసనభరితంగా మారిపోతుంది. ఒత్తిడులను దూరం చేసి మనసుకు ప్రశాంతతను అందిస్తాయి. ఆ పూల మొక్కల గురించి వివరాలు ఇవిగో..

గులాబీ

ప్రేమకు చిహ్నమైన గులాబీ పూల గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. మంచి సువాసనతో పాటు ఆహ్లాదకరమైన రంగుల్లో కనిపిస్తుంటాయి. సాధారణంగా అందరూ గులాబీ పూల మొక్కలే పెంచుకుంటారు. అయితే అంటు కట్టిన పూలు ప్రత్యేక రంగుల్లో లభిస్తాయి. అలాంటివి ఇంటి ఆవరణలో ఉంటే ఇల్లు మరింత అందంగా మారుతుంది. సువాసన ప్రశాంతతనిస్తుంది. 

లిల్లీ

2 నుంచి 6 అడుగుల ఎత్తు వరకు ఎదిగే పూల మొక్క ఇది. లిల్లీలు తెలుపు, పింక్‌, నారింజ, ఎరుపు, పసుపు రంగుల్లో ఉంటాయి. శుభకార్యాల్లో వీటి వాడకం చాలా ఎక్కువ. పెరటిలో ఈ పూలు ఉంటే ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. కొన్ని లిల్లీ జాతులు ఔషధ గుణాలను సైతం కలిగి ఉంటాయి. 
 


లావెండర్‌

లావెండర్‌ పూలు ప్రత్యేక సువాసన కలిగి ఉంటాయి. రాజుల కాలంలో వీటిని ఎక్కువగా ఉపయోగించే వారట. ప్రస్తుతం పరిమళాలు తయారు చేసే ప్రోడక్ట్‌లలో వినియోగిస్తున్నారు. ఒత్తిడి, ఆందోళనలు దూరం చేసే ఈ పూలు కొన్ని చర్మ సమస్యలకు మందుగా ఉపయోగపడతాయి. లావెండర్‌ మొక్కలకు కనీసం 6 గంటలు సూర్యకాంతి అవసరం.
 

మల్లె

ఆలివ్ కుటుంబంలోని పొదలు, తీగల జాతి మొక్క ఇది. మల్లెలో దాదాపు 200 రకాలున్నాయి. కేవలం వీటి సువాసన కోసమే వాణిజ్య పంటగా వీటిని సాగుచేస్తారు. సెంట్‌, డియోడ్రెంట్‌, సోప్‌ల తయారీలోనూ ఈ పూలను ఉపయోగిస్తారు.ఈ పూల మొక్కను మీ పెరటిలో పెంచితే పూల సువాసన మీకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇవి తెలుపు, పసుపు రంగులో కూడా ఉంటాయి. 

పారిజాతం

పారిజాత వృక్షం చాలా పురాతనమైన చెట్టు. పురాణాల్లో ఈ చెట్టు గురించి ప్రత్యేక ప్రస్తావన కూడా ఉంది. దీన్ని నైట్‌ బ్లోమింగ్‌ జాస్మిన్‌ అని కూడా అంటారు. గ్రామాల్లో రాత్రి రాణి అని పిలుస్తారు. ముఖ్యంగా రాత్రి పూట ఈ పూలు వెదజల్లే సువాసన ప్రశాంతమైన నిద్రకు ఉపయోగపడుతుంది. ఇవి తెలుపు, కాషాయం రంగులో ఉంటాయి. ఎక్కువగా రాత్రి పూట వికసిస్తాయి. 

Latest Videos

click me!