ఈ కిచెన్ హ్యాక్ తెలిస్తే.. వంట చేయడం చాలా సింపుల్...!

First Published | Jul 26, 2024, 10:25 AM IST

 వండినది తినేసి గిన్నెలు ఖాళీ చేయడం సులభమే. కానీ... ఆ వంట పూర్తవ్వడానికి గంటల సమయం పడుతుంది. మీరు ఈ వంట పనులతో బాగా అలసిపోతున్నారా..? చాలా త్వరగా అయిపోతే బాగుండు అని కోరుకుంటున్నారా..? అయితే.. ఈ కిచెన్ హ్యాక్స్ మీరు తెలుసుకోవాల్సిందే.

జీవితంలో ఎప్పుడో ఒకసారి వంట చేసేవాళ్లకు ఏమీ అనిపించదు. సరదాగానే ఉంటుంది. కానీ... ప్రతిరోజూ ఒంట్లో బాగున్నా, బాగోకపోయినా.. పిల్లల కోసం, భర్త కోసం.. కుటుంబ సభ్యుల కోసం వంట చేసేవాళ్లకు ఆ బాధ తెలుస్తుంది. రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వంట చేయకతప్పదు. ఇక.. ఆఫీస్ వర్క్ చేస్తూ.. ఈ వంట పనిని మ్యానేజ్  చేయడం అంటే మరింత కష్టంగా ఉంటుంది. వండినది తినేసి గిన్నెలు ఖాళీ చేయడం సులభమే. కానీ... ఆ వంట పూర్తవ్వడానికి గంటల సమయం పడుతుంది. మీరు ఈ వంట పనులతో బాగా అలసిపోతున్నారా..? చాలా త్వరగా అయిపోతే బాగుండు అని కోరుకుంటున్నారా..? అయితే.. ఈ కిచెన్ హ్యాక్స్ మీరు తెలుసుకోవాల్సిందే.

cooking

వంట చేయడం ఒక ఎత్తు అయితే.. ఆ వంటకు కావాల్సిన సామాన్లు రెడీ చేసుకోవడం మరో పెద్ద టాస్క్. కొన్ని సింపుల్ గా అనిపించినా.. ఎక్కువ సమయం పట్టేస్తూ ఉంటాయి. అలా.. ఎక్కువ సమయం పట్టేవాటిని కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం...

Latest Videos


1.వెల్లుల్లి తొక్క తీయడం..
ఇది ఎంత పెద్ద టాస్కో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. పావుకేజీ వెల్లుల్లి తొక్క తీసేలోగా.. బిర్యానీ చేసేయవచ్చు. అంత కష్టం వెల్లుల్లి తొక్కతీయడం. అయితే..దీనిని కూడా ఈజీగా తీసే హ్యాక్ ఉంది.  వెల్లుల్లి రెబ్బలను కత్తి  ఫ్లాట్ సైడ్ కింద ఉంచండి. వాటిని ఇప్పుడు గట్టిగా  నొక్కండి. అంతే.. ఈజీగా పీల్ ఊడిపోతుంది. మనకు వెల్లుల్లి తొక్కలేకుండా వచ్చేస్తుంది.

2.వంట చేసినప్పుడు పొంగిపోవడం.. ఇక.. పాలు, అన్నం, సాంబారు లాంటివి కాసేపు మనం వాటి వంక చూడకపోతే.. పొంగిపోయి.. స్టవ్ అంతా నాశనం చేసేస్తాయి. ఈ వంటతోనే పెద్ద పనిరా అనుకుంటే.. దానికితోడు.. స్టవ్ అంతా గిజిబిజీగామారి.. క్లీనింగ్ చేసుకోవడం మరో పెద్ద పని. అలా జరగకుండా ఉండాలంటే.. మీరు స్టవ్ మీద ఉంచిన గిన్నెలో.. ఒక గరిటె ఉంచండి. అప్పుడు.. పాలు, అన్నం, సాంబార్ ఏదైనా సరే.. పొంగి.. కింద పడకుండా ఉంటుంది. మీకు స్టవ్ నీట్ గా ఉంటుంది. 
 

3.ఇక వంటలో వేయడానికి మంచి సువాసన, రుచిని పెంచుతాయి అని కొత్తిమీర, పుదీనా లాంటివి తెచ్చి ఉంచుకుంటామా.. అవి కాస్త.. అవసరం వచ్చే సమయానికి పాడై కూర్చుంటాయి. వంటలో వేయడానికి పనికి రాకుండా అయిపోతాయి. ఇలా అవ్వకుండా ఉండాలంటే.. వాటిని ఏదైనా తాజా నీటి కూజాలో పెట్టి ఉంచవచ్చు. లేదు.. మేము ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం అంటే.. ఏదైనా కంటైనర్ తీసుకొని.. దాంట్లో టిష్యూ పేపర్ ఉంచి..దాని మీద వీటిని ఉంచితే.. ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. 
 

click me!