Relationship tips: బ్రేకప్ అయ్యిందని బాధపడుతున్నారా? అయితే ఇకనుంచి వద్దు.. ఎందుకంటే?

First Published | Jan 21, 2022, 2:32 PM IST

Relationship tips:ప్రస్తుత కాలంలో రిలేషిప్స్ ఎక్కువ కాలం నిలవలేకపోతున్నాయి. సాధారణ వ్యక్తుల నుంచి మొదలు పెడితే.. సెలబ్రిటీల వరకూ వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేకపోతోంది. విడాకులు తీసుకుంటూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. అయితే ఈ విడాకుల ఒంటరివాళ్లమయ్యామనే ఫీలింగ్ మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది. ఆ బాధనుంచి బయటపడాలంటే చాలా కాలమే పడుతుంది. అయితే ఒంటరితనం కూడా..

Relationship tips: జీవితం అన్నాక సుఖ దుఖాలు సర్వసాధారణం. వాటన్నింటిని సమంగా స్వీకరిస్తేనే లైఫ్ జర్నీ హ్యాపీగా సాగేది. ఒకరికొకరు తోడుగా బతకాలంటే మాత్రం అర్థం చేసుకునే మనస్తత్వం కావాలి. అది లేకపోతేనే భాగస్వాముల మధ్య ఎన్నో సమస్యలు, చికాకులు వస్తాయి. అయితే ప్రస్తుత కాలంలో కొన్ని చిన్న చిన్న కారణాలు అడ్డుపెట్టుకుని తమ భాగస్వాములకు బ్రేకప్ చెప్తున్నారు. సాధారణ వ్యక్తుల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా తమ భాగస్వాములతో కలిసి బతకలేమంటూ విడాకులు తీసుకుంటు ఎవరి జీవితం వారు గడుపుతున్నారు. 

ఈ బ్రేకప్ వల్ల వారు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సమాజం పరంగా ఎన్నో అవమానాలను, ఎదురు దెబ్బలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతో వారు మానసికంగా బాగా వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కసారిగా తమ భాగస్వామి తమతో లేడనే విషయం వారిని కుదురుగా ఉండనివ్వదు. దాంతో వాళ్లు తీవ్ర మనో వేధనకు, ఆందోళనకు గురవుతుంటారు. అయితే సింగిల్ గా అవడం వల్ల కూడా చాలా ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 



సింగిల్ అయ్యానని బాధపడేకంటే ఆ మూమెంట్ ను ఎంజాయ్ చేయడం ఉత్తమం. ఎందుకంటే జరిగిన దానిని మీరు ఎలాగూ మార్చలేదు. అందుకని బాధపడుతూ కూర్చుంటే విలువైన కాలం గడిపోతుంది. అందుకని సింగిల్ ఉన్నానని ఫీల్ అవకుండా ఆ మూమెంట్ ను ట్రావెల్ కు ఉపయోగించుకోండి. దీనికి మీరు ఎకరి పర్మీషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. అందులోనూ ట్రావెలింగ్ చేయడం వల్ల గొప్ప అనుభూతి లభిస్తుంది. 

సింగిల్ గా ఉండటం వల్ల కలిగే మరొక ముఖ్యమైన ఉపయోగం ఏంటో తెలుసా.. గ్రోత్.  అవును మీకు మీరు స్వతహాగా లైఫ్ లో ఎదగడానికి ఒంటరితన బాగా ఉపయోగపడుతుంది. అందులోనూ మీలో దాగున్న అసలైన ప్రతిభ అలాంటి సమయంలోనే బయటపడుతుంది. సింగిల్ గా ఉండటం వల్ల మీ లక్ష్యాలను, ధ్యేయాలను ఈజీగా నెరవేర్చుకోగలుగుతారు. 

సింగిల్ ఉన్న సమయంలో మీరు కొత్తగా ప్రేమలో పడితే వారి గురించి పూర్తిగా తెలుసుకుని వారితో మింగిల్ అవ్వొచ్చు. ఒకరిగురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీ బంధాన్ని కలకాలం నిలుపుకోవచ్చు. 
 

సింగిల్ ఉన్నవారికి కలిగే అతిపెద్ద లాభం ఏంటో తెలుసా.. టైం. అవును ఈ సింగిల్ గా ఉన్న టైం లో మీతో మీకు గడపడానికి కావాల్సినంత టైం దొరుకుంది. ఆ సమయంలో మీకు నచ్చిన విషయాల గురించే ఆలోచించండి. మీకు చేయాల్సిన పనులకే కేటాయించండి. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి,  అర్థం చేసుకోవడానికి ఈ సమయం ఎంతో ఉపయోగపడుతుంది. 

సింగిల్ గా ఉన్నప్పుడే మీ పై మీకు నమ్మకం ఎక్కువగా వస్తుంది. స్వతంత్ర్యంగా బతకగలుగుతారు. అప్పుడే మీరు మరింత స్ట్రాంగ్ గా మారుతారు.

రిలేషన్స్ షిప్స్ అన్నప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ప్రతి విషయానికి కాంప్రమైజ్ అవడం, సర్దుకుపోవడం వంటి సర్వసాధారణం. అదే సింగిల్ గా ఉన్నప్పుడు నీకు నువ్వు నచ్చినట్టుగా బతికే స్వేచ్ఛ ఉంటుంది. నీ లైఫ్ ను నీకు నచ్చినట్టుగా మలుచుకోవచ్చు. మీరు మీరుగా ఉండటానికి ఇదే సరైన సమయం. ఒకరికోసం మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం సింగిల్ ఉన్నప్పుడు అవసరం లేదు. అందుకే సింగిల్ గా ఉన్నాననే బాధపడకుండా దాన్ని మీ జీవితాన్ని మలుపుతిప్పే సమయంగా భావించండి. అప్పుడే మీ లైఫ్ జర్నీ అందంగా, సంతోషంగా మారుతుంది. 

Latest Videos

click me!