Health tips: రాత్రి పూట లేట్ గా తింటే బరువు పెరుగుతారంట జాగ్రత్త..

Published : Apr 12, 2022, 01:37 PM IST

Health tips: రాత్రి పూట లేట్ గా తినే అలవాటు ఉన్నవాళ్లు పరిమితికి మించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. దీని వల్ల విపరీతంగా బరువు పెరిగే అవకాశముంది. 

PREV
19
Health tips: రాత్రి పూట లేట్ గా తింటే బరువు పెరుగుతారంట జాగ్రత్త..

ప్రస్తుత కాలంలో అధిక బరువు పెద్ద సవాలుగా మారింది. మారుతున్న జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్ల మూలంగా ఎంతో మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. 
 

29

పని ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు కూడా అధిక బరువుకు కారణమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మనం కొన్ని ఆహారాలను తినకూడదని సమయాల్లో తింటే కూడా అధిక బరువు, ఊబకాయం సమస్యను ఫేస్ చేయాల్సి ఉంటుంది.  ఈ అధిక బరువు, ఊబకాయం సమస్య ఎక్కువగా రాత్రిపూట తినేవారిలోనే కనిపిస్తుందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. 
 

39

రాత్రి పూట తింటే బరువు పెరుగుతారన్న విషయంలో నిజం లేకపోయినప్పటికీ.. రాత్రిపూట తినే ఆహారం ఎక్కువ కేలరీలదై ఉంటే మాత్రం బరువు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. 

49

ఎప్పుడో మధ్యాహ్నం తిని నైట్ లేట్ గా తినే సమయానికి ఆకలి బాగా అవుతుంది. దాంతో మీరు మోతాదుకు మించి ఎక్కువగా తినే అవకాశం ఉంది. అవసరానికి మించి కేలరీలు శరీరంలోకి చేరిపోతే బరువు అమాంతం పెరిగే అవకాశం ఉంది. 

59

ముఖ్యంగా రాత్రి పూట తేలికపాటి ఆహారాన్నే తీసుకోవాలి. లేకపోతే  అజీర్థి సమస్యలొచ్చి బరువు పెరిగే అవకాశం ఉంది. ఎలాంటి భోజనం చేయాలో తెలియకనే చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నారు. 

69

కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల బరువు విపరీతంగా పెరగడమే కాదు అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.. 

79

మీ భోజనానికి.. నిద్రము మధ్యన రెండు గంటల సమయం ఉండేట్టు చూసుకోవాలి. పడుకునే ముందే తింటే అజీర్థి సమస్యలు వస్తాయి. 

89

ఆందోళన, ఒత్తిడి కారణంగా కూడా ఒక్కోసారి ఫుడ్ ను ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. పనిలో ఒత్తిడి కారణంగా రాత్రిళ్లు తమకు తెలియకుండానే ఎక్కువగా తినేస్తుంటారు. రాత్రిపూట మీరు తిన్నా.. ఎలాంటి ఆహారం తింటున్నామో తెలసుకోవాలి. 
 

99

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే తిన్న వెంటనే పడుకోకూడదు. కాసేపు నడిచి.. తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఇలా చేస్తే  తిన్నది తొందరగా జీర్ణం అవడమే కాదు.. హాయిగా నిద్రపోతారు కూడా.  
 

Read more Photos on
click me!

Recommended Stories