గంటలు గంటలు ల్యాప్‌టాప్‌ ఒడిలో పెట్టుకొని పనిచేస్తున్నారా? మీ పని అయిపోయినట్లే.. ఓసారి చెక్‌ చేసుకోండి

First Published Sep 20, 2024, 10:43 AM IST

మీరు రోజంతా ల్యాప్‌టాప్‌పైనే పనిచేస్తున్నారా? అయితే డేంజర్ బెల్స్ మోగుతున్నట్లే. ల్యాప్‌టాప్‌లను ఎక్కువసేపు ఒడిలో పెట్టుకొని వాడటం వల్ల పురుషుల సంతానోత్పత్తి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ల్యాప్‌టాప్ నుంచి వచ్చే వేడి వృషణాల ఉష్ణోగ్రతను పెంచి, వీర్యకణాల నాణ్యత, చలనం తగ్గిస్తుందని పరిశోధనలు తేల్చాయి. మరి ఈ ప్రభావాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి.

ప్రస్తుతం అంతా టెక్నాలజీ మయం అయిపోయింది. ఏ పని చేయాలన్నా సాంకేతికతతో ముడి పడి ఉంటోంది. ఉద్యోగాలు కూడా చాలా వరకు వర్క్‌ ఫ్రం హోం అయిపోయాయి. దీంతో సమయంతో సంబంధం లేకుండా పనిచేసేస్తున్నారు చాలా మంది. ఈ క్రమంలో ల్యాప్‌టాపే సర్వస్వం అయిపోతోంది. దీని వల్ల ఎన్ని అనర్థాలు ఉన్నాయో తెలుసా...?

Does Laptop Usage Affect Male Fertility?

ల్యాప్టాప్‌లు పనితో పాటు విశ్రాంతికి అవసరమైన సాధనాలుగా మారాయి. కానీ వాటి సౌలభ్యం చాలా మంది పురుషులకు తెలియని ప్రతికూలతని చూపిస్తోంది. పురుషుల్లో సంతానోత్పత్తిపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. 

ఆధునిక జీవనశైలి సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడుతున్నందున, దీర్ఘకాలిక ల్యాప్టాప్ వాడకం పురుష పునరుత్పత్తి ఆరోగ్యంపై చూపే ప్రభావాల గురించి ఆందోళనలు పెరుగుతున్నాయి. డేమ్ హెల్త్ కు చెందిన డాక్టర్ రూబీ యాదవ్, కన్సల్టెంట్ డైటీషియన్ అండ్ డయాబెటిస్ ఎడ్యుకేటర్ కనికా మల్హోత్రా అనే ఇద్దరు నిపుణులు ఈ అంశంపై దృష్టి సారించారు.

Latest Videos


Does Laptop Usage Affect Male Fertility?

పొంచి ఉన్న ప్రమాదం...

డాక్టర్ రూబీ యాదవ్ చెప్పిన ప్రకారం, ల్యాప్టాప్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం, ముఖ్యంగా మీ ఒడిలో పెట్టుకొని పనిచేయడం వల్ల దుష్పరిణామాలు ఎదురువుతాయట. ''ముఖ్యంగా మగ వారిలో సంతానోత్పత్తిపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇందుకు సంబంధించి పరిశోధనల ఫలితాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ... ఈ ఏడాది జరిపిన పరిశోధనలు ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు విద్యుదయస్కాంత క్షేత్రాలను విడుదల చేయడం ద్వారా వంధ్యత్వాన్ని ప్రోత్సహిస్తాయని సూచిస్తున్నాయి. ఇది స్క్రోటల్ హైపర్థెర్మియాకు కారణమవుతుంది. ఉష్ణోగ్రతలో అసాధారణ పెరుగుదల, ఆక్సీకరణ ఒత్తిడి డీఎన్ఎ నష్టానికి దారితీస్తుంది. ఇది స్పెర్మ్ నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది'' అని రూబీ యాదవ్‌ తెలిపారు. 

