
తేనెను ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింుటంటారు. ఇది తీయగా ఉండటమే కాదు కృత్రిమ స్వీటెనర్ల కంటే టేస్టీగా కూడా ఉంటుంది. ముఖ్యంగా తేనెలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. దీనిలో మన శరీరానికి అవసరమైన పోషకాలతో పాటుగా ఫ్రక్టోజ్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అందుకే దీన్ని రోజూ ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రోజూ 25 గ్రాముల కంటే తక్కువ ఫ్రక్టోజ్ నే తీసుకోవాలి.
ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం తేనె. ఇది మనల్ని ఎన్నో జబ్బుల నుంచి కాపాడుతుంది. తేనెను తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరుగుతాయి. శ్లేష్మం తొలగిపోతుంది. కాలెయం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఆడవారికి పీరియడ్స్ రెగ్యులర్ గా అవుతాయి. తల్లుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది.
తేనె చాలా తొందరగా జీర్ణమవుతుంది. ఇది రక్తంలో కలిసిపోయి మన శరీరానికి ఎనర్జీనిస్తుంది. అయితే మనం తేనెతో దీన్ని తీసుకున్నా అదే ప్రభావం మన శరీరంపై పడుతుంది. అంటే తేనెను వేడి పదార్థంతో తీసుకుంటే మన శరీరంపై వేడి ప్రభావం పడుతుంది. చల్లని పదార్ధాలతో తీసుకుంటే చలువ ప్రభావం పడుతుంది. తేనె లో మెండుగా ఉండే పొటాషియం వ్యాధికారక క్రిములను చంపుతుంది. ముఖ్యంగా తేనె టైఫాయిడ్, బ్రోన్కైటిస్ వంటి క్రిముల వల్ల కలిగే అనేక క్రిములను చంపేస్తుంది. తేనెలో ఐరన్, మాంగనీస్, కాపర్, సిలికా, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, అయోడిన్, సల్ఫర్, కెరోటిన్, యాంటీసెప్టిక్స్ వంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి.
రోజూ చెంచా తేనెను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది
30 రోజుల పాటు 70 గ్రాముల తేనెను తింటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ 3 శాతం తగ్గుతాయని ఒక అధ్యయనంలో తేలింది. మరో అధ్యయనంలో 8 శాతం తగ్గుదల కనిపించింది. అలాగే తేనెను తిన్నా శరంరలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ వల్ల నష్టం కలగదు. ఇది మన శరీరాన్ని రక్షించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
జలుబు, దగ్గును తగ్గిస్తుంది
తేనెకు జలుబు, దగ్గును తగ్గించే లక్షణాలు ఉంటాయి. తేనె తింటే రాత్రిపూట దగ్గు తగ్గుతుంది. అలాగే పిల్లలు ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. దగ్గును అణిచివేసే ఒక సాధారణ పదార్ధమైన డెక్స్ట్రోమెథోర్ఫాన్ లాగే తేనె పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే జలుబు తగ్గుతుంది.
గాయాలు తగ్గుతాయి
తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేసే బ్యాక్టీరియా పెరగకుండా చూస్తాయి. అందుకే తేనెతో గాయాలు, కాలిన గాయాలు, కోతలు తొందరగా తగ్గిపోతాయి. ఇందుకోసం గాయాలపై తేనెను రాయాలి.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
తేనె కూడా మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీనివల్ల మీరు ఎలాంటి భయం లేకుండా హాని లేకుండా ఈజీగా బరువు తగ్గుతారు. తేనె శరీరంలో ఉన్న అదనపు కొవ్వును కరిగించడానికి జీవక్రియను పెంచుతుంది. ఇందుకోసం మీరు తేనె కలిపిన నిమ్మరసాన్ని పొద్దున్నే పరిగడుపున తాగాలి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
తేనెలో మిథైల్గ్లియోక్సల్ పుష్కలంగా ఉంటుంది. దీనిలో యాంటీ బాక్టీరియల్ లక్షనాలుఉంటాయి. ఈ రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది. దీంతో మీరు ఎన్నో అనారోగ్య జబ్బులకు, సీజనల్ సమస్యలకు దూరంగా ఉంటారు.
గొంతు నొప్పిని తగ్గుతుంది
తేనెలో మిథైల్గ్లియోక్సల్ అనే కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇధి గొంతు సమస్యైన టాన్సిలైటిస్కు కారణమయ్యే స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియం అనే బ్యాక్టీరియాను చంపుతుంది. ఇందుకోసం తేనె కలిపిన గోరువెచ్చని నీళ్లను తాగాలి.