పగిలిపోయిన టైల్స్ ను ఎలా అతికించాలో తెలుసా?

First Published | Oct 28, 2024, 4:38 PM IST

టైల్స్ చాలా సున్నితంగా ఉంటాయి. ఏదైనా గట్టిది వీటిపై పడితే వెంటనే పగిలిపోతాయి. ఇలా పగిలిపోయిన టైల్స్ ను ఎలా సులువుగా అతికించాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. 

ఇంట్లోనే టైల్స్ రిపేర్

ఒకప్పుడు కిచెన్, బాత్ రూముల్లోనే టైల్స్ ను వాడేవారు. ఇప్పుడు ఇంట్లో అంతటా టైల్స్ నే వాడుతున్నారు. కానీ టైల్స్ మార్బుల్స్ కంటే చాలా సున్నితంగా ఉంటాయి. అంటే ఏ చిన్న రాయి లేదా బరువైనది పడినా పగిలిపోతాయి. .

కానీ టైల్స్ వల్ల ఇంటికి మంచి లుక్ వస్తుందనేది మాత్రం నిజం. అందుకే చాలా మంది వీటినే వాడుతున్నారు. ఇవి చూడటానికి అందంగా ఉండటమే కాకుండా.. క్లీన్ చేయడం కూడా చాలా సులువు. 

ఇంట్లోనే టైల్స్ రిపేర్

కానీ కొన్ని కొన్ని సార్లు టైల్స్ పగుళ్లు ఏర్పడతాయి. కానీ దీనివల్ల ఇళ్లు అందవిహీనంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ పగుళ్లలో దుమ్ము, ధూళి వెళతాయి. ఇలాంటప్పుడు చాలా మంది టైల్స్ ను మారుస్తుంటారు. కానీ చాలా సార్లు ఇలా టైల్స్ ను మార్చడం ఖర్చుతో కూడుకున్నది. 

అసలు పగిలిపోయిన టైల్స్ ను ఇంట్లోనే ఎందుకు రిపేర్ చేయకూడదు. మీకు తెలుసా? కొన్ని సులువైన చిట్కాలతో ఇంట్లోనే పగిలిపోయిన టైల్స్ ను అందంగా అతికించొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


టైల్స్ రిపేర్ చిట్కాలు

పగిలిన టైల్స్ రిపేర్ చేయడానికి చిట్కాలు:

కావాల్సినవి ఏంటంటే?

పగిలిపోయిన టైల్స్ ను అతికించడానికి ఎపోక్సీ లిక్విడ్, తెల్ల సిమెంట్, కాటన్ లేదా మైక్రోఫైబర్ క్లాత్, టూత్‌పిక్, డిష్ వాష్ లిక్విడ్, వాటర్ అవసరమవుతయాి. అలాగే  క్రిమిసంహారక ద్రావణం. చేతులకు రక్షణగా గ్లౌజులు, సిమెంట్ దుమ్ము నుంచి రక్షణగా మాస్కులను కూడా వాడాలి. 

టైల్స్ శుభ్రం చేయడం

రిపేర్ చేసే ముందు టైల్స్ శుభ్రం చేయండి

పగిలిపోయిన టైల్స్ లోకి దుమ్ము, దూళి బాగా వెళతాయి. కాబట్టి వీటిని అతికించేముందు ఈ పగుళ్లలోని దుమ్ము, ధూళిని శుభ్రం చేయడం అవసరం. ఇందుకోసం డిష్ వాష్ లిక్విడ్‌తో శుభ్రం చేసి, నీళ్లతో కడగండి. అలాగే క్లాత్ తో తుడిచి బాగా  ఆరబెట్టండి.

టైల్స్ రిపేర్ చేసే విధానం

టైల్స్ రిపేర్ చేసే విధానం:

పగిలిపోయిన టైల్స్ ను అతికించడానికి ముందుగా ఎపోక్సీ లిక్విడ్, సిమెంట్‌ని నీళ్లతో కలిపి పేస్ట్ లా చేయండి. దీన్ని పగుళ్లలో నింపండి ఇందుకోసం మీరు టూత్ పిక్ ను ఉపయోగించొచ్చు. దీన్ని కనీసం 15-20 నిమిషాల పాటు ఆరనివ్వండి. మిగిలిన పేస్ట్‌ని తుడిచివేసి, డిష్ వాష్ లిక్విడ్‌తో శుభ్రం చేయండి. గ్లౌజులు, మాస్క్ వాడటం అస్సలు మర్చిపోకండి.

Latest Videos

click me!