ల్యాప్ టాప్ వాడకంతో ప్రధాన సమస్య స్క్రోటల్ టెంపరేచర్ పెరగడమేనని కనికా మల్హోత్రా చెప్పారు.  "స్పెర్మ్ ఏర్పడటానికి అనువైన ఉష్ణోగ్రత ప్రధాన శరీర ఉష్ణోగ్రత కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. వృషణానికి దగ్గరగా ల్యాప్టాప్‌లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇలా పెరిగిన ఉష్ణోగ్రతలు స్పెర్మాటోజెనిసిస్‌కు ఆటంకం కలిగిస్తాయి. ఇది స్పెర్మ్ కౌంట్, చలనశీలతను తగ్గిస్తుంది. ఇది సంతానోత్పత్తి తగ్గడానికి దారితీస్తుంది" అని కనికా మల్హోత్రా పేర్కొన్నారు. అధిక స్క్రోటల్ ఉష్ణోగ్రతలను తక్కువ స్పెర్మ్ పరామితులతో అనుసంధానించాయని అధ్యయనాలు వెల్లడించాయన్నారు. 

Tips for Men Under 30

ఈ టిప్స్‌ పాటించడం ద్వారా సేఫ్‌ కావచ్చు

ఈ ప్రమాదాలను తగ్గించడానికి, ఇద్దరు నిపుణులు కొన్ని అలవాట్లు, జీవనశైలి మార్పులను అనుసరించాలని సిఫార్సు చేశారు. ల్యాప్ టాప్‌లను నేరుగా తమ ఒడిలో పెట్టుకోవద్దని కనికా మల్హోత్రా పురుషులకు సూచించారు. డెస్క్‌పై ల్యాప్‌టాప్‌ను ఉపయోగించడం లేదా కూలింగ్ ప్యాడ్‌ను ఉపయోగించడం స్క్రోటల్ టెంపరేచర్ పెరుగుదలను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని చల్లబరచడానికి తరచుగా విరామం తీసుకోవడం కూడా చాలా అవసరం" అని ఆమె సూచిస్తున్నారు.

30 ఏళ్లలోపు పురుషులు ఈ టిప్స్‌ పాటించడంతో పాటు మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ రూబీ యాదవ్ సూచిస్తున్నారు. స్పెర్మ్ నాణ్యత, కౌంట్, చలనశీలతను మెరుగుపరచడానికి డేమ్ హెల్త్ ఆప్టిమెన్ ప్రత్యేకంగా రూపొందించింది. ఇందులో బి12, డి3 లాంటి కీలక విటమిన్లు, జింక్, ఫోలేట్, జిన్సెంగ్ వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, డిఎన్ఎ నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయి" అని రూబీ వివరించారు. ఇలాంటి సప్లిమెంట్స్, జీవనశైలి సర్దుబాట్లతో కలిపినప్పుడు, మగ సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి బహుముఖ విధానాన్ని అందించవచ్చు.

Tips for Men Under 30

పునరుత్పత్తి ఆరోగ్యంపై విస్తృత ప్రభావం

వంధ్యత్వ సమస్య మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నందున సుమారు 15-20% యువ జంటలు గర్భం ధరించడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. ఇందుకు కారణమైన అన్ని కారకాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం. 2005లోనే జరిగిన అధ్యయనాల్లో వీర్యకణాల ఉత్పత్తిలో క్షీణత కనిపించిందని డాక్టర్ యాదవ్ పేర్కొన్నారు. ఆధునిక కాలంలో ల్యాప్ టాప్, సెల్ ఫోన్ వాడకం పెరగడం ఈ ఇబ్బందికర ధోరణికి మరింత దోహదం చేస్తుందని వెల్లడించారు.

"30 ఏళ్ళ వయసులో ఉన్న పురుషులు, ముఖ్యంగా కుటుంబాలను ప్రారంభించాలనుకునేవారు రోజువారీ అలవాట్లు పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడంలో చురుకుగా ఉండాలి" అని రూబీ యాదవ్ చెప్పారు. ఎక్కువ సేపు ఒడిలో పెట్టుకొని ల్యాప్టాప్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ల్యాప్టాప్ కోసం డెస్క్ లేదా కూలింగ్ ప్యాడ్ ఉపయోగించడం, తరచుగా విరామాలు తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని తప్పించుకోవచ్చని చెప్పారు. ల్యాప్టాప్‌తో రోజు గంటలు గంటలు పనిచేసేవారు సంతానోత్పత్తిని పెంచే సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు. 

click me!