అత్యంత ఖరీదైన రిసార్ట్ లో హనీమూన్ కి అంబానీ కపుల్, ఒక్క రాత్రికి ఎంతో తెలుసా?

First Published | Aug 8, 2024, 4:56 PM IST

అయితే.. ఇప్పుడు ఈ కొత్త జంట హనీమూన్ కి వెళ్లింది. హనీమూన్ కోసం కొస్టారికా అనే ప్లేస్ కి వెళ్లినట్లు సమాచారం.  అనంత్ , రాధికలు.. ఆగస్టు 1 వ తేదీన కోస్టారికా చేరుకున్నారు. 

మన దేశ కుబేరుడు ముకేష్ అంబానీ కి పరిచయం అవసరం లేదు. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ఇటీవల జులై 12వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. అనంత్ తాను ప్రేమించిన రాధిక మర్చంట్ మెడలో తాళి కట్టాడు. వీరి వివాహ వేడుకకు.. దేశంలోని చాలా మంది సెలబ్రెటీలు హాజరై సందడి చేశారు. 
 

Radhika Merchant

కాగా.. పెళ్లి తర్వాత.. ఈ న్యూలీ వెడ్డింగ్ కపుల్  పారిస్ వెళ్లారు. అక్కడ ఒలంపిక్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఒలంపిక్ మ్యాచులను వీక్షించడానికి వారు అక్కడకు వచ్చారు. ఈ కొత్త దంపతులతో పాటు.. అంబానీ ఫ్యామిలీ మొత్తం అక్కడ కనిపించింది.


అయితే.. ఇప్పుడు ఈ కొత్త జంట హనీమూన్ కి వెళ్లింది. హనీమూన్ కోసం కొస్టారికా అనే ప్లేస్ కి వెళ్లినట్లు సమాచారం.  అనంత్ , రాధికలు.. ఆగస్టు 1 వ తేదీన కోస్టారికా చేరుకున్నారు. అక్కడ కాసాలాస్ ఓలాస్ లో ఉంటున్నట్లు సమాచారం. వారు బస చేస్తున్న రిసార్ట్ ఖరీదు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఈ రిసార్ట్‌లో బస చేయడానికి ఒక రాత్రికి $30,000 ఖర్చు అవుతుంది, ఇది రూ. 25 లక్షలకు పైగా ఉంది. కాసా లాస్ ఓలాస్ ప్రీటా బే వీక్షణలతో కూడిన విలాసవంతమైన రిసార్ట్. చాలా పెద్ద రిసార్ట్. చూడటానికి చాలా లగ్జరీయస్ గా ఉంటుందట. 100-అడుగుల స్విమ్మింగ్ పూల్ , ఓపెన్ ఎయిర్‌తో.. సంపన్నులు మాత్రమే వెళ్లగల అతి పెద్ద రిసార్ట్ ఇది కావడం విశేషం. 
 

ఇక అనంత్- రాధికల వివాహానికి మన దేశంలోని సెలబ్రెటీలు మాత్రమే కాదు.. ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు.  ఇవాంకా ట్రంప్, మార్క్ జుకర్‌బర్గ్, బిల్ గేట్స్, జస్టిన్ బీబర్, కర్దాషియాన్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. అనంత్- రాధిక వివాహానికి దాదాపు రూ.5వేల కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. 
 

Latest Videos

click me!