సమంతను కాపీ కొట్టిన అంబానీ చిన్న కోడలు రాధికా.. ఏ విషయంలో తెలుసా..?

First Published | Aug 9, 2024, 4:33 PM IST

కోట్ల రూపాయలు ఖర్చు చేసి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నరాధికా, అనంత్ అంబానీలు ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. ఇక తాజాగా రాధికా ఓ విషయంలో సమంతను ఫాలో అయినట్టు కనిపిస్తోంది. ఏ విషయంలో తెలిస్తే నోరెళ్లబెట్టేస్తారు.
 

గత నెలలో రాధికా మర్చంట్, అనంత్ అంబానీలు పెళ్లిపీఠలు ఎక్కిన సంగతి తెలిసిందే. ఈ కోటీశ్వరుల పెళ్లి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులంతా హాజరయ్యి ఎంత సందడి చేశారో మనం వార్తల్లో చూశాం. ఈ పెళ్లి తంతుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ గా మారాయి. అలాగే అంబానీ కుటుంబానికి చెందిన విలాసవంతమైన దుస్తులు, ఆభరణాలకు సంబంధించిన సమాచారం  బయటకొచ్చి సాధారణ జనాలు నోరెళ్లబెట్టేలా చేసింది. 
 

ఇకపోతే రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ గౌన్ మరోసారి వైరల్ గా మారింది. అందరి చూపు దానిపై పడేలా చేసింది. అనంత్ అంబానీ ప్రేమ లేఖలతో డిజైన్ చేసిన బ్లాక్ అండ్ వైట్ గౌన్ ను రాధిక ధరించింది. దీనిలో కొత్తేముంది అంటారేమో.. కానీ ఉంది.. ఈ విషయంలో రాధికా మర్చంట్ హీరోయిన్ సమంతను ఫాలో అయ్యిందని నెటిజన్లు అంటున్నారు. 
 


నాగ చైతన్య మాజీ భార్య సమంత తన నిశ్చితార్థ చీర చాలా స్పెషల్. ఎందుకంటే ఈ చీరకు ఆమె తన ప్రేమకథను ఎంబ్రాయిడరీ రూపంలో డిజైన్ చేయించింది. సమంత తన రొమాంటిక్ మూమెంట్స్ ఫోటోలను అందంగా తన ఎంగేజ్మెంట్ చీరకు డిజైన్ చేసి ధరించింది. రాధిక మర్చంట్ కూడా అనంత్ అంబానీ ప్రేమ లేఖలను తన గౌన్ పై ముద్రించి ధరించింది. అంటే సమంత నిశ్చితార్థ చీర ఐడియా ను తలపిస్తోంది. 
 

సమంత తన మాజీ భర్త నాగచైతన్యతో నిశ్చితార్థం కోసం బంగారు దారాలతో చేసిన వైట్ కలర్ సారీని ధరించింది. సమంత, నాగ చైతన్యల ప్రేమకథను వివరించే ఎంతో  కష్టమైన వర్క్ తో డిజైన్ చేసిన ఈ చీర అప్పట్లో అందరి దృష్టిని తెగ ఆకర్షించింది.
 

నాగ చైతన్యపై తనకున్న ప్రేమను సమంత ఎంతో సరికొత్తగా వ్యక్తపరిచిందని చాలా మంది ఈమెను ప్రశంసించారు. కానీ సమంత ప్రేమ పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లయిన నాలుగేళ్లకే వీరిద్దరూ  మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. ఇక ఆగస్టు 8న నాగ చైతన్య నటి శోభితా ధూళిపాళతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అయితే వీరిద్దరు చాలా కాలం నుంచి డేటింగ్ లో ఉన్నట్టు ఎన్నో పుకార్లు వచ్చాయి. 

Latest Videos

click me!