మహిళలు కాలికి మెట్టెలు పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా?

First Published Nov 29, 2022, 5:49 PM IST

హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లయిన మహిళలు కాలికి మెట్టెలు పెట్టుకోవడం మనం చూస్తుంటాము. అయితే ఇలా మెట్టెలు పెట్టుకోవడం సాంప్రదాయమే కాకుండా దీని వెనుక సైన్స్ దాగివుంది.

హిందూ సంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పెళ్లైన మహిళ మెడలో మంగళసూత్రంతో పాటు కాలికి మెట్టెలు కూడా పెట్టుకుంటారు. ఈ విధంగా కాలికి మెట్టెలు పెట్టుకోవడం కేవలం సాంప్రదాయం మాత్రమేనని చాలామంది భావిస్తారు. అయితే ఇలా మెట్టెలు పెట్టుకోవడం వెనుక ఎంతో సైన్స్ దాగి ఉందని చాలామందికి తెలియదు.
 

పెళ్లి తర్వాత మహిళలు మెట్టలు పెట్టుకోవడానికి గల కారణం ఏంటి ఈ మెట్టెలు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయాన్ని వస్తే... వివాహం అనంతరం మహిళలు కేవలం సాంప్రదాయబద్ధంగా మాత్రమే కాకుండా మెట్టెలు పెట్టుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మన శరీరంలో ఉండే అన్ని అవయవాలకు సంబంధించి ప్రధాన నాడులు ఉంటాయి. అయితే ప్రధాన నాడీ వ్యవస్థను అలాగే ఇతర నాడుల కొనల్ని మనం ప్రేరేపించినప్పుడు ఆనాడుల ద్వారా ఆ శరీర భాగాలు ఉత్తేజితమవుతుంటాయి.
 

ఈ క్రమంలోనే మన కాలి బొటనవేలు మధ్యలో గుంతగా ఉండటం వల్ల మనం నడిచేటప్పుడు మన బొటన వేలు నేలను తాకదు. అందువల్ల కాలికి మెట్టెలు తొడుగుతారు. ఇలా మెట్టెలు తొడిగి మనం నడిచిన ప్రతిసారి వేళ్ళు భూమిని తాకుతూ అక్కడ ఉన్నటువంటి నాడులు ప్రేరేపితం అవుతాయి. 
 

ఇలా మన అరికాలలో ఒక్కో భాగం మన శరీరంలో ఒక్కో వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. ఇలా మెట్టెలు ధరించి మనం పాదాన్ని నేలకు తాకుతూ నడవడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు ఉత్తేజితం అవడం కోసమే ఇలా కాలికి మెట్టెలను తొడుగుతారు.
 

మనం నేలను తాకుతూ నడవడం వల్ల అక్కడున్నటువంటి నాడులో ప్రధానంగా గర్భాశయాన్ని ప్రేరేపించడం వల్ల గర్భాశయ సమస్యలు తొలగిపోవడమే కాకుండా తొందరగా సంతానోత్పత్తి కలగడానికి దోహదపడుతుంది. అందుకే పెద్దవాళ్లు పెళ్లి తర్వాత కాలికి మెట్టెలు తొడిగే సాంప్రదాయాన్ని తీసుకువచ్చారు. అదేవిధంగా మన ఒంట్లో ఉన్నటువంటి వేడిని మొత్తం గ్రహించే శక్తి కూడా వెండికి ఉంటుంది.

click me!