కిచెన్ లో వాడే స్క్రబ్బర్ తో కిడ్నీ సమస్యలు వస్తాయా..?

First Published | Sep 14, 2024, 11:46 AM IST

పాత్రలు శుభ్రం చేసే స్క్రబ్బర్ కూడా.. మన ఆరోగ్యాన్ని విపరీతంగా దెబ్బతీస్తుందని మీకు తెలుసా?

ఆరోగ్యాన్ని ఎవరు మాత్రం కాదనుకుంటారు..? అయితే.. మన ఆరోగ్యం  ఎక్కువగా.. మన కిచెన్ మీదే ఆధారపడి ఉంటుంది. మనం తినే ఆహారం కిచెన్ లోనే తయారౌతుంది. అయితే.. కేవలం అక్కడ తయారయ్యే ఆహారం మాత్రమే కాదు.. పాత్రలు శుభ్రం చేసే స్క్రబ్బర్ కూడా.. మన ఆరోగ్యాన్ని విపరీతంగా దెబ్బతీస్తుందని మీకు తెలుసా? ప్రాణాలను తీసే కిడ్నీ వ్యాధి కేవలం ఆ స్క్రబ్బర్ తోనే వస్తుందని మీకు తెలుసా? తాజా పరిశోధనలో చాలా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. స్క్రబ్బర్ తో వచ్చే సమస్యలు ఏంటో చూద్దాం...

మనం మన పాత్రలకు శుభ్రం చేసే స్క్రబ్బర్ ని పెద్దగా పట్టించుకోరు. కానీ.. దాంట్లో మనకు హాని చేసే బ్యాక్టీరియా చాలా ఉంటుంది. అందుకే.. ఒకే స్పాంజ్ ని ఎక్కువ రోజులు వాడకూడదు. తరచుగా మారుస్తూనే ఉండాలి. లేదంటే.. క్లీనింగ్ టూల్స్ ని వేరేవి ఎంచుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల... కాస్త ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.


కిచెన్ స్క్రబ్బర్... టాయ్ లెట్ బౌల్ కి మించిన బ్యాక్టీరియా ఉంటుందట. ఒక చిన్న క్యూబిక్ సెంటీమీటర్ స్క్రబ్బర్ లో 54 బిలియన్ల బ్యాక్టీరియా ఉంటుంది. ఇలాంటి బ్యాక్టీరియాతో ఉన్న స్క్రబ్బర్ ని రెగ్యులర్ గా వాడటం వల్ల... ఫుడ్ పాయిజినింగ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందట. అంతేకాదు.. అందులో ఉండే రకరకాల బ్యాక్టీరియాలు కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా వచ్చేస్తాయట.
 

నార్మల్ స్టీల్ స్క్రబ్బర్ కంటే.. స్పాంజ్ స్క్రబ్బర్ మరింత ప్రమాదకరంగా ఉంటుందట.  డిష్ వాష్ స్క్రబ్బర్ తో మనకు ఎలాంటి సమస్యలు రావొద్దన్నా వీటిని వారినికి ఒక సారి ఖచ్చితంగా మార్చాలి. వారానికి ఒకసారి డిష్ వాషింగ్ స్క్రబ్బర్ మార్చడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. లేదంటే దీనిలోని సూక్ష్మక్రిములు మనకు పేరు కూడా తెలయని ఎన్నో జబ్బులను తెచ్చి పెడతాయి. మీరు వారానికి ఒకసారి డిష్ వాష్ స్క్రబ్బర్ ను మార్చకపోతే మీరు దీన్ని క్లీన్ చేసి వాడొచ్చు. ఇందుకోసం మీరు డిష్ వాషర్ స్క్రబ్బర్ ను వేడి నీళ్లలో రెండు నిమిషాల పాటు నానబెట్టండి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలు రాకుండా ఉంటాయి.

Latest Videos

click me!