స్టార్‌బక్స్‌ లోగోలో ఈ మత్స్యకన్న ఎందుకు ఉంటుందో తెలుసా.? పెద్ద చరిత్రే ఉందడోయ్‌..

Published : Jan 19, 2025, 10:36 AM IST

ప్రతీ కంపెనీకి ఒక లోగో ఉంటుంది. ఇది ఆ సంస్థ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసేందుకు ఉపయోగపడుతుంది. అయితే కంపెనీల లోగోల రూపకల్పన వెనకాల ఎన్నో కారణాలు ఉంటాయి. అలాంటి వాటిలో ప్రముఖ కాఫీ బ్రాండ్ స్టార్‌బక్స్‌ ఒకటి. స్టార్‌బక్స్‌ కాఫీ కప్పులపై కనిపించే మత్స్యకన్నను ఎందుకు పెట్టారో ఎప్పుడైనా ఆలోచించారా.? ఇందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
14
స్టార్‌బక్స్‌ లోగోలో ఈ మత్స్యకన్న ఎందుకు ఉంటుందో తెలుసా.? పెద్ద చరిత్రే ఉందడోయ్‌..
Starbucks

స్టార్‌బక్స్‌ అనే పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఖరీదైన కాఫీలకు పెట్టింది పేరు ఈ కంపెనీ. ఎక్కడో అమెరికాలోని సియాటెల్‌ నగరంలో మొదలైన స్టార్‌బక్స్‌ హైదరాబాద్‌లోనూ అవుట్‌ లెట్స్‌ ఓపెన్‌ చేసే రేంజ్‌కి ఎదిగింది అంటేనే ఈ బ్రాండ్ క్రేజ్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం స్టార్‌బక్స్‌ ప్రపంచంలోని 80 దేశాల్లో 33 వేలకు పైగా స్టోర్స్‌ ఉన్నాయి. స్టార్​బక్స్​ బ్రాండ్​ విలువ 100 బిలియన్​ డాలర్లకు చేరింది. ఇదిలా ఉంటే స్టార్‌బక్స్‌ అనగానే చాలా మందికి దాని లోగోనే గుర్తొస్తుంది. 

24

తాగే కాఫీ కప్పులపై మొదలు అన్ని రకాల స్టార్‌ బక్స్‌ ప్రొడక్ట్స్‌పై మత్య్సకన్య బొమ్మ ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా.? దీని వెనకాల పెద్ద చరిత్రే దాగి ఉంది. స్టార్‌బక్స్‌ 1971లో ప్రారంభించారు. ఈ కంపెనీ ప్రారంభించిన సమయంలో దాని అసలు పేరు పెక్వోడ్. ఇది ఓడ పేరు. అయితే కంపెనీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్‌ కాలేకపోయింది. అప్పటికి ఫేమస్​ అయిన ‘మోబీ–డిక్​’ నవలలోని క్యారెక్టర్​ అయిన ‘స్టార్​బక్​’ పేరు పెట్టారు.
 

34

దీనికి కంపెనీ 'S' అక్షరాన్ని యాడ్ చేసింది. ఈ నవల్లో తిమింగలాల వేటకు వాడే పడవకు కెప్టెన్​ స్టార్​బక్​. లోగో కోసం గ్రీక్​ పురాణాల్లో కనిపించే ‘రెండు తోకల మత్స్యకన్య’ బొమ్మను  ఎంచుకున్నారు. కారణం ఏంటంటే మత్స్యకన్యలు పడవల్లో వెళ్లేవాళ్లను ఆకర్షిస్తారు. అలాగే, తమ కాఫీ షాప్​ కూడా కస్టమర్లను ఆకర్షించాలనుకున్నారు. అందుకే ఈ మత్స్యకన్న ఫొటోను లోగోపై డిజైన్‌ చేశారు. 
 

44

ఇదిలా ఉంటే స్టార్‌బక్స్‌ లోగోలో కనిపించే మత్య్సకన్న మొదటి నుంచి ఇలా ఉండేది కాదు. కాలంతో పాటు ఈ లోగోలో మార్పులు చేస్తూ వచ్చారు. ఇంతకు ముందు ఈ మత్స్యకన్య గోధుమ కలర్‌లో ఉండేది. ఆ తర్వాత బ్రౌన్‌ కలర్‌ను గ్రీన్‌ కలర్‌లోకి మార్చారు. చివరిసారిగా స్టార్‌బక్స్‌ లోగోను 2011లో మార్చారు. ఇప్పుడున్న లోగో 2011లో డిజైన్‌ చేసిందే. ఇదండీ ఈ మత్య్సకన్న వెనకాల ఉన్న అసలు కథ. 

click me!

Recommended Stories