ఈ ఒక్క డ్రింక్ తాగితే.. ఎంత బరువైనా తగ్గొచ్చు..!

First Published Oct 5, 2024, 1:55 PM IST

ఇంట్లోనే తయారు చేసే.. కొన్ని డ్రింక్స్ తాగితే... ఈజీగా అధిక బరువును తగ్గించుకొని.. మీరు స్లిమ్ గా మారొచ్చు. మరి.. మీ అధిక బరువు, ఒంట్లో ఫ్యాట్ తగ్గించే ఓ స్పెషల్ డ్రింక్ గురించి ఈ రోజు మేము మీతో పంచుకుంటున్నాం. అది ఏంటో.. ఎలా చేయాలో చూద్దాం...

అధిక బరువు సమస్య ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తోంది. ఆ అధిక బరువు తగ్గించడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువు మాత్రమే కాదు... ఒంట్లో ఫ్యాట్ కరిగించడానికి కూడా  చాలా తిప్పలు పడుతూ ఉంటారు. అయితే...  మన కిచెన్ లో మనకు ఈజీగా లభించే  కొన్ని  పదార్థాలను వాడటం వల్ల.. సులభంగా బరువు తగ్గవచ్చని మీకు తెలుసా?


బరువు తగ్గాలి అంటే.. చాలా మంది కామన్ గా  ఫుడ్ తినడం మానేస్తారు. లేదంటే.. తీసుకునే క్వాంటిటీ తగ్గించేస్తారు. ఇలా చేస్తేనే బరువు తగ్గుతామని నమ్ముతుంటారు. కానీ... అధిక బరువు తగ్గడానికి అది కచ్చితంగా సరైన మార్గం కాదు. బరువు తగ్గడానికి మంచిగా బ్యాలెన్స్డ్ గా ఫుడ్ తీసుకుంటే... ఇంట్లోనే తయారు చేసే.. కొన్ని డ్రింక్స్ తాగితే... ఈజీగా అధిక బరువును తగ్గించుకొని.. మీరు స్లిమ్ గా మారొచ్చు. మరి.. మీ అధిక బరువు, ఒంట్లో ఫ్యాట్ తగ్గించే ఓ స్పెషల్ డ్రింక్ గురించి ఈ రోజు మేము మీతో పంచుకుంటున్నాం. అది ఏంటో.. ఎలా చేయాలో చూద్దాం...

మనకు కిచెన్ లో కరివేపాకు చాలా ఈజీగా లభిస్తుంది. అలాంటి కరివేపాకుకు వాము, జీలకర్ర, దనియాలు కూడా కలిపి తీసుకుంటే.. ఎంత బరువు అయినా ఈజీగా తగ్గవచ్చు. చాలా మంది కూరల్లో కరివేపాకు అని తీసి పక్కన పడేస్తారు. కానీ.. ఆ పడేసే ఆకే..మన బాడీలో పేరుకుపోయిన అదనపు ఫ్యాట్ ని ఈజీగా కరిగించేస్తుంది. కరివేపాకు బరువును తగ్గించడంలో, పొట్ట కొవ్వును తగ్గించడంలో, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో, చక్కెర స్థాయిలను తగ్గించడంలో , హిమోగ్లోబిన్‌ని పెంచడంలో ఉపయోగపడుతుంది.

Latest Videos


కరివేపాకు ఆకులు కడుపు  ఉబ్బరం, అజీర్ణం, దగ్గు, జలుబు, మధుమేహం , ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి. ఇది బరువు తగ్గడానికి కూడా మంచిది.
అంతేకాకుండా.. వీటితోపాటు దనియాలు తీసుకుంటే.. జీవక్రియను మెరుగుపరుస్తాయి. ఇది తలనొప్పి , హార్మోన్ల అసమతుల్యత నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది థైరాయిడ్‌కు కూడా మేలు చేస్తుంది. జీలకర్ర షుగర్, ఎసిడిటీ, మైగ్రేన్, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతోపాటు కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

చలికాలంలో అల్లం చాలా మంచిది. ఇది అజీర్ణం, గ్యాస్ , తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇది బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఈ టీ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో , PCOS లక్షణాలను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
ఈ టీ తాగడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సీజన్ మారినప్పుడు వచ్చే దగ్గు , జలుబు నుండి ఇది రక్షణను అందిస్తుంది.

weight loss

ఈ హెర్బల్ టీ ఎలా తయారు చేయాలంటే...
నీరు - 2 గ్లాసులు
కరివేపాకు - 8-10
దనియాలు - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1 tsp
యాలకుల పొడి - చిటికెడు
అల్లం - 1 అంగుళం తురుము
నిమ్మకాయ - సగం

అన్ని పదార్థాలను నీటిలో వేసి 5 నిమిషాలు ఉడకబెట్టండి.
ఇప్పుడు దానిని ఫిల్టర్ చేసి అందులో సగం నిమ్మరసం వేయాలి.
ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తాగండి.
 

click me!