నిజానికి మధుమేహులకు ఇవి అంత డేంజరేమీ కావు.. వీటిని కూడా తినొచ్చు..

First Published | Nov 6, 2022, 11:52 AM IST

సాధారణంగా మధుమేహులు పిండి పదార్థాలను తక్కువగా, పోషకాలను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలనే తినాలి. అప్పుడే డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. 
 

రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే పరిస్థితినే డయాబెటిస్ అంటాం. ఇది కూడా ఒక రోగమే. కానీ లైఫ్ స్టైల్ లో కొన్ని తప్పుల వల్లే ఈ సమస్య వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా నేడు ఎంతో మంది టైప్ 2 డయాబెటీస్ తో బాధపడుతున్నారు. చిన్న చిన్న వాళ్లు కూడా దీనిబారిన పడుతున్నారు. మీకు షుగర్ ఉందని తెలిసినప్పటి నుంచి మీ లైఫ్ స్టైల్ లో ఎన్నో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటీస్ పేషెంట్లు మంచి ఆహారం, టైం ప్రకారం నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అప్పుడే వీరి ఆరోగ్యం కుదురుగా ఉంటుంది. లేదంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగి ఎన్నో ప్రాణాంతక రోగాలొచ్చే అవకాశం ఉంది. 
 

diabetes

సాధారణంగా డయాబెటీస్ పేషెంట్లు పిండి పదార్థాలు తక్కువగా ఉండే వాటిని, పోషకాలు ఎక్కువుండే  ఆహారాలను తినాలి. అలాగే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను తినాల్సి ఉంటుంది. నిజానికి మధుమేహాన్ని నియంత్రించడంలో ఫుడ్ యే కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఫుడ్ విషయంలో కేర్ ఫుల్ గా ఉండాలి. ఏవి తినాలి? ఏవి తినకూడదు అన్న విషయాలను తెలుసుకోవాలి. అయితే కొంతమంది షుగర్ పేషెంట్లకు ఫుడ్ విషయంలో అనుమానాలుంటాయి. ఆరోగ్యకరమైన వాటిని తింటే కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని వాటిని పక్కన పెట్టేస్తుంటారు. అసలు మధుమేహ వ్యాధిగ్రస్తులు అపోహ పడుతున్న ఆహారాలేంటి.. వాటిని తినొచ్చా? లేదా? ఇప్పుడు తెలుసుకుందాం.. 


బియ్యం

మన దేశంలో దాదాపుగా అందరూ బియ్యాన్నే ఎక్కువగా తింటారు. కొంతమంది మూడుపూటలా అన్నేన్నే ఆహారంగా తీసుకుంటారు. అయితే ఈ బియ్యం డయాబెటీస్ పేషెంట్లకు అంత మంచిది కాదు.. దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని మొత్తమే తినకుండా ఉంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. షుగర్ పేషెంట్లు అన్నాన్ని మొత్తమే మానేయాల్సిన అవసరం లేదు. కానీ అన్నం పరిమాణం తగ్గించాలని చెబుతున్నారు. అయితే తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్ యే తినడం వీరి ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే బ్రౌన్ రైస్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. మనం అన్నం తిన్నప్పుడు.. ఈ ఫైబర్స్ పిండిపదార్థాలు త్వరగా శోషించుకోకుండా, కొవ్వుగా మారకుండా నిరోధిస్తాయి. డయాబెటీస్ నియంత్రణలో ఉండాలంటే మధుమేహులు వైట్ రైస్ కు బదులగా బ్రౌన్ రైస్ నే తినాలని నిపుణులు చెబుతున్నారు. తెల్ల బియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి దారితీస్తాయి. అందుకే షుగర్ పేషెంట్లు ఒకవేళ తెల్లబియ్యాన్ని తిన్నా.. చాలా తక్కువగా తినాల్సి ఉంటుంది. 

అరటిపండ్లు

కాలాలతో సంబంధం లేకుండా అరటిపండ్లు అందుబాటులో ఉంటాయి. అందులోనూ ఇవి చాలా చౌకగా లభిస్తాయి. అన్నింటికీ మించి తియ్యగా, టేస్టీగా ఉంటాయి. అందుకే ఈ పండ్లను చాలా మంది ఇష్టపడతారు. నిజానికి అరటిపండులో ఉండే పోషకాలు ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండే అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తియ్యగా ఉంటాయి కదా.. వీటిని డయాబెటీస్ పేషెంట్లు తినొచ్చా? లేదా ? అన్న అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. అయితే అరటిపండ్లలో షుగర్ కంటెంట్ కాస్త ఎక్కువగా ఉంటుంది.  కార్బోహైడ్రేట్లు కూడా వీటిలో ఉంటాయి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ అరటిపండ్లలో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండ్లను ఎలాంటి భయాలు పెట్టుకోకుండా తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. అలా వీటిని ఎక్కువ మొత్తంలో అసలే తినకూడదు. ఒకవేళ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి.
 

ఖర్జూరాలు

ఖర్జూరాలు చాలా చాలా తియ్యగా ఉంటాయి. అందుకే వీటిని మధుమేహులు తినడానికి కాస్త సందేహిస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. షుగర్ పేషెంట్లు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తిన్నా ఆరోగ్యానికి ఏ సమస్యా రాదు. ఖర్జూరాల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్లు రోజుకు రెండు లేదా మూడు ఖర్జూరాలను  ఎంచక్కా తినచ్చు. అయితే వీటిని తినడానికి ముందు వీటిని తినాలా? వద్దా? అనేది డాక్టర్ ను అడిగి తెలుసుకోండి.

Latest Videos

click me!