దంగల్‌ నటి మృతికి ఆ వ్యాధే కారణం! ఇది ఎందుకొస్తుందంటే?

2016 బ్లాక్ బస్టర్ మూవీ దంగల్ సినిమా చూసే ఉంటారు. దీనిలో బబితా ఫోగట్ గా చిన్నారి పాత్రలో నటించిన సుహానీ భట్నాగర్ ప్రస్తుత వయసు 19 ఏండ్లే. కానీ ఈ చిన్నవయసులోనే ఆమె తిరిగిరాని లోకానికి వెళ్లింది. ఈమె మరణ వార్త బాలివుడ్ ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది. అయితే ఈ నటి మరణానికి  డెర్మటోమియోసిస్ అనే వ్యాధే కారణమని సమాచారం. అసలు ఈ వ్యాధి అంటే ఏంటి? ఇది ఎందుకొస్తుందో తెలుసుకుందాం.. 

బ్లాక్ బస్టర్ మూవీ దంగల్ లో బబితా ఫోగట్ చిన్నారి పాత్ర గుర్తుండే ఉంటుంది. ఈ పాత్ర పోషించింది నటి సుహానీ భట్నాగర్. ఈమె బాలీవుడ్ లో మంచి చైల్డ్ ఆర్టిస్ట్. అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. బబితా ఫోగట్ పాత్రలో నటించి మంచి ప్రశంసలు అందుకుంది. ఈమె వయసు ప్రస్తుతం 19 సంవత్సరాలే. కానీ ఇంత చిన్నవయసులోనే ఈ ప్రపంచాన్ని వీడి ఎప్పటికీ తిరిగిరాని లోకానికి వెళ్లండి. 

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈ నటి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 16 న చనిపోయారు. సుహానీ భట్నాగర్ డెర్మటోమైయోసిటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు సమాచారం. ఈ వ్యాధి ఎలా వస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
 



డెర్మటోమియోసిస్ ఏంటే ఏంటి? 

డెర్మటోమైయోసిటిస్ అనేది చాలా భిన్నమైన వ్యాధి. ఇది చర్మం, కండరాలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కేటగిరీలో ఉంది.  ఈ వ్యాధిలో మన రోగనిరోధక వ్యవస్థ భిన్నంగా పనిచేస్తుంది. దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గి.. శరీరం వ్యాధులతో పోరాడలేకపోతుంది. ఈ సమస్య మగవారి కంటే ఆడవారికే ఎక్కువగా వస్తుంది. 
 

డెర్మటోమియోసిస్ లక్షణాలు

డెర్మటోమైయోసిస్ వ్యాధి మొదటి లక్షణం చర్మంపై కనిపిస్తుంది. దీనిలో చర్మం క్రమంగా నల్లబడటం ప్రారంభమవుతుంది. అలాగే దద్దుర్లు రావడం కూడా మొదలవుతుంది. దీని ప్రభావం ఎక్కువగా కళ్ల చుట్టూ, ముఖంపైనే కనిపిస్తుంది. ఈ దద్దుర్లు, దురద బాధాకరంగా ఉంటాయి.

ఈ వ్యాధి వచ్చిన వారు కూర్చోవడానికి, బరువులు ఎత్తడానికి, మెట్లు ఎక్కడానికి, దిగడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏ పనీ చేయకుండానే అలసటగా కూడా అనిపిస్తుంది. ఈ వ్యాధి వల్ల ఎగువ శరీరం కండరాలు క్రమంగా బలహీనపడటం ప్రారంభిస్తాయి. అలాగే సమస్య  రోజు రోజుకు పెరిగిపోతుంది. 
 

డెర్మటోమియోసిస్ వ్యాధికి కారణాలు

ఇప్పటివరకు ఈ వ్యాధికి గల కారణాలు సరిగ్గా తెలియదు. కానీ నిపుణుల ప్రకారం.. ఇది స్వయం ప్రతిరక్షక వ్యాధి అని నమ్ముతారు. దీని కారణంగా రోగనిరోధక వ్యవస్థ తన స్వంత ఆరోగ్యకరమైన కణజాలంపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. జెనెటిక్స్, కొన్ని రకాల మందులు, వైరస్ ఇన్ఫెక్షన్లు, స్మోకింగ్, ఇతర కారణాలు కూడా ఈ వ్యాధికి కారణమంటున్నారు నిపుణులు. 

Latest Videos

click me!