పిల్లలు స్కూళ్లలో బిజీ.. నాన్నలు ఆఫీసుల్లో బిజీ.. అమ్మలు ఉద్యోగాలు, ఇంటి పనుల్లో బిజీ.. అందరికీ ఒకే ఒక రిలాక్సింగ్ టైం 'హాడిలే వేకేషన్'. ఎప్పుడైనా నాలుగు, ఐదు రోజులు సెలవలు దొరికితే హాయిగా ఏదైనా క్షేత్రాలు, టూరిస్ట్ ప్రదేశాలు తిరిగి వద్దామనుకుంటారు. ఇలాంటి వారి కోసం ఇండియన్ రైల్వే 5 రోజుల ప్రత్యేక లాంగ్ టూర్ ప్యాకేజీలు తీసుకొచ్చింది.
మహేశ్వర్, ఓంకారేశ్వర్, ఉజ్జయిని టూర్ ప్యాకేజీ..
ఇది 4 రాత్రులు, 5 పగళ్లు కలిగిన టూర్ ప్యాకేజీ. ఈ నెల అంటే ఆగస్టు 21 నుంచి హైదరాబాద్‌లో ఈ టూర్ ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీ ద్వారా ఇద్దరు కలిసి వెళితే ఒక్కోక్కరికీ రూ.26,400 ఖర్చవుతుంది. ముగ్గురు కలిసి ప్రయాణిస్తే ఒక్కోక్కరికి రూ.25,300 ఖర్చవుతుంది. పిల్లలకైతే కేవలం రూ.22,950 మాత్రమే. ఈ టూర్ ప్లాన్ తీసుకోవాలనుకున్న వారు ఇండియన్ రైల్వేస్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి టిక్కెట్స్ బుక్ చేసుకోవాలి. ఇందులోనే ఫ్లైట్ టిక్కెట్స్ కూడా బుక్ చేసుకొనే అవకాశం ఉంది.
డెహ్రాడూన్, హరిద్వార్, ముస్సోరీ, రిషికేశ్ టూర్ ప్యాకేజీ..
ఇది 5 రాత్రులు, 6 పగళ్లు ప్రయాణించే అవకాశం ఉన్న టూర్ ప్లాన్. ఈ ప్యాకేజీ బరేలీ, గోరఖ్‌పూర్, హర్దోయ్, లక్నో, కాన్పూర్, మొరాదాబాద్, సివాన్ జంక్షన్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఆగస్టు 23 తర్వాత ప్రతి శుక్రవారం టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇద్దరి కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరికీ రూ.27,810.. ముగ్గరు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరికీ రూ.21,920 ఖర్చవుతుంది. పిల్లలకైతే రూ.13,795 మాత్రమే.
గుల్‌మార్గ్, పహల్గాం, సోన్‌మార్గ్, శ్రీనగర్ టూర్ ప్యాకేజీ..
ఈ ప్యాకేజీ 5 రాత్రులు, 6 పగళ్లు కలిగిన ప్యాకేజీ. సెప్టెంబర్ 7 నుంచి చండీఘర్ నుంచి టూర్ ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో ఇద్దరు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరికీ రూ.31,200 ఖర్చవుతుంది. ముగ్గరు కలిసి ప్రయాణించే ప్లాన్‌లో ఒక్కొక్కరికీ రూ.29,800 అవుతుంది. పిల్లలకు మాత్రం రూ.21350 వెచ్చించాలి. ఈ ప్యాకేజీ ద్వారా ఫ్లైట్, బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంది. కావాలనుకున్న వారు ఉపయోగించుకోవచ్చు.