Diabetes: మీ బాడీలో ఈ ఐదు మార్పులు కనిపిస్తే వెంటనే షుగర్ టెస్ట్ చేయించుకోండి.. లేదంటే.?

Published : Apr 18, 2022, 04:59 PM IST

Diabetes Symptoms: షుగర్ కు చికిత్స లేదు. కానీ మన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు వంటి ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు. అయితే మీకు డయాబెటీస్ వస్తే మీ శరీరంలో ఈ ఐదు రకాల మర్పులు కనిపిస్తాయి.   

PREV
17
Diabetes: మీ బాడీలో ఈ ఐదు మార్పులు కనిపిస్తే వెంటనే షుగర్ టెస్ట్ చేయించుకోండి.. లేదంటే.?

Diabetes Symptoms: ఉరుకుల పరుగుల జీవితం.. సమయమే లేని జీవినవిధానం వల్ల మన దేశంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ డయాబెటీస్ వ్యాధి అంత తొందరగా తగ్గదు. ఇది ఒక్కసారి వచ్చిందంటే ఇక మనం బ్రతికినన్ని రోజులు మనతోనే ఉంటంది. ఇది రెండు రకాలు. ఒకటి టైప్ 1 డయాబెటీస్, రెండు టైప్ 2 డయాబెటీస్. ఈ వ్యాధిని మొదటి దశలోనే గుర్తిస్తే దీనిని నియంత్రించడం సులువు అవుతుంది. మరి దీని లక్షణాలను ఎలా గుర్తించాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.. 

27

తరచుగా ఆకలిగా అనిపించడం.. డయాబెటీస్ రోగులకు తరచుగా ఆకలి అవుతుంది. ఒకవేళ మీకు కూడా తరచుగా ఆకలిగా అనిపిస్తే వెంటనే షుగర్ టెస్ట్ ను చేసుకోవడం ఉత్తమం. 

37

దాహం తీరకపోవడం.. డయాబెటీస్ పేషెంట్లు ఎన్ని నీళ్లు తాగినా దాహం మాత్రం తీరదు. తాగినా కొద్దీ ఇంకా ఇంకా దాహం అవుతూనే ఉంటుంది. మీకు కూడా ఎన్ని నీళ్లు తాగినా.. నోరు ఎండిపోతూ ఉంటే డయాబెటీస్ పరీక్ష చేయించుకోవడం మర్చిపోవద్దు. 

47

రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన చేయడం.. రాత్రపూట నాలుగైదు సార్లకంటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తున్నారా? అయితే మీరు ఖచ్చితంగా షుగర్ ను టెస్ట్ ను చేయించుకోవాల్సిందేనంటున్నారు వైద్యులు. ఎందుకంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగితే తరచుగా మూత్రం వస్తుంది. 
 

57

బరువు తగ్గడం.. అకస్మత్తుగా బరువు తగ్గారా? డౌటే లేదు అది మధుమేహం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. డయాబెటీస్ పేషెంట్లు కూడా ఉన్నట్టుండి బరువు తగ్గుతారు. 

67

ఊరికే అలసిపోవడం.. ఒకప్పుడు మీరు 10 నుంచి 12 గంటలు పనిచేసినా.. అలసిపోకుండా ఉండి.. ఇప్పుడు 8 గంటల కంటే తక్కువ సేపే పనిచేసినా.. అలసిపోతున్నారా. అయితే మీకు డయాబెటీస్ వచ్చి ఉండొచ్చు. 

77

ప్రస్తుత కాలంలో ఎవరికి ఏ రోగం వస్తుందో అస్సలు చెప్పలేము. ముఖ్యంగా డయాబెటీస్ రోగం సైలెంట్ కిల్లర్ లా వ్యాపిస్తోంది. అందుకోసం దీని లక్షణాలు కనిపించే దాకా వెయిట్ చేయకుండా.. 30 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ రక్తంలో షుగర్ లెవెల్స్ ను టెస్ట్ చేసుకోవాలి. వన్స్ మీలో డయాబెటీస్ లక్షణాలు కనిపిస్తే డయాబెటీస్ టెస్టును తప్పక చేయించుకోవాలి. ఎందుకంటే దీన్ని మొదటి దశలో గుర్తిస్తే దీన్ని నియంత్రించవచ్చు. లేదంటే ఈ వ్యాధి ముదిరితే ప్రాణాల మీదికి రావొచ్చు. 

click me!

Recommended Stories