ఒకటి, రెండు కాదు.. ఒకేసారి వేల పిల్లలకు జన్మనిచ్చే జీవుల గురించి విన్నారా?

First Published | Sep 12, 2024, 10:48 AM IST

ఈ భూమ్మీద ప్రాణం ఉన్న ప్రతి జీవి సంతానోత్పత్తి చేస్తుంది.  మనుషులైతే ఒకేసారి ఒకరిని మాత్రమే కనగలరు. అరుదుగా కవలలు, ముగ్గురు పిల్లలు పుడతారు. కానీ జంతు ప్రపంచంలో అలా ఉండదు. కొన్ని జంతువులు ఒకేసారి వేలది పిల్లలకు జన్మనిస్తాయి. ఇలా తమ సంతానాన్ని అత్యధికంగా పెంచే కొన్ని జీవుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

జంతు ప్రపంచం అనేది ఒక అద్భుతం. ఈ ప్రపంచంలో ఉండే అద్భుతమైన విషయాలు మానవులను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటాయి. సాధారణంగా మనుషులు ఒకేసారి ఒకటి లేదా అరుదుగా కవలలకు జన్మనిస్తారు. మరీ అరుదుగా ముగ్గురు, నలుగురు పిల్లలు పుట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. జంతు ప్రపంచం అలా కాదు. ఇక్కడ ఒకేసారి వేలది పిల్లలు జన్మిస్తాయి.

sea Horse

సముద్ర గుర్రాల్లో (sea Horse) మగ సముద్ర గుర్రం సంతానోత్పత్తి చేస్తుంది. ఇది ఒకేసారి రెండు వేల పిల్లలకు జన్మనిస్తుంది. ఈ సామర్థ్యం వల్లే దీనికి వాటర్ ఫిరంగి అనే పేరు వచ్చింది. మగ సీ హార్స్‌లే ఇక్కడ గుడ్లను పెడతాయి. సీ హార్స్‌ల జాతులను బట్టి ఒకేసారి 150 నుండి 2000 గుడ్లను పెడతాయి.  


ocean sun fish

సముద్ర సూర్య చేప (ocean sun fish). ఇది బరువైన ఎముకలను కలిగి ఉండే చేప. దాని విశిష్టమైన ఆకారమే దానికి పేరు తెచ్చింది. గుడ్లు పెట్టే సమయంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 మిలియన్ గుడ్లు పెడుతుంది. దీని సంతానోత్పత్తి సామర్థ్యం శాస్త్రవేత్తలకు ఇప్పటికీ ఆశ్యర్యాన్ని కలిగిస్తుంది. 

gray pertridge clutches

గ్రే పార్ట్రిడ్జ్ క్లచ్ (gray pertridge clutches) ఉత్తర అమెరికాకు చెందిన పక్షి. ఇది బూడిద రంగులో ఉంటుంది. ఈ చిన్న పక్షి కూడా దాని అద్భుతమైన సంతానోత్పత్తి చేయడం వల్లే ప్రసిద్ధి చెందింది. ఒకసారి గుడ్లు పెట్టడానికి కూర్చుంటే 16 నుండి 22 వరకు గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. పక్షుల్లో ఒకేసారి ఇన్ని గుడ్లు పెట్టడం మామూలు విషయం కాదు. 

African driver ants

ఆఫ్రికన్ డ్రైవర్ చీమలు (African driver ants) కూడా వాటి భారీ సంతానోత్పత్తి కారణంగా జంతు ప్రపంచంలో అద్భుతమైన జీవులుగా పేరుపొందాయి. ఈ చీమలు ప్రతి 35 రోజులకు 3 నుండి 4 మిలియన్ గుడ్లు పెడతాయి. అసలు ఇలాంటి జీవులు ఈ భూమ్మీద ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. 

Latest Videos

click me